హజ్రత్ అలీ(అ.స) ప్రతిష్టత అహ్లె సున్నత్ గ్రంథాలలో

సోమ, 10/17/2022 - 17:50

ప్రముఖ అహ్లె సున్నత్ ముహద్దిసీన్ మరియు ఉలమాలు హజ్రత్ అలీ(అ.స) ప్రతిష్టతను వివరిస్తూ ఉల్లేఖించిన హదీసులు...

హజ్రత్ అలీ(అ.స) ప్రతిష్టత అహ్లె సున్నత్ గ్రంథాలలో

అహ్మద్ ఇబ్నె హంబల్ హజ్రత్ అలీ(ర.అ) ప్రతిష్టతల గురించి ఇలా వివరించెను: “ఎన్ని సరైన మరియు సహీ హదీసులు అలీ ప్రతిష్టతను వివరిస్తూ ఉన్నాయే సహాబీయుల నుండి ఎవ్వరికీ సంబంధించి అన్ని రివాయతులు లేవు”[1]

ఇబ్నె అబ్బాస్ కథనం: నా జ్ఞానం మరియు దైవప్రవక్త(స.అ) సహాబీయుల జ్ఞానం అలీ జ్ఞానం ముందు ఏడు సముద్రాల ముందు కేవలం ఒక (నీటి) చుక్క మాదిరి”[2]

తిర్మిజీ ఉల్లేఖనం; అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ ఇలా ఉల్లేఖించెను: “మస్జిదు వైపుకు తెరుచుకునే అందరి తలుపులు మూసివేయండి కేవలం ఒక్క అలీ ఇంటి తలుపు తప్ప అని దైవప్రవక్త(స.అ) ఆజ్ఞాపించారు”[3] 

ఇబ్నె అబ్బాస్ కథనం: “జ్ఞానం యొక్క తొమ్మిది భాగాలు అలీ ఇబ్నె అబీతాలిబ్ ప్రసాదించబడ్డాయి
అల్లాహ్ సాక్షిగా మిగిలిన పదొవ భాగంలో ప్రజలందరు భాగస్వాములు”[4]

హజ్రత్ అలీ(ర.అ) మరణించిన తరువాత ముఆవియహ్ ఇలా అనెను: “అలీ ఇబ్నె అబీతాలిబ్ మరణంతో జ్ఞానవిజ్ఞానాలు కూడా పోయాయి”[5]

మస్జిదు వైపుకు తెరుచుకొనే ఒక్క అలీ(ర.అ) ఇంటి తలుపు తప్ప సహాబీయులందరి ఇళ్ళ తలుపులను మూసివేయమని దైవప్రవక్త(స.అ) ఆజ్ఞాపించిన తరువాత కొందరు దాని గురించి (తప్పుగా) మాట్లాడుకుంటున్నప్పుడు దైవప్రవక్త(స.అ) నిలబడి ఇలా అన్నారు: దీనిని నిర్వర్తించేందుకు నేను ఆజ్ఞాపించబడ్డాను. అల్లాహ్ సాక్షిగా నేను ఏ ఒక్క తలుపు మూయలేదు మరియు ఏ తలుపు తెరవలేదు. నేను కేవలం ఆజ్ఞను పాటించాను.[6]

హజ్రత్ ఉమర్(ర.అ) హజ్రత్ అలీ(ర.అ) విజ్ఞానం గురించి చాలా సందర్భాలలో ఇలా అన్నారు: “అలీయే లేకుంటే నేను నాశనమైపోయేవాడ్ని” [7]

ఉమ్ముల్ మొమినీన్ హజ్రత్ ఆయిషహ్(ర.అ) హజ్రత్ అలీ(ర.అ) జ్ఞానం గురించి ఇలా ఉల్లేఖించెను: “అలీ(ర.అ) ప్రజలందరిలో దైవప్రవక్త(స.అ) సున్నత్ పట్ల ఎక్కవ జ్ఞానం కలిగివున్నవారు” [8]

అబూహురైరహ్ కథనం: “హజ్రత్ ఉమర్(ర.అ) హజ్రత్ అలీ(ర.అ) గురించి ఇలా అన్నారు: తీర్పు ఇవ్వడంలో అలీ మా అందరిలో ఉత్తములు.[9]

ముఆవియహ్ ఇలా ఉల్లేఖించెను: “హజ్రత్ ఉమర్(ర.అ) కు కష్టం ఎదురొచ్చినప్పుడల్లా, దాని పరిష్కార మార్గాన్ని అలీ(ర.అ)ను అడిగి తెలుసుకునేవారు”[10]

అబూ ఉస్మాన్ జాహిజ్ కథనం ప్రకారం బనీ ఉమయ్యాహ్ నుండి కొందరు ముఆవియహ్ తో ఇలా అన్నారు: నువ్వు అనుకున్నది పొందావు, ఇక అలీను దూషించటం మానేయి!. ముఆవియహ్: అసంభవం, అల్లాహ్ సాక్షిగా! పిల్లలు పెద్దవారయ్యే వరకు పెద్దవాళ్లు ముసలివారు అయ్యే వరకు మరియు ఎవ్వరూ అలీ ప్రతిష్టతలు చెప్పుకోనంత వరకు ఇది కొనసాగుతూనే ఉంటుంది.[11]

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “అలీ నా జ్ఞానం యొక్క ద్వారము, నా తరువాత నా సందేశాలను నా ఉమ్మత్ కోసం వివరిస్తారు. అతని పట్ల ప్రేమ విశ్వాసా(నికి నిదర్శనం) మరియు శత్రుత్వం కపటానికి.[12]

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “నేను విజ్ఞాన పట్టణాన్ని, అబూబక్ర్ దాని యొక్క మూలం, ఉమర్ దాని యొక్క గోడలు, ఉస్మాన్ దాని యొక్క పైకప్పు మరియు అలీ దాని యొక్క ద్వారము.[13]

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “అలీ నా ఉమ్మత్ లో ముందుగా ఇస్లాంను స్వీకరించినవారు. జ్ఞానపరంగా ఉత్తమ స్థాయి కలిగివున్నవారు. దీన్ పరంగా స్వచ్ఛత గలవారు. విశ్వాసపరంగా ఔన్నత్యం గలవారు. ఔదార్యంలో సంపూర్ణత కలిగివున్నవారు. ఉదార హృదయం గలవారు. వారు (నా తరువాత) నా ఉమ్మత్ యొక్క నాయకుడు.[14]

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “ఎవరైతే నాపై విశ్వాసం కలిగి ఉండి నన్ను నమ్ముతున్నారో వారు నిస్సందేహంగా అలీ ఇబ్నె అబీతాలిబ్ విలాయత్(నాయకత్వం) ముందు తలవంచాల్సిందే(నమ్మాల్సిందే) ఎందుకంటే వారి విలాయత్
నా విలయత్ కాబట్టి మరి నా విలాయత్ అల్లాహ్ విలాయత్ కాబట్టి.[15]

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “అలీ అతిఉత్తమ మనిషి, అతని విలాయత్ ను నిరాకరించినవారు ఎవరైనా సరే అతడి అవిశ్వాసి”[16]

రిఫరెన్స్
1. ఫత్హుల్ బారీ, భాగం7, పేజీ57.
2. అల్ ఫుతూహాతుల్ ఇస్లామియహ్, భాగం2, పేజీ468, దారు సాదిర్, బీరూత్, లెబ్నాన్.
3. సహీ తిర్మిజీ, భాగం2, పేజీ301.
4. అల్ ఫుతూహాతుల్ ఇస్లామియహ్, భాగం2, పేజీ468, దారు సాదిర్, బీరూత్, లెబ్నాన్.
5. అల్ ఫుతూహాతుల్ ఇస్లామియహ్, భాగం2, పేజీ468, దారు సాదిర్, బీరూత్, లెబ్నాన్.
6. అహ్లె సున్నత్ హదీస్ గ్రంథాలు: నిసాయి ఖసాయిసు అమీరిల్ మొమినీన్, అహ్మద్ ఇబ్నె హంబల్-ముస్నద్ భాగం4, పేజీ396, ఇబ్నె హజర్ అస్ఖలానీ-ఫత్హుల్ బారీ భాగం7 పేజీ12 మొ...; షియా హదీస్ గ్రంథాలు :మజ్లిసీ, బిహార్ భాగం39, పేజీ27. షహ్రె ఆషూబ్, మనాఖిబె అలె అబీతాలిబ్, భాగం2, పేజీ37
7. అహ్లె సున్నత్ రిఫరెన్స్.. తావీలు ముఖ్తలిఫిల్ హదీస్, ఇబ్నె ఖుతైబహ్, పేజీ152. అల్ తఫ్సీరుల్ కబీర్, ఫఖ్రె రాజీ, భాగం21, పేజీ22. షర్హె నెహ్జుల్ బలాగహ్, ఇబ్నె అబిల్ హదీద్, భాగం1, పేజీ18 & భాగం12, పేజీ179. యనాబీవుల్ మువద్దహ్, ఖందూజీ హనఫీ, భాగం1, పేజీ216 & భాగం2, పేజీ172 & భాగం3, పేజీ147. అల్ ముఫస్సల్, జమఖ్షరీ, భాగం1, పేజీ432. మొ...; షియా రిఫరెన్స్: అల్ కాఫీ, కులైనీ, భాగం7, పేజీ424. తహ్జీబ్, షేఖ్ తూసీ, భాగం6, పేజీ606. మన్ లా యహ్జుర్, షేఖ్ సదూఖ్, భాగం4, పేజీ36. ఇఖ్తెసాస్, షేఖ్ ముఫీద్, పేజీ111 & 149. అష్ షాఫీ, సయ్యద్ ముర్తుజా, భాగం1, పేజీ203 మొ..
8. అల్ రియాజ్ అన్నజరహ్, ముహిబ్బుద్దీన్ తబరీ, భాగం2, పేజీ193.
9. హిల్యతుల్ ఔలియా, భాగం1, పేజీ65. తారీఖె ఇబ్నె కసీర్, భాగం7, పేజీ359.
తబఖాతే ఇబ్నె సఅద్, భాగం2, పేజీ339.
10. రియాజున్నజరహ్, భాగం2, పేజీ195. మనాఖిబె అహ్మద్, పేజీ155, హదీస్ నెం222.
11. ఇబ్నె అబిల్ హదీద్, షర్హె నెహ్జుల్ బలాగహ్, భాగం4, పేజీ57
12. కన్జుల్ ఉమ్మాల్, హదీస్32981.
13. ఇబ్నె హజర్, సవాయిఖుల్ మహ్రిఖహ్, పేజీ34.
14. యనాబీవుల్ మవద్దత్, ఖందూజీ హనఫీ, పేజీ76.
15. ఇబ్నె అసాకిర్, తారీఖె దమిష్క్, భాగం42, పేజీ239.
16. ఇబ్నె అసాకిర్, తారీఖె దమిష్క్, భాగం42, పేజీ372.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 3