అబూబక్ర్ తన చివరి రోజులలో ఇలా ఇన్నారు: “ఫాతెమా ఇంటిని అగౌరవించకుండా ఉండాల్సింది".
అహ్లెసున్నత్ ప్రముఖ ఫఖీహ్ “అబూ ఉబైద్” తన గ్రంథం “అల్ అమ్వాల్”లో ఇలా ఉల్లేఖించెను: అబ్దుల్ రహ్మాన్ ఇబ్నె ఔఫ్ ఇలా అన్నారు: అబూబక్ర్ అనారోగ్యంగా ఉన్నప్పుడు వారిని చూడడానికై అతని ఇంటికి వెళ్ళాను, చాలా సేవు మాట్లాడుకున్న తరువాత నాతో ఇలా అన్నారు: నేను చేసిన మూడు పనులు, అవి నేను చేయకపోయి ఉంటే బాగుండేదనిపిస్తుంది. అలాగే నేను చేయని మూడు పనులు, అవి నేను చేసి ఉంటే బాగుండేదని అనిపిస్తుంది. అలాగే మూడు విషయాల గురించి దైవప్రవక్తతో ప్రశ్నించి ఉంటే బాగుండేదనిపిస్తుంది.
ముందుగా నేను చేసిన మూడు పనులు, అవి నేను చేయకపోయి ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది, అవి:
“ఫాతెమా ఇంటిని అగౌరవించకుండా ఉండాల్సింది, దానిని అట్లే వదిలేయాల్సింది, చివరికి అది యుద్ధానికి దారి తీసిన పరవాలేదు”.[అల్ అమ్వాల్, ఫుట్ నోట్ 4, నష్రె కుల్లియాతె అజ్హరియ్యహ్, పేజీ114, బీరూత్].
ఈ విధంగానే “తబరాని” తన గ్రంథం “మొజముల్ కబీర్”లో, “ఇబ్నె అబ్దు రబ్బిహ్” తన గ్రంథం “అల్ అఖ్దుల్ ఫరీద్”లో మరియు ముబర్రద్ తన గ్రంథం “అల్ కామిల్”లో మరియు “మస్వూదీ” తన గ్రంథం “మురవ్విజుజ్జహబ్”లో అబూబక్ర్ పశ్చాత్తాప రివాయత్ ను ఉల్లేఖించారు.
రిఫ్రెన్స్
అల్ అమ్వాల్, ఫుట్ నోట్ 4, నష్రె కుల్లియాతె అజ్హరియ్యహ్, పేజీ114, బీరూత్.
వ్యాఖ్యానించండి