గృహనిర్మాణంలో హలాల్ సొమ్ము యొక్క ప్రాముఖ్యతను వివరిస్తున్న ఇస్లామీయ ఆదేశాలు...
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
ఇల్లు అనేది మనిషికి నిత్యవసరమైనది. దాని నిర్మాణం విషయంలో జాగ్రత్త పడవలసిన మొదటి అంశం దాని కోసం ఖర్చు పెట్టే ధనం న్యాయబద్ధమైనదా లేదా అన్న అంశం. దైవప్రవక్త(స.అ) దీని గురించి ఇలా ఉపదేశించారు: “కట్టడంలో హరామ్ ఇటుక నుండి దూరంగా ఉండండి అది నాశనానికి కారణం అవుతుంది”[1]
ఈ విధంగా గృహనిర్మాణానికి ఉపయోగించే డబ్బూ, అనగా భూమి కొనుగోలు, ఇటుకలు, సిమెంటు, ఇనుము మొ..., అన్నీ తప్పనిసరిగా హలాల్ ధనంతోనే కొనుగోలు చేయాలి. అంటే ఇల్లు హరామ్ ధనంతో ఇతరుల నుండి కొట్టేసిన ధనంతో లేదా ఖబ్జా చేసిన భూమి పై నిర్మించకూడదు. జకాత్ మరియు ఖుమ్స్ చేల్లించని ధనం కూడా హరామ్ ధనంగా పరిగణించబడుతుంది. ఎందుకంటే అందులో పేద ప్రజల మరియు పవిత్ర మాసూముల భాగం ఉంటుంది, అది చెల్లించకుండా ఇల్లు నిర్మించడం, హరామ్ ధనంతో ఇల్లు నిర్మించడంతో సమానం.
ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) ఇలా ఉపదేశించారు: “ఓ దావూద్! హరామ్ సొమ్ముకు వృద్ధి అనేది ఉండదు, ఒకవేళ వృద్ధి చెందినా, అతడికి ఆశీర్వాదం ఉండదు; ఆ సొమ్ముతో ధర్మం చేసినా పుణ్యం దక్కదు, తన తరువాత మిగిల్చి పెడితే అది అతడిని నరకానికి తీసుకెళ్తుంది”[2]
ఈ హదీస్ ద్వార తెలిసే విషయమేమిటంటే హరామ్ డబ్బులో అభివృద్ధి లేదు ఒకవేళ కొంచెం అభివృద్ధి చెందినా అందులో ఆశీర్వాదం ఉండదు, ఆ సొమ్ముతో మంచి పనులు చేసినా ప్రయోజనం లేదు అలా అని ఆ ధనాన్ని ఇతరుల కోసం పెట్టి మరణిస్తే కూడా లాభం లేదు, మరణించిన తరువాత కూడా దాని ప్రభావం అతడి పై చూపిస్తూనే ఉంటుంది.
మరో విషయమేమిటంటే ఇంట్లో చేసే ముఖ్య కార్యములలో ఒకటి ప్రార్ధనలు. షరా పరంగా ప్రార్ధనల చెల్లింపు యొక్క షరత్తు అల్లాహ్ సామిప్యం యొక్క ఉద్దేశం (ఖస్దె ఖుర్భత్) అయి ఉండాలి[3] ఈ విధంగా చూసుకుంటే మనిషిని అల్లాహ్ నుండి దూరం చేసే, ప్రార్ధన చెల్లింపుకు అడ్డు పడే ప్రతీ విషయం ముఖ్యంగా ప్రార్ధన చేసే స్థలం ఖబ్జా చేసిన స్థలం కాకుండా ఉండడం., ఇది నమాజ్ లాంటి ముఖ్యమైన ప్రార్ధన చెల్లింపుకు షరత్తు. ఆయతుల్లాహ్ ఖుమైనీ(ర.అ) తన పుస్తకం తహ్రీరుల్ వసీలహ్ లో ఇలా అన్నారు: “నమాజ్ ఏ ప్రదేశంలో నైనా చదవ వచ్చు ఖబ్జా మరియు అన్యాయమైన ప్రదేశం తప్ప”[4]
ఖబ్జా చేయబడిన భూమి పై గృహనిర్మాణం చేసినటువంటి వాడు, మరియు భూమి యజమాని తన భూమి కావాలని కోరినప్పుడు ఏమి చేయాలన్నా విషయం గురించి హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా అన్నారు: “అతడి కట్టడాన్ని నాశనం చేయాలి, ఆ భూమి దాని యజమానికి తిరిగి ఇవ్వాలి, ఖబ్జా దారుడికి అందులో ఎటువంటి భాగం ఉండదు”[5]
రిఫరెన్స్
1. పాయందే, అబుల్ ఖాసిమ్, నెహ్జుల్ ఫసాహహ్, భాగం1, పేజీ162. اِتَّقُوا الحَجَرَ الحَرامَ فِی البُنیانِ فَإنّهُ أساسُ الخَرابِ
2. 2. కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, అల్ కాఫీ, భాగం5, పేజీ125. يَا دَاوُدُ إِنَّ اَلْحَرَامَ لاَ يَنْمِي وَ إِنْ نَمَى لاَ يُبَارَكُ لَهُ فِيهِ وَ مَا أَنْفَقَهُ لَمْ يُؤْجَرْ عَلَيْهِ وَ مَا خَلَّفَهُ كَانَ زَادَهُ إِلَى اَلنَّارِ
3. జంయీ అజ్ ఫజోహిష్ గరాన్, ఫర్హంగె ఫిఖ్ ముతాబిఖె మజాహిబె అహ్లెబైత్(అ.స), పేజీ671.
4. ఖుమైనీ, రూహుల్లాహ్, అలీ, తర్జుమా తహ్రీరుల్ వసీలహ్, భాగం1, పేజీ267.
5. హుర్రె ఆములీ, మొహమ్మద్ ఇబ్నె హసన్, వసాయిల్ అల్ షియా, భాగం25, పేజీ388. يُرفَعُ بِناؤهُ ، وتُسَلَّمُ التُّربَةُ إلى صاحِبِها ؛ ليسَ لِعِرقِ ظالِمٍ حَقٌّ
వ్యాఖ్యానించండి