.సఖ్లైన్ హదీస్ ద్వార దైవప్రవక్త[స.అ] యొక్క ఉత్తరాధికారుల ఇస్మత్ నిరూపణ.
దైవప్రవక్త[స.అ] ఇలా ప్రవచించెను:
يَا أَيُّهَا النَّاسُ إِنِّي تَارِكٌ فِيكُمُ مَا إِنْ أَخَذْتُمْ بِهِ لَنْ تَضِلُّوا كِتَابَ اللَّهِ وَ عِتْرَتِي أَهْلَ بَيْتِي
అనువాదం: “ప్రజలారా! నేను మీ మధ్య రెండింటిని వదిలి వెళ్తున్నాను ఒకవేళ మీరు వాటి పై అమలు చేసినట్లైతే రుజుమార్గం తప్పరు(మరి అవి) ఖుర్ఆన్ మరియు నా ఇత్రత్”.[తిర్మిజీ, భాగం5, పేజీ328. ముస్తద్రికుల్ హాకిం, భాగం3, పేజీ148. ముస్నదె ఇమామ్ అహ్మద్ హంబల్, భాగం5, పేజీ 189].
ఈ హదీస్ స్పష్టంగా ఆయిమ్మయే అహ్లెబైత్(అ.స)ల పవిత్రతను నిరూపిస్తుంది, ఎందుకంటే ఖుర్ఆన్ పవిత్రమైనది దాని దగ్గరకు అసత్యం చేరలేదు. మరియు అహ్లెబైత్(అ.స)లు ఖుర్ఆన్‌తో సమానులు. అందుకని వీళ్ళు కూడా పవిత్రులే అవుతారు. ఇంకోవిషయమేమిటంటే ఖుర్ఆన్ మరియు ఇత్రత్‌ను ఆశ్రయించినవాడు రుజుమార్గం నుండి తప్పలేడు. అల్లాహ్ గ్రంథం మరియు ఇత్రత్ రెండూ పవిత్రమైనవే ఎందుకంటే వాటిని ఆశ్రయించడం రుజుమార్గం నుండి తప్పకుండా ఉండడానికి కారణం అవుతుంది, అని ఈ హదీస్ మనకు తెలియపరుస్తుంది.
రిఫ్రెన్స్
తిర్మిజీ, సుననె తిర్మిజీ, భాగం5, పేజీ328. హాకిమ్, ముస్తద్రికుల్ హాకిమ్, భాగం3, పేజీ148. అహ్మద్ ఇబ్నె హంబల్, ముస్నదె ఇమామ్ అహ్మద్ హంబల్, భాగం5, పేజీ 189.
వ్యాఖ్యానించండి