గృహనిర్మాణంలో ఖిబ్లా ప్రాముఖ్యత-1

సోమ, 12/05/2022 - 09:57

గృహనిర్మాణంలో ఖిబ్లా ప్రాముఖ్యత గురించి వివరిస్తున్నా రివాయతులు మరియు ఫత్వాలు...

గృహనిర్మాణంలో ఖిబ్లా ప్రాముఖ్యత-1

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

ఇస్లామీయ పరిభాషలో “ఖిబ్లా” అనగా ముస్లిములు అభిముఖమై నమాజు చదివే దిక్కును ఖిబ్లా అంటారు.[1] ఖిబ్లా దిక్కు కేవలం నమాజులో మాత్రమే కాదు వివిధ ఇస్లామీయ ఆదేశాలనుచరణ విషయంలో ముఖ్య పాత్ర వహిస్తుంది. ఉదాహారణకు హలాల్ జంతువుల జపా విషయంలో, మరణించిన తరువాత సమాధిలో మృతదేహాన్ని పెట్టు సమయంలో మొ... . ఇస్లాం ముందు దశలో ముస్లిముల ఖిబ్లా “మస్జిదుల్ అఖ్సా” వైపు ఉండేది. హిజ్రీ యొక్క రెండవ సంవత్సరంలో ఖిబ్లా ను మక్కాలో ఉన్న కాబా గృహం వైపుకు మార్చబడింది. ఖుర్ఆన్ యొక్క సూరయె బఖరహ్, ఆయత్ 142 నుండి 144 వరకు దీని గురించి వివరించబడి ఉంది.(సూరయె బఖరహ్, ఆయత్144)[2]

రివాయతులనుసారం గృహంలో కొన్ని పనులు ఖిబ్లాకు అభిముఖంగా ఉండి చేయాలి మరియు కొన్ని పనులు చేసే టప్పుడు అభిముఖంగా ఉండకూడదు అని తాకీదు చేయబడి ఉంది అని తెలుస్తుంది. వాటి గురించి మున్ముందు తెలుసుకుందాం. ముఖ్య విషమేమిటంటే ఖుర్ఆన్ కూడా ఇంటిని ఖిబ్లా వైపు ముఖద్వారం ఉన్నట్లు నిర్మించమని ఆదేశిస్తుంది. అల్లాహ్ బనీ ఇస్రాయీల్ సమూహం వారికి ఖిబ్లా దిశకు ఇళ్లు నిర్మించుకోండి అని ఆదేశించాడు: మీరిద్దరూ మీ వాళ్ల కోసం ఈజిప్టులో నివాస గృహాలను ఏర్పాడు చేయండి. ఆ ఇళ్లు ఖిబ్లా దిశలో ఉండేట్లు చూసుకోండి. నమాజును నెలకొల్పండి. (మూసా!) నీవు విశ్వాసులకు శుభవార్తను అందజేయి.. అని మేము మూసాకు, అతని సోదరునికీ వహీ పంపాము.[సూరయె యూనుస్, ఆయత్87]. ఈ ఆయత్ వ్యాఖ్యానం[3] క్రమంలో ఇలా ఉల్లేఖించబడి ఉంది: ఈ ఆయత్ ద్వార తెలుసుకోవలసిన విషయమేమిటంటే విశ్వాసుల ఇళ్లు ఖిబ్లా దిశకు ముఖద్వారం ఉండేటట్లు కట్టుకోవాలి. అదే విధంగా షియా వర్గానికి చెందిన ఖుర్ఆన్ నిపుణులు అయిన ఖిరాఅతీ గారు తన గ్రంథంలో ఇలా వివరించారు: “ఇస్లామీయ గృహ మరియు పట్టణ నిర్మాణాలు ఇస్లాం ఆదేశాలకు అనుకూలంగా మరియు ఖిబ్లా దిశను దృష్టిలో పెట్టుకొని నిర్మించాలి, ఖిబ్లా దిశను మర్చిపోకూడదు”.[4]

గృహనిర్మాణంలో ఖిబ్లా దిశను దృష్టిలో పెట్టుకోవలసిన సందర్భాలు:

1. మరుగు దోడ్లు ఖిబ్లా అభిముఖంగా ఉండకూడదు

ప్రతీ ఇంటికి ఉండవలసిన ముఖ్యమైన వాటిలో మరుగు దోడ్లు ఒకటి. వీటిని నిర్మించడానికి కారణం ఎంత మల మరియు మూత్ర విసర్జన అయినా వీటి వెనక దాగి ఉన్న అంశాలను కూడా దృష్టిలో ఉంచడం అవసరం. అవేమిటంటే మనిషికి నిత్యం అతడి యొక్క బలహీనతా మరియు హద్దులను మల మూత్ర విసర్జనలు గుర్తుజేస్తూ ఉంటాయి, సృష్టి కర్త ముందు అహంకారానికి గురి కాకుండా ఆపుతాయి. హజ్రత్ ఇమామ్ బాఖిర్(అ.స) తో ఎందుకు మలం ఏర్పడుతుంది దానికి కారణం ఏమిటి? అని ప్రశ్నించినప్పుడు వారి ఇలా సమాధానమిచ్చారు: “మనిషిని కుంచించు చేయడానికి, దాంతో అతడు ఎవరైతే ఇలాంటి మరుగును ఎత్తుకొని తిరుగుతున్నాడో అహంకారం కాకూడదు అని గుర్తుండడానికి”[5]  

అదే విధంగా మలమూత్ర విసర్జన సమయంలో ఖిబ్లాకు అభిముఖంగా గాని లేదా వీపు వైపు గాని కూర్చో కూడదు అని ఇస్లాం ఆదేశిస్తుంది. దీని గురించి దైవప్రవక్త(స.అ) ఇలా ఆదేశించారు: “ములమూత్ర విసర్జన కోసం ఖిబ్లాకు అభిముఖంగా గాని వీపు వైపు తిరిగి గాని కూర్చోవడం సమ్మతమైనది కాదు”[6] షరా పరంగా కూడా ఇలా చేయడం హరామ్ గా నిర్ధారించబడినది.

షియా వర్గానికి చెందిన ప్రముఖ ఆలిమ్ మొహఖ్ఖిఖె హిల్లీ(ర.అ) “ఉద్దేశపూర్వకంగా ఖిబ్లాకు అభిముఖంగా లేదా వెనక్కి తిరిగి కూర్చోవడం హరామ్” అని రచించారు.[7]

రిఫరెన్స
1. చూ. గరవీ, మౌలా అలీ అలీ యారీ, మిన్జాజుల్ మిల్లతి ఫీ బయానిల్ వఖ్త్ వల్ ఖిబ్లహ్, పేజీ226.
2. قَدْ نَرَى تَقَلُّبَ وَجْهِكَ فِي السَّمَاءِ فَلَنُوَلِّيَنَّكَ قِبْلَةً تَرْضَاهَا فَوَلِّ وَجْهَكَ شَطْرَ الْمَسْجِدِ الْحَرَامِ وَحَيْثُ مَا كُنْتُمْ فَوَلُّوا وُجُوهَكُمْ شَطْرَهُ وَإِنَّ الَّذِينَ أُوتُوا الْكِتَابَ لَيَعْلَمُونَ أَنَّهُ الْحَقُّ مِنْ رَبِّهِمْ وَمَا اللَّهُ بِغَافِلٍ عَمَّا يَعْمَلُونَ
3. తబర్సీ, ఫజ్ల్ ఇబ్నె హసన్, మజ్మవుల్ బయాన్(తర్జుమా), పేజీ345
4. ఖిరాఅతీ, మొహ్సిన్, తఫ్సీరె నూర్, భాగం3, పేజీ613.
5. ఇబ్నె బాబ్వై(సదూఖ్), మొహమ్మద్ ఇబ్నె అలీ, ఇలల్ అల్ షరాయే, భాగం1, పేజీ275.
6. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం77, పేజీ190.
7. హిల్లీ, జాఫర్ ఇబ్నె హసన్, అల్ రసాయిల్ అల్ తిస్అ, పేజీ336.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 19