తోటను గృహంగా మార్చడం

సోమ, 12/05/2022 - 05:14

చెట్లను నాటడం మరియు పెంచడం యొక్క ప్రాముఖ్యత ఇస్లాం దృష్టిలో మరియు తోటను గృహంగా మార్చడం గురించి హదీసుల వివరణ...  

తోటను గృహంగా మార్చడం

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

వృక్షాలు మరియు చెట్లు అల్లాహ్ అనుగ్రహాల నుండి ఒకటి మరియు సృష్టి సౌందర్యం యొక్క నమూనా. చెట్లు, స్వచ్ఛమైన మరియు మంచి గాలి, పరిసర ఉష్టోగ్రత బ్యాలన్స్ గా ఉంచడం, భూమి రక్షణ మరియు మంచి ఆహారాన్ని ఇవ్వడంలో ముఖ్య పాత్రను వహిస్తాయి. ఇస్లాం కూడా దీని పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతుంది. వృక్షాలు శ్రేయస్సు, పచ్చదనం మరియు సమృద్ధికి చిహ్నాలు, మరియు అవి జీవితం యొక్క స్వరూపాలు, మరియు ప్రజలకు సౌలభ్యం మరియు శక్తి కారణం, మరియు అవి ప్రకృతి యొక్క స్వచ్ఛతను తెలుపుతాయి; అందుకే అల్లాహ్ వీటిని ప్రళయదినంలో కూడా స్వర్గం యొక్క అనుగ్రహాలలో ఒకటిగా సూచించెను: “విశ్వసించి, సత్కార్యాలు చేసే వారికి క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాల శుభవార్తలను అందజెయ్యి. తినడానికి అక్కడి పండ్లు వారికి ఇవ్వబడినప్పుడల్లా, “ఇలాంటి పండ్లే ఇంతకు మునుపు మాకు ఇవ్వబడినవి” అని వారంటారు. నిజానికి పరస్పరం పోలి ఉండే ఫలాలు వారికి ప్రసాదించబడతాయి. వారి కొరకు పరిశుద్ధులైన భార్యలుంటారు. వారు ఈ స్వర్గవనాలలో కలకాలం ఉంటారు.[సూరయె బఖరహ్, ఆయత్25]. అయితే చెట్లు నాటడం మరియు పరిసరాలలో ఉన్న చెట్ల రక్షణ పట్ల అశ్రద్ధ చూప కూడదు.

ఆయతుల్లాహ్ జవాదె ఆములీ(హ.అ) తన పుస్తకం మఫాతీహుల్ హయాత్ లో ఇలా రచించెను: “ఇస్లాం దృష్టిలో చెట్లను నాటడం మరియు విత్తనాలు వేయడం లేదా చెట్లను పెంచడం అత్యుత్తమ మరియు పవిత్రమైన కార్యముల క్రమంలో లెక్కించెను; ఎందకంటే దైవప్రవక్త(స.అ) ఒక హదీసులో చెట్లను నాటడాన్ని చదువు నేర్చుకోవడం, మస్జిద్ నిర్మాణం, ఖుర్ఆన్ లేదా విజ్ఞాన పరమైన గ్రంథాన్ని వదిలి వెళ్లడం లాంటి వాటి క్రమంలో నిర్థారించారు.[1] ఇది చెట్లు నాటడం పట్ల వారి ప్రాముఖ్యతను తెలుపుతుంది.[2]

రివాయతులనుసారం చెట్లను నరకడం ముఖ్యంగా పండ్లు కాసే చెట్లను నరకడం నిషేధించబడిన అంశం. దీని గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ఉపదేశించారు: “పండ్లున్న చెట్లను నరకకండి, లేకపోత అల్లాహ్ మీకు శిక్షిస్తాడు”[3] హదీస్ లో ఉన్న నిషేదన చెట్లను నరకడం హరామ్ లేదా మక్రూహ్ పని అనడానకి నిదర్శనం. బహుశ నిదర్శనం ద్వారానే ఫుఖహాలలో కొందరు అవసరం లేకుండా చెట్లను నరకాడాన్ని హరామ్ గా మరియు మరి కొందరు మక్రూహ్ గా ఆదేశించారు.[4]

పై చెప్పబడిన అంశాలాధారంగా ఒకవేళ ఒకవ్యక్తి తన సొంత తోటలో ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు మరియు అతడి ఈ పని చెట్లు నరకడం పై ఆధారపడి ఉన్నప్పుడు, అలాగే అతడు ఇల్లు నిర్మించుకోవడం కోసం వేరే స్థలం కూడా ఉన్నట్లైతే ఫుఖహాల ఆదేశానుసారం ఆ తోటలో గృహనిర్మాణం చేసుకోకపోవడం మంచిది. అయితే ఒకవేళ అత్యవసర పరిస్థితి మరియు యజమానికి చెట్లను నరకడం తప్పని సరి సమయంలో, ఇస్లాం అనుమతిస్తుంది; హజ్రత్ అలీ(అ.స) ఇలా ఉల్లేఖించెను: “నీ ఆయుశ్శును పెంచేవి., వృద్ధుల పట్ల గౌరవం మరియు వారిని కష్టపెట్టకుండా ఉండడం, బంధువుల పట్ల ప్రేమ మరియు పచ్చని చెట్లను నరకే విషయంలో జాగ్రత్త(దూరం)గా ఉండడం అత్యవసర సమయంలో తప్ప”[5]

చివరిమాట: గృహనిర్మాణం కోసం పచ్చని చెట్లను నరకడం మరియు తోటను నాశనం చేయడం నిషిద్ధం అత్యవసర పరిస్థితిలో తప్ప.

రిఫరెన్స్
1. سَبعٌ يَجْري للِعْبَدِ أجْرُهُنَّ وَهوَ في قبرهِ بعَدَ مَوتِهِ: مَنْ علَّمَ عِلمْاً، أوأجرَی نهراً، أوْ حَفَرَ بِئراً، أو غَرَسَ نَخلاً، أوْ بَنَی مَسجِداً، أوْ وَرَّثَ مُصْحَفاً، أوْ تَرَكَ وَلدَاً يسَتَغفِرُ لَهُ بَعدَ مَوتِهِ పాయందే, అబుల్ ఖాసిమ్, నెహ్జుల్ ఫసాహహ్, పేజీ520.
2. జవాదీ ఆములీ, అబ్దుల్లాహ్, మఫాతీహుల్ హయాత్, పేజీ709.
3. لا تَقطَعُوا الثِّمارَ فَيَبعَثُ اللّه ُ عَليكُمُ العَذابَ صَبّا కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, అల్ కాఫీ, భాగం5, పేజీ264.
4. ఫర్హంగె ఫిఖ్ ముతాబిఖె మజ్హబె అహ్లె బైత్(అ.స), భాగం3, పేజీ595.
5. وَ مِمَّا يَزِيدُ فِي اَلْعُمُرِ تَرْكُ اَلْأَذَى وَ تَوْقِيرُ اَلشُّيُوخِ وَ صِلَةُ اَلرَّحِمِ وَ أَنْ يُحْتَرَزَ عَنْ قَطْعِ اَلْأَشْجَارِ اَلرَّطْبَةِ إِلاَّ عِنْدَ اَلضَّرُورَةِ మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం73, పేజీ319.   

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 10