గృహనిర్మాణంలో దుబారా ఖర్చు

సోమ, 12/05/2022 - 03:54

ఇస్రాఫ్ మరియు తబ్జీర్ యొక్క అర్థాల మధ్య గల తేడా మరియు గృహనిర్మాణంలో దుబారా ఖర్చు సంక్షిప్త వివరణ....

గృహనిర్మాణంలో దుబారా ఖర్చు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

ఇస్లాం ఆదేశాలనుసారం మితిమీరి ఖర్చు పెట్టడం మరియు దుబారా ఖర్చు చేయడం ఖడించిన అంశం. ఫుఖహా దీనిని హారామ్ గా నిర్ధారించారు.[1] ఈ మితిమీరి ఖర్చు పెట్టడం లేదా దుబారా ఖర్చులను ఇస్లాం రెండు పదాలతో గుర్తు చేస్తు ఉంటుంది. ఒకటి “ఇస్రాఫ్” రెండవది “తబ్జీర్” ముందుగా వీటి అర్థాలు తెలుసుకుందాం. ఒక విషయంలో హద్దుమీరి ఖర్చు పెట్టడం ఉదా:  చాలా మంది గౌరవంగా తినగలిగేంత ఖరీదు చేసే డబ్బుతో ఒక్కడి కోసం భోజనం కొనడం. ఇక్కడ హద్దుమీరి కొనడం జరిగింది ఇందులో వ్యర్థం అనేది కనబడదు, దీనిని ఇస్రాఫ్ అంటారు. కాని తబ్జీర్ లో దుబారా ఖర్చు అవుతుంది, ఉదా: ఇద్దురు అతిథుల కోసం పది మంది భోజనాన్ని సిద్ధం చేయడం, కొంత మంది అజ్ఞానులను ఇలా చేయడాన్ని చూస్తూ ఉంటాము. ఎక్కువగా ఒండి మిగిలిన దాన్ని చెత్త కుండీలో వేయడం గర్వంగా భావిస్తారు. చాలా సందర్భాలలో ఈ రెండు పదాలు కూడా ఒకే అర్థానికి చేరుస్తూ ఉపయోగపడుతూ ఉంటాయి. ఒక్కోసారి రెండు పదాలు కూడా ఒకేసారి తాకీదు కోసం ఉపయోగిస్తూ ఉంటారు.

గృహనిర్మాణం విషయంలో కూడా మితిమీరి ఖర్చు పెట్టి సహజ లోకంలో ఉన్న శక్తులను నాశనం చేయకుండా ఉండాలి. అయితే ఇది పెద్ద ఇల్లు కలిగి ఉండడం మనిషి యొక్క సంతోషానికి మరియు ఆనందానికి కారణం అని చెప్పబడే ధర్మాదేశానికి వ్యతిరేకం కాదు అని గుర్తుంచుకోవాలి.[2] ఇస్లాం ఖండించినది పెద్ద ఇల్లు ఉండడాన్ని కాదు, బంగళాలు మరియు కోటలు నిర్మంచడాన్ని. దైవప్రవక్త(స.అ) దీని గురించి ఇలా ఉపదేశించారు: “మీరు నివసించని వాటిని నిర్మించవద్దు”[3]. ఈ విధంగా చూసుకుంటే ఇల్లు మీకు సరిపడేంత మీ అవసరాలు తీరేంత మరియు హద్దుమీరి ఖర్చులకు దూరంగా ఉంటే చాలు అని ఇస్లాం ఆదేశిస్తుంది.

హజ్రత్ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ప్రవచించారు: “అవసరానికి మించిన నిర్మాణం, ప్రళయదినాన దాని యజమానికి బాధగా మారుతుంది”[4] ఇంటి నిర్మాణం గర్వాన్ని మరియు దొరతనాన్ని చాటుకోవడం కోసం అయి ఉండకూడదు, చివరికి ఇలాంటి యజమానులు ప్రళయదినాన విచారానికి గురి అవుతారు అని తెలుపబడినది.

అల్లాహ్, గర్వం చాటుకోవడానికి ఇలాంటి ఇళ్లను కట్టే ఆద్ సమూహం వారి గురించి ఇలా అనెను: “ఏమిటీ, మీరు ఎత్తయిన ప్రతి స్థలంలోనూ ఏమీ ప్రయోజనం లేని ఒక స్మారక కట్టడాన్ని నిర్మిస్తారా? మీరు ఇక్కడే శాశ్వతంగా ఉంటామన్నట్లు అపురూపమైన (పటిష్టమైన భవనాలను నిర్మిస్తున్నారే!”[సూరయె షుఅరా, ఆయత్28,29]

గృహనిర్మాణంలో హద్దుమీరి ఖర్చు చేయకూడదు మరియు హరామ్ సొమ్ము ఖర్చు పెట్టకూడదు అని ఇస్లాం ఉపదేశిస్తుంది.

దైవప్రవక్త(స.అ) ఉపదేశం: “నిస్సందేహంగా అల్లాహ్ కొన్ని ప్రదేశాలను .మర్హూమాత్. గా నిర్ధారించెను ఆ ప్రదేశాలలో ఆయనను వేడుకోవాలి ఆయన వారి విన్నపాలను ఆలకిస్తాడు మరియు తీరుస్తాడు. అదే విధంగా అల్లాహ్ కొన్ని ప్రదేశాలను “మునఖ్ఖిమాత్” గా నిర్ధారించెను. ఎప్పుడైతే ఒక వ్యక్తి హరామ్ మార్గంలో అన్యాయంగా సంపాదిస్తాడో, అల్లాహ్ ఈ భూముల నుండి ఒక దాన్ని వాడికి చెందేలా చేసి అతడు తన ధనాన్ని దానిపై ఖర్చు పెట్టేలా చేసి వ్యర్థం చేస్తాడు”[5]

ఖుర్ఆన్ పలుచోట్ల మితిమీరి ప్రవర్తించవద్దని ఆజ్ఞాపిస్తుంది, మితిమీరే వారిని అల్లాహ్ ప్రేమించడని చెబుతుంది. కానీ ఆ మితిమీరే వారెవరు? వారి లక్షణాలేంటి అన్న ప్రశ్నకు సమాధానంగా దైవప్రవక్త[స.అ] ఈ విధంగా సూచించారు: మితిమీరే వారు నాలుగు లక్షణాలు కలిగివుంటారు:
1. తప్పుడు పనులపై గర్వపడతాడు.
2. ఏ వస్తువైతే తన కొరకు మంచిది కాదో దానిని తింటాడు.
3. మంచి పనులలో అతనికి ఎటువంటి శ్రద్ధ ఉండదు.
4. ఎవరైతే అతనికి లాభం చేకూర్చరో వారిని ఖండిస్తాడు.[6]

రిఫరెన్స్
1. మజల్లయే ఫిఖ్హె అహ్లె బైత్(అ.స), భాగం11-12, పేజీ329.
2. ثَلاَثَةٌ لِلْمُؤْمِنِ فِيهَا رَاحَةٌ دَارٌ وَاسِعَةٌ تُوَارِي عَوْرَتَهُ وَ سُوءَ حَالِهِ مِنَ اَلنَّاسِ మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం73, పేజీ148.
3. كُلُّ بِناءٍ ليسَ بِكَفافٍ فهُو وبالٌ على صاحِبِهِ يَومَ القِيامَةِ కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, అల్ కాఫీ, భాగం2, పేజీ48.
4. أَتَبْنُونَ بِكُلِّ رِيعٍ آيَةً تَعْبَثُونَ. وَتَتَّخِذُونَ مَصَانِعَ لَعَلَّكُمْ تَخْلُدُونَ కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, అల్ కాఫీ, భాగం6, పేజీ532.
5. إِنَّ اَللَّهَ عَزَّ وَ جَلَّ جَعَلَ مِنْ أَرْضِهِ بِقَاعاً تُسَمَّى اَلْمَرْحُومَاتِ أَحَبَّ أَنْ يُدْعَى فِيهَا فَيُجِيبَ وَ إِنَّ اَللَّهَ عَزَّ وَ جَلَّ جَعَلَ مِنْ أَرْضِهِ بِقَاعاً تُسَمَّى اَلْمُنْتَقِمَاتِ فَإِذَا كَسَبَ اَلرَّجُلُ مَالاً مِنْ غَيْرِ حِلِّهِ سَلَّطَ اَللَّهُ عَلَيْهِ بُقْعَةً مِنْهَا فَأَنْفَقَهُ فِيهَا కులైనీ, మొహమ్మద్ ఇబ్నె యాఖూబ్, అల్ కాఫీ, భాగం6, పేజీ531.
6. హర్రానీ, ఇబ్నె షొఅబహ్, తొహ్ఫుల్ ఉఖూల్, పేజీ22. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20