హజ్రత్ ఫాతెమా(స.అ) గొప్పతనం

ఆది, 12/11/2022 - 17:19

దైవప్రవక్త(స.అ) కుమార్తె హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ప్రతిష్ట ను వివరిస్తున్న హదీసులు...

హజ్రత్ ఫాతెమా(స.అ) గొప్పతనం

పవిత్ర మాసూములు హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ప్రతిష్ట గురించి చెప్పిన మాటలు...

ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) దృష్టిలో
సయ్యద్ హాషిమ్ బహ్రానీ ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ద్వార ఇలా ఉల్లేఖించారు: ఏ ఒక్క ప్రవక్త యొక్క దౌత్యం కూడా ఫాతెమా జహ్రా(స.అ) యొక్క ప్రతిష్టతను అంగీకరించనంత వరకు మరియు ఆమె పట్ల ఇష్టం లేనంత వరకు సంపూర్ణ స్థితికి చేరేది కాదు.[1]
మరో చోట ఇలా ఉల్లేఖించెను: ఫాతెమా, ఆమె సిద్దీఖయె కుబ్రా, ఆమె అల్లాహ్ వద్ద 9 పేర్లు కలిగి ఉన్నారు: ఫాతెమా, సిద్దీఖహ్, ముబారకహ్, తాహిరహ్, జకియ్యాహ్, రాజియా, మొహద్దిసహ్, జహ్రా మరియు బతూల్[2]

ఇమామ్ మూసా కాజిమ్(అ.స) దృష్టిలో
ఇమామ్ మూసా కాజిమ్(అ.స) ఉల్లేఖనం: నిస్సందేహంగా ఫాతెమా, సిద్దీఖహ్ మరియు షహీదహ్.[3]
సులైమ్ ఇబ్నె జాఫర్ కథనం ప్రకారం; ఇమామ్ మూసా కాజిమ్(అ.స) ను ఇలా చెబుతుండగా విన్నాను: ఏ ఇంట్లో నైతే ముహమ్మద్ లేదా అలీ, హసన్, హుసైన్, జాఫర్ మరియు అబ్దుల్లాహ్ మరియు స్ర్తీలలో ఫాతెమా పేర్లు ఉంటాయో; పేదరికం, దరిద్రం ఆ ఇంట్లోకి ప్రవేశించదు.[4]

ఇమామ్ రిజా(అ.స) దృష్టిలో
ఇమామ్ రిజా(అ.స) ఉల్లేఖనం: దైవప్రవక్త(స.అ) అలీ(అ.స)తో ఇలా అన్నారు: నీకు ప్రసాదించబడ్డ మూడు ప్రతిష్టతలు నాకు ప్రసాదించబడలేదు. ఆ మూడు ఏమిటి అని అలీ(అ.స) ప్రశ్నించారు. దానికి దైవప్రవక్త(స.అ) ఇలా సమాధానమిచ్చారు: “నాలాంటి మామా నీకు ఉన్నాడు కాని నాకు అలాంటి మామా లేడు, నీకు ప్రసాదించబడినటువంటి భార్య నాకు ప్రసాదించబడలేదు, హసన్ మరియు హుసనై లాంటి పిల్లలు నీకు ప్రసాదించబడ్డారు నాకు ప్రసాదించబడలేదు”[5]

ఇమామ్ ముహమ్మద్ తఖీ(స.అ) దృష్టిలో
జకర్రియ్యాహ్ ఇబ్నె ఆదమ్ ఉల్లేఖనం: నేను హజ్రత్ ఇమామ్ రిజా(స.అ) సన్నిధిలో ఉండగా ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) కు నాలుగు సంవత్సరాల వయసు కూడా ఉండి ఉండదు, అక్కడి వచ్చారు. కూర్చున్న తరువాత చేయిని నేల పై పెట్టి ఆకాశం వైపు తలను ఎత్తి చాలా సేపు ఆలోచిస్తూ ఉండిపోయారు. ఇమామ్ రిజా(అ.స) ఏమయ్యింది, ఎందుకు అలా ఆలోచిస్తూ కూర్చుండి పోయావు నాన్నా! అని అడిగారు. మా తల్లి ఫాతెమా(స.అ) పట్ల చేయబడిన అన్యాయాల గురించి (ఆలోచిస్తున్నాను) అని సమాధానమిచ్చారు.[6]

ఇమామ్ అలీ నఖీ(అ.స) దృష్టిలో
ఇమామ్ అలీ నఖీ(అ.స) హజ్రత్ సిద్ధీఖా తాహీరహ్(స.అ) ను ఫాతెమా అని నామకరించడానికి కారణమేమిటి అన్న అంశం పై దైవప్రవక్త(స.అ) హదీసును ఇలా ఉల్లేఖించారు: “నా కుమార్తె ఫాతెమా(స.అ) ను ఫాతెమా అని నామకరించడానికి కారణం అల్లాహ్ ఆమెను మరియు ఆమె ను ఇష్టపడే వారిని నరకాగ్ని నుండి దూరంగా ఉంచెను”[7]

ఇమామ్ హసన్ అస్కరీ(స.అ) దృష్టిలో
ఇమామ్ హసన్ అస్కరీ(స.అ) కథనం ప్రకారం; ఇమామ్ అలీ(అ.స), దైవప్రవక్త(స.అ) నుండి ఇలా ఉల్లేఖించారు: “అల్లాహ్ ఆదమ్ మరియు హవ్వాను సృష్టించిన తరువాత వారు స్వర్గంలో తమ పై తాము గర్వ పడేవారు. ఆదమ్ హవ్వాతో ఇలా అన్నారు: అల్లాహ్ మాకు మించిన సృష్టిని సృష్టించలేదు. అల్లాహ్ జిబ్రయీల్ తో ఇలా అనెను: నా ఈ ఇద్దరు దాసులను ఫిర్దౌసె బరీన్ కు తీసుకెళ్లు, వాళ్లు ఫిర్దౌస్ లో ప్రవేశించిన తరువాత వారి కళ్లు ఒక స్ర్తీ పై పడ్డాయి, ఆమె స్వర్గపు ఉత్తమ దుస్తులు ధరించి ఉంది, తల పై కాంతితో నిండి ఉన్న కిరీటం, మిలమిలా మెరిసిపోతున్న చెవి పోగులు, ఆమె ముఖం కాంతితో స్వర్గం వెలిగిపోతుంది. హజ్రత్ అదమ్ జిబ్రయీల్ తో ఇలా అన్నారు: మిత్రమా జిబ్రయీల్! తన ముఖ కాంతితో స్వర్గాన్ని కాంతిపజేసిన ఈ స్ర్తీ ఎవరూ?. ఈమె హజ్రత్ ముహమ్మద్(స.అ) యొక్క కుమార్తె ఫాతమా(స.అ)... వీరు నీ సృష్టికి నాలుగు వేల సంవత్సరాలకు ముందు నుండి ఉన్నారు.[8]

ఇమామ్ మహ్దీ(అ.స) దృష్టిలో
ఇమామ్ మహ్దీ(అ.స) ఉల్లేఖనం.. దైవప్రవక్త(స.అ) కుమార్తె ఫాతమా(స.అ) నా కోసం ఉత్తమ నమూనా.[9]

రిఫరెన్స్
1. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ65.
2. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం43, పేజీ105.
3. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, మిరాతుల్ ఉఖూల్, భాగం5, పేజీ315.
4. సఫీనతుల్ బిహార్, భాగం4, పేజీ295.
5. ముస్నదుర్రిజా, భాగం1, పేజీ119.
6. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం50, పేజీ59
7. లిసానుల్ మీజాన్, భాగం3, పేజీ346.
8. లిసానుల్ మీజాన్, భాగం3, పేజీ346.
9. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం53, పేజీ180.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 14