రజబ్ మాసం సందర్భాలు

ఆది, 01/22/2023 - 17:57

అల్లాహ్ కారుణ్యం కురిసే రజబ్ మాసం యొక్క కొన్ని సందర్భాల వివరణ...

రజబ్ మాసం సందర్భాలు

అల్లాహ్ కారుణ్యం కురిసే రజబ్ మాసం యొక్క కొన్ని సందర్భాల వివరణ:

1వ తారీఖు
హిజ్రీ యొక్క 57వ సంవత్సరం మదీనహ్ లో హజ్రత్ ఇమామ్ ముహమ్మద్ బాఖిర్(అ.స) జన్మించారు.
ఇమామ్ బాఖిర్(అ.స), దైవప్రవక్త(స.అ) యొక్క ఐదవ ఉత్తరాధికారి, ఇమామ్ సజ్జాద్(అ.స) యొక్క కుమారుడు. వారి పేరు “ముహమ్మద్”, వారి కున్నియత్ “అబూ జాఫర్”, వారి బిరుదులు “బాఖిర్”, “బాఖిరుల్ ఉలూమ్”
ఇమామ్ బాఖిర్(అ.స) హిజ్రీ యొక్క 57వ ఏట మదీనహ్‌లో జన్మించారు. తల్లి “ఉమ్మె అబ్దుల్లాహ్” ఈమె ఇమామ్ హసన్(అ.స) కుమార్తె, ఈ విధంగా ఇమామ్ బాఖిర్(అ.స) తల్లీ మరియు తండ్రి ఇద్దరి తరపు నుంచి ఫాతెమీ మరియు అలవీ సంతానం. తండ్రి ఇమామ్ సజ్జాద్(అ.స) మరణించేటప్పుడు ఇమామ్ బాఖిర్(అ.స)కి 39 సంవత్సరాల వయసు. హిజ్రీ యొక్క 114వ సంవత్సరంలో మదీనహ్ లో విషం ద్వార చంపబడ్డారు. వారి సమాధి వారి తండ్రి మరియు పితామహుల ప్రక్కలో “బఖీ” స్మశానంలో ఉంది.[1]

2వ తారీఖు(లేదా 5వ తారీఖు)
ఒక రివాయత్ ప్రకారం హిజ్రీ యొక్క 212వ లేదా 214వ సంవత్సరం మదీనహ్ సమీపంలో ఉన్న “బసరియా” అనబడే ఒక గ్రామంలో హజ్రత్ ఇమామ్ అలీయున్నఖీ(అ.స) జన్మించారు.

3వ తారీఖు:
కొన్ని రివాయతుల ప్రకారం హిజ్రీ యొక్క 254వ సంవత్సరం “సామరా”లో హజ్రత్ ఇమామ్ అలీయున్నఖీ(అ.స) మరణించారు.
ఇమామ్ అలీ నఖీ(అ.స), దైవప్రవక్త(స.అ) యొక్క 10వ ఉత్తరాధికారి. జిల్ హిజ్ మాసం 15వ తేది హిజ్రీ యొక్క 212 సంవత్సరంలో మదీనహ్ యొక్క చుట్టప్రక్కలకు చెందిన ఒక ప్రదేశం అయిన “సిర్యా”లో జన్మించారు.[2] తండ్రి ఇమామ్ జవాద్(అ.స) తల్లి “సమానహ్”. ఇమామ్ యొక్క ప్రముఖ బిరుదులు “నఖీ” మరియు “హాదీ”, వారిని “అబుల్ హసనె సాలిస్” అని కూడా అంటారు.

10వ తారీఖు:
హిజ్రీ యొక్క 195వ సంవత్సరం శుక్రవారం రోజున హజ్రత్ ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స) జన్మించారు.
ఇమామ్ ముహమ్మద్ తఖీ(అ.స), దైవప్రవక్త(స.అ) యొక్క 9వ ఉత్తరాధికారి. పేరు “ముహమ్మద్”, కున్నియత్ “అబూ జాఫర్”, బిరుదు “తఖీ” మరియు “జవాద్”, రమజాన్ మాసం హిజ్రీ 195వ సంవత్సరం మదీనహ్ పట్టణంలో జన్మించారు.[3] తండ్రి ఇమామ్ రిజా(అ.స), తల్లి “సబీకహ్” ఈమె దైవప్రవక్త(స.అ) భార్య అయిన “మారియా ఖిబ్తియహ్” వంశానికి చెందివారు.
ఇమామ్ జవాద్(అ.స) యొక్క తండ్రి మరణించినపుడు వారు 8 సంవత్సరాల వయసు కలిగివున్నారు. 25 సంవత్సరాల వయసులో విషం ద్వార చంపబడ్డారు. వారి సమాధి బగ్దాద్ లో తన పితామహులైన ఇమామ్ మూసా కాజిమ్(అ.స) ప్రక్కన ఉంది.

13వ తారీఖు:
హిజ్రత్ కన్న 33 సంవత్సరాల క్రితం ఆముల్ ఫీల్ 30వ సంవత్సరం అల్లాహ్ గృహం అనగ కాబాలో హజ్రత్ అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) జన్మించారు. తల్లి ఫాతెమా బింతె అసద్ మరియు తండ్రి అబూతాలిబ్. రమజాన్ మాసం 21వ తేదీ హిజ్రీ 40వ సంవత్సరం కూఫా పట్టణంలో వీరమరణం పొందారు. వారి సమాధి నజఫె అష్రఫ్ లో ఉంది.

15వ తారీఖు:
హిజ్రీ యొక్క 63వ సంవత్సరంలో జనాబె జైనబ్ బింతె అలీ(అ.స) మరణించారు.
హజ్రత్ జైనబ్(అ.స), దైవప్రవక్త(స.అ) మరియు జనాబె ఖదీజా(అ.స) యొక్క మనవరాలు. జనాబె అబూతాలిబ్(అ.స) యొక్క పౌత్రి. హజ్రత్ ఇమామ్ అలీ(అ.స) మరియు హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) యొక్క కుమార్తె. ఇమామ్ హసన్ మరియు ఇమామ్ హుసైన్(అ.స) మరియు హజ్రత్ అబ్బాస్(అ.స) యొక్క చెల్లెలు. ఇస్లాం ప్రచారీ అయిన జఫరె తయ్యార్ మరియు అస్మా బింతె ఉమైస్ యొక్క కోడలు. త్యాగానికి మరియు ఔదార్యానికి మారు పేరు అయిన అబ్దుల్లాహ్ ఇబ్నె జాఫర్ యొక్క భార్య.[4]

25వ తారీఖు:
హిజ్రీ యొక్క 183వ సంవత్సరంలో హజ్రత్ ఇమామ్ మూసా కాజిమ్(అ.స) కారాగారంలో హారున్ అల్ రషీద్ ఆదేశానుసారం చంపబడ్డారు.
దైవప్రవక్త(స.అ) 7వ ఉత్తరాధికారి హజ్రత్ మూసా(అ.స). వారి బిరుదు కాజిమ్. తల్లి “హమీదహ్” తండ్రి హజ్రత్ సాదిఖ్(అ.స). ఇమామ్ మూసా కాజిమ్(అ.స) సఫర్ మాసం 7వ తేదీ హిజ్రీ యొక్క 128వ సంవత్సరంలో “అబ్వా”లో జన్మించారు. వారు రజబ్ మాసం, హిజ్రీ యొక్క 183వ సంవత్సరంలో 55 వయసులో హారున్ అల్ రషీద్ ఆదేశానుసారం విషం ద్వార చంపబడ్డారు. వారు బగ్దాద్(ఇరాఖ్) లో ఉన్న “కాజిమైన్” పట్టణంలో సమాధి చేయబడ్డారు.[5]

27వ తారీఖు:
ఈ రోజు హజ్రత్ ముహమ్మద్(స.అ) దైవప్రవక్తగా ఎన్నుకోబడిన రోజు. అల్లాహ్ తరపు నుండి దైవవాణి అవతరించబడింది. ఈ రోజు అతి మహోన్నతమైన పండగ దీనముల నుండి ఒకటి.[6]

28వ తారీఖు:
హిజ్రీ యొక్క 60వ సంవత్సరంలో హజ్రత్ ఇమామ్ హుసైన్ ఇబ్నె అలీ(అ.స) మదీనహ్ నుండి తన కుటుంబ సభ్యులతో ప్రయాణం మొదలు పెట్టారు. ఆ తరువాత వారు కర్బలాలో అతి దారుణంగా హతమార్చబడ్డారు.

రిఫ్రెన్స్
1. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, ఖుమ్, మన్షూరాతు మక్తబతు బసీరతీ, పేజీ261.
2. షేఖ్ ముఫీద్, అల్ ఇర్షాద్, ఖుమ్, మన్షూరాతు మక్తబతి బసీరతీ, పేజీ327.
3. కులైనీ, అల్ ఉసూల్ మినల్ కాఫీ, తహ్రాన్, మక్తబతుస్సదూఖ్, 1381హి, భాగం1, పేజీ 492.
4. ముంతహల్ ఆమాల్, జనాబె జైనబ్(స.అ) జీవిత చరిత్ర.
5. సీరయె పీష్వాయాన్, మహ్దీ పీష్వాయీ, పేజీ450.
6. ఫజీలతె మాహె రజబ్ వ మునాసిబత్ హాయే మొహిమె ఆన్, పేజీ26.
హౌజా నెట్. ఫజీలతె మాహె రజబ్ వ మునాసిబత్ హాయే మొహిమె ఆన్, పేజీ26.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 4