షైతాన్ కు శ్రమ తగ్గించే మూడు రకాల వ్యక్తుల గురించి తెలియపరిచిన ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] యొక్క హదీస్ వివరణ.
ఖుర్ఆన్ అనుసారం షైతాన్ మానవుల బద్దశత్రువు. షైతాన్ చెడ్డవారి పై తన దృష్టి పెట్టడు, నిరంతరం అతడి దృష్టి సజ్జనులపైనే ఉంటుంది. అల్లాహ్ సామిప్యం కోరే దాసులంటే అతడికి ఏమాత్రం ఇష్టం ఉండదు. విచిత్రమైన విషయమేమిటంటే పిల్లలు కీ ఇచ్చి బొమ్మలను వదిలేసినట్టు షైతాన్ కూడా మూడు రకాల వారికి కీ ఇచ్చి ఇక వారి వైపుకు వెళ్లను అని అంటున్నాడు మరి వారెవరో ఇమామ్ జాఫర్ సాదిఖ్[అ.స] మాటల్లో తెలుసుకుందాం.
ఇమామ్ సాదిఖ్ ఇలా ప్రవచించారు: “ఇబ్లీస్ లఅనతుల్లాహ్ అలైహ్ తన సైన్యంతో ఇలా అన్నాడు: నేను ఆదమ్ సంతతిని(మానవులను) మూడు పను చేసేందుకు పురికొల్పుతాను ఆ తరువాత అతడు ఏ పని చేస్తున్నాడు అన్నది పట్టించుకోను ఎందుకంటే ఆ తరువాత అతడి ఏ పనీ అంగీకరించబదు” ఆ మూడు పనులు:
1. అతడు ఎక్కువ పుణ్యకార్యాలు చేసినప్పుడు. (అనగా నేనే అందరిలో పుణ్యత్ముడని అని భావించుకోవడం)
2. చేసిన పాపాలను మర్చిపోయినప్పుడు.
3. గర్వం మరియు అహానికి గురి అయినప్పుడు. (బిహారుల్ అన్వార్, భాగం69, 315)
రిఫ్రెన్స్
అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, దారు అహ్యాయిత్తురాసిల్ అరబీ, బీరూత్, 1403.
వ్యాఖ్యానించండి