రజబ్ మాసం యొక్క పేర్లు

ఆది, 01/22/2023 - 16:31

రజబ్ మాసం చాలా గొప్ప మాసం. దీని ప్రసిద్ధిత మరియు ప్రాముఖ్య గురించి హదీసులలో వివరించబడి ఉంది. ఈ మాసాన్ని గౌరవించాలి మరియు గొప్పగా భావించాలి.

రజబ్ మాసం యొక్క పేర్లు

బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్

రజబ్ మాసం చాలా గొప్ప మాసం. దీని ప్రసిద్ధిత మరియు ప్రాముఖ్య గురించి హదీసులలో వివరించబడి ఉంది. ఈ మాసాన్ని గౌరవించాలి మరియు గొప్పగా భావించాలి.

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: రజబ్ మాసం, అల్లాహ్ తరపు నుండి ఎన్నుకోబడ్డ మాసాలలో ఒకటి, అది అల్లాహ్ మాసం. రజబ్ మాసాన్ని గొప్పగా భావించినవారు అల్లాహ్ ఆదేశాన్ని గౌరవించినట్లే, మరి అల్లాహ్ ఆదేశాన్ని గౌరవించిన వాడిని అల్లాహ్ అనుగ్రహాలతో నిండి ఉన్న స్వర్గంలో ప్రవేశింపజేస్తాడు....[1]

ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) ఉల్లేఖనం: నాలుగు రాత్రులను అల్లాహ్ ప్రార్థనకై పరిమితం చేసే మనిషిని నేను ఇష్టపడతాను, ఈదె ఫిత్ర్ రాత్రి, ఈదె ఖుర్బాన్ రాత్రి, షాబాన్ నెల రేపు 15వ తేది అనగ వచ్చే రాత్రి, రజబ్ మాసం యొక్క మొదటి రాత్రి(చంద్రదర్శనం చేసిన రాత్రి).[2]

రజబ్ మాసం యొక్క మరో పేరు
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: రజబ్ మాసాన్ని “కురిసే నెల” అని నామకరించారు. ఎందుకంటే ఈ నెలలో నా ఉమ్మత్ ప్రజల పై అతిగా అల్లాహ్ కారుణ్యం కురుస్తుంది.[3]
ఇమామ్ మూసా కాజిమ్(అ.స) ఉల్లేఖనం: రజబ్, పాలకన్నా తెల్లగా మరియు తేనె కన్నా తియ్యగా ఉండే స్వర్గపు సెలయేరు. రజబ్ మాసంలో ఒకరోజు ఉపవాసం ఉన్నా అతడికి అల్లాహ్ ఆ సెలయేరు నుండి త్రాగే భాగ్యాన్ని కలిగిస్తాడు.[4]
ఇమామ్ అలీ(అ.స) ఉల్లేఖనం: రమజాన్ మాసం అల్లాహ్ ది, షాబాన్ మాసం దైవప్రవక్త(స.అ) ది, రజబ్ మాసం నాది.[5]

దాయి
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: అల్లాహ్, సప్తాకాశాలలో, దూతను నియమించాడు. వారిని “దాయి” అంటారు. రజబ్ మాసం రాగానే, ఆ మాసం యొక్క ప్రతి రాత్రి ఉదయం వరకు ఇలా పిలుస్తూ ఉంటారు: “స్మరించేవారికి శుభవార్త, విధేయతలకు శుభవార్త”
అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “నాతో కూర్చున్న వారితో నేనూ కూర్చుంటాను, నా పట్ల విధేయత చూపే వారికి నేనూ విధేయత చూపుతాను, నాతో క్షమాపణ కోరే వారిని క్షమిస్తాను. (ఈ) నెల, నా నెల, (ఈ) దాసుడు నా దాసుడు మరియు (ఈ) దయ నా దయ. ఈ మాసంలో నన్ను పిలిచినవాడికి సమాధానమిస్తాను, మరియు నన్ను కోరుకున్నవారి కోరికలను తీరుస్తాను, మరియు నా నుండి రుజుమార్గం కోరితె నేను అతడికి రుజుమార్గం చూపిస్తాను. ఈ మాసాన్ని నా మరియు నా దాసుని మధ్య సంబంధంగా నిర్ధారించాను. ఈ సంబంధం(త్రాడు)ను పట్టుకున్నవాడు నా వరకు చేరిపోయినట్లే”[6]

కారుణ్యం కురిసే మాసం
అల్లామా ముహమ్మద్ బాఖిర్ మజ్లిసీ తన హదీస్ గ్రంథం “బిహారుల్ అన్వార్” లో ఇలా హదీస్ ఉల్లేఖించెను: రజబ్ మాసం రాగానే  దైవప్రవక్త(స.అ) ముస్లిములను సంగ్రహించి ఉపన్యాసమిచ్చేవారు... వారు ఇలా ప్రవచించేవారు: ముస్లిములారా! చాలా గొప్ప మరియు మంచి మాసం మిమ్మల్ని తన నీడతో కమ్ముకుంది, ఈ నెల, కురిసే నెల. అల్లాహ్ ఈ నెలలో తన కారుణ్యాన్ని తన దాసులపై కురిపిస్తాడు, బహుదైవారాధకుడు మరియు ఇస్లాంలో కొత్త కొత్త పద్ధతులను సృష్టించిన వారి పై తప్ప.[7]

అల్లాహ్ ఎన్నికలు
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: అల్లాహ్ ప్రతి వాటి నుండి నాలుగు వాటి (నమూలుగా) ఎన్నుకున్నాడు..
దైవదూతల నుండి జిబ్రయీల్, మీకాయీల్, ఇస్రాఫీల్ మరియు ఇజ్రాయీల్(అ.స) లను ఎన్నుకునెను.
దైవప్రవక్తల నుండి నలుగురిని జిహాద్ కై ఎన్నుకునెను; ఇబ్రహీమ్, దావూద్, మూసా మరియు నేను.
వంశాల నుండి నాలుగు వంశాలు ఎన్నుకొని ఇలా ప్రవచించెను; “ఆదమ్, నూహ్ మరియు ఇబ్రాహీమ్ వంశస్తులను మరియ ఇమ్రాన్ వంశస్తులను ఎన్నుకునెను”.
పట్టణాలలో నాలుగు పట్టణాలను ఎన్నుకునెను; మదీనహ్, బైతుల్ ముఖద్దస్, కూఫా మరియు మక్కా.
స్ర్తీల నుండి నలుగురు స్ర్తీలను ఎన్నుకునెను; మర్యమ్, ఆసియా, ఖదీజహ్ మరియు ఫాతెమా.
హజ్ ఆమాలులో నాలుగు వాటిని ఎన్నుకునెను; సజ్(ఖుర్బానీ), అజ్(లైబైక్ అని చెప్పటం), ఎహ్రామ్(ప్రత్యేక దుస్తులు ధరించటం) తవాఫ్(ప్రదక్షణాలు).
మాసాలలో నాలుగు మాసాలు ఎన్నుకునెను; రజబ్, షవ్వాల్, జిల్ ఖఅదహ్ మరియు జిల్ హిజ్జహ్.
రోజులలో నాలుగు రోజులు ఎన్నుకునెను; శుక్రవారం, తర్వీహ్(జిల్ హిజ్జహ్ యొక్క 8వ లేదీ), అరఫహ్ రోజు మరియు ఖుర్బానీ రోజు.[8]

రిఫరెన్స్
1. ముత్తఖీయె హిందీ, కన్జుల్ ఉమ్మాల్, భాగం12, పేజీ323, హదీస్35217.
2. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం91, పేజీ123, హదీస్12, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ.
3. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం97, పేజీ39, హదీస్24, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ.
4. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం8, పేజీ175, హదీస్126, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ.
5. షేఖ్ తూసీ, మిస్బాహుల్ మతహజ్జిద్, పేజీ797.
6. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం98, పేజీ377, హదీస్1, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ.
7. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం97, పేజీ47, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ.
8. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం60, పేజీ205, బీరూత్, దారు ఇహ్యాయి అల్ తురాస్ అల్ అరబీ.

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 4 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 6