ఇమామ్ కాజిమ్(అ.స) యొక్క సద్గుణాలు

సోమ, 02/13/2023 - 15:51

ఇమామ్ మూసా కాజిమ్(అ.స) యొక్క సద్గుణాలు, వారి గొప్పతనం మరియు ఇమామత్ ను వివరిస్తున్న కొన్ని సంఘటనలు...

ఇమామ్ కాజిమ్ యొక్క సద్గుణాలు

ఇమామ్ మూసా కాజిమ్(అ.స) ఇస్లామీయ చరిత్రకారులందరి రచనానుసారం, వారు సాధారణ జీవితం మరియు ప్రార్థనలో చాలా ప్రసిద్ధి చెందినవారు; వారు తన ప్రార్థనల మరియు అతి శ్రద్ధ కలిగి ఉండడం వల్ల “అబ్దె సాలెహ్”(అత్యుత్తమ దాసుడు) గా ప్రసిద్ధి చెందారు. ఇతరులకు ప్రసాదించడంలో కూడా వారి పూర్వీకుల వలే ఉండేవారు. ఇలా ఉల్లేఖించబడి ఉంది; వారు 3 వందల దీనారుల, 4 వందల దీనారుల మరియు 2 వందల దీనారుల సంచులను పేదవారిలో పంచేవారు. ఇమామ్ మూసా కాజిమ్(అ.స) ఇలా ఉల్లేఖించారు: “నా తండ్రి(ఇమామ్ జాఫరె సాదిఖ్) నిత్యం నన్ను ఇతరులను సహాయం చేయాలి మరియు దానం చేయాలి అని చెప్పేవారు”
అయితే వారు ఇంతిలా ఇతరులను సహాయం చేస్తున్నప్పటికీ వారు మాత్రం మొరటు దుస్తులు ధరించేవారు. ఈ నడవడిక వారి ఆత్మ యొక్క గొప్పతనం మరియు వారికి ఈ ప్రాపంచిక అందచందాల పట్ల మక్కువ లేకపోవడం పై నిదర్శనం అని ఉల్లేఖించబడి ఉంది. వారు తమ భార్యా, పిల్లల మరియు వారి వద్ద ఉండేవారి పట్ల చాలా ప్రేమగా ఉండేవారు, నిత్యం పేదవారి గురించే ఆలోచిస్తూ ఉండేవారు, వారికి ఏదో విధంగా సహాయపడుతూ ఉండేవారు. 
వారు ఖుర్ఆన్ పఠనాన్ని చాలా ఇష్టపడేవారు, ఖుర్ఆన్ ను మంచి స్వరంతో పఠించేవారు, వారి స్వరం వల్ల ప్రజలు వారి ఇంటి చూట్టూ వచ్చి చేరేవారు. వారు ఖుర్ఆన్ పఠిస్తూ రోధించేవారు.
దుర్మార్గులు వారిని మరియు వారి పూర్వీకులను దూషించేవారు, వారిని నిందించేవారు, కాని ఇమామ్ వారి పట్ల ఔదార్యంగా ఉండేవారు, వారిని ఏమీ అనేవారు కాదు. ఒక్కోసారి వారికి మేలు చేసి సన్మార్గం చూపేవారు. ఈ లక్షణాల వలనే వారికి “కాజిమ్” అనే బిరుదు ఇవ్వబడింది. కాజిమ్ అనగా ఆపుకునేవాడు, ఆగ్రహాన్ని అణిచేవాడు అని అర్ధం. కాని న్యాయఅన్యాయాల మాటకోస్తే వారు ఉరుకునేవారు కాదు. వారు ఇలా ఉల్లేఖించారు: “యదార్థాన్నే చెప్పు దాని ద్వార నువ్వు నాశనం అయిపోయినా సరే”[1]

ఇమామ్(అ.స) గొప్పతనాన్ని మరియు వారి ఇమామత్ ను నిదర్శించే కొన్ని సంఘటనలు ఇక్కడ వివరిస్తున్నాము:
మొదటి సంఘటన
హమీద్ తూసీ ఇలా ఉల్లేఖించెను: హారున్ అల్ రషీద్ నన్ను పిలిచి కారాగారానికి వెళ్ళి మూసా ఇబ్నె జాఫర్(అ.స) ను చంపమని ఆదేశించాడు. నేను కారాగారానికి చేరేటప్పటికి నమాజ్ సమయం అయ్యింది, మూసా ఇబ్నె జాఫర్(అ.స) నమాజ్ చదువుతున్నారు, వారి ఎడమ ప్రక్క ఒక పులి మరియు కుడి వైపు ఒక పులి నిలబడి ఉన్నాయి, ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపడి తిరిగి వచ్చేశాను. అక్కడ చూసింది హారూన్ కు చెప్పాను. నేను చెప్పింది నిజమో కాదో అని తెలుసుకోవడానికి హారూన్ తన నమ్మకస్తులలో కొందరిని నాతో పంపాడు. కారాగారంలో ప్రవేశించగానే, మరలా అదే దృశాన్ని మేమందరం చూశాము. తిరిగి వెళ్ళి మేమందరం చూసిన దృశాన్ని చెప్పాము. హారూన్ అల్ రషీద్ ప్రమాణం చేసి మీలో ఎవరైనా ఈ విషయాన్ని బయటకి చెప్పారో చచ్చారే అని అన్నాడు. అందుకనే హారూన్ బ్రతికున్నంత కాలం ఈ సంఘటనను వెల్లడించలేదు.[2]  

రెండవ సంఘటన
ఇమామ్ మూసా కాజిమ్[అ.స] ప్రమాణం చేసి చెప్పారు నేను ముహమ్మద్ ఇబ్నె అబ్దుల్లాహ్(వారి పిన తండ్రి కుమారుడు)తో మాట్లాడను అని. ఇబ్రాహీమ్ ఇబ్నె ముఫజ్జల్ ఇలా ఉల్లేఖించారు: మేము ఇమామ్ కాజిమ్(అ.స) వద్దకు వెళ్ళాము, వారితో మీరు జనాన్ని మంచి చేయమని బంధువులతో కలిసి ఉండమని ఉపదేశిస్తూ ఉంటారు; అయితే మీరే స్వయంగా మీ పినతండ్రి కుమారునితో మాట్లాడనని ప్రమాణం చేశారు.(సరికాదు కదా), అని అన్నాము.
ఇమామ్ ఇలా సమాధానమిచ్చారు: నేను అతడితో మాట్లాడకపోవడానికి కారణం, అతడికి మేలు కలిపించటం కోసమే; అదేలా అంటే అతడు నిరంతరం నా గురించి చెడుగా చెబుతూ ఉంటాడు. ఎప్పుడైతే జనం నేను అతడితో మాట్లాడనని తెలుసుకుంటారో అతడి మాటలను వారు నమ్మరు అలా అతడు నా చాడీలు చెప్పటం మానుకుంటాడు, ఇది(నా ఈ పని) అతడికి మేలు కలిపిస్తుంది.[3]

మూడవ సంఘటన
అబూబసీర్ ఉల్లేఖనం ప్రకారం: ఒకరోజు ఇమామ మూసా కాజిమ్(అ.స)తో ఇలా ప్రశ్నించాను: ఇమామ్ ను ఎలా గుర్తపట్టగలం?.
ఇమామ్ ఇలా సమాధానమిచ్చారు: తమ కాలపు ఇమామ్ ను గర్తు పట్టడానికి కొన్ని నిషానిలు ఉన్నాయి వాటిలో ఒకటి ఇమామ్ అన్ని భాషలలో మాట్లడగలడు. మాట్లాడుతుండగానే ఖురాసాన్(ఇరాన్) నుండి ఒక వ్యక్తి వచ్చి సలామ్ చేసి అరబీ భాషలో మాట్లాడటం మొదలు పెట్టాడు. ఇమామ్ అతడికి ఖురాసానీ భాషలో సమాధానమిచ్చారు. ఆ వ్యక్తి “అల్లాహ్ సాక్షిగా నేను మీతో అరబీలో మాట్లాడింది మీకు ఖురాసానీ భాష మాట్లాడటం రాదని భావించి, కాని చూస్తే మీరు నా కన్నా బాగా ఖురాసానీ భాషను మాట్లాడుతున్నారు” అని అన్నాడు. ఇమామ్ ఇలా అన్నారు: నాకు ఈ భాష నీ కన్నా బాగా తెలియకపోయి ఉంటే నీపై నాకున్న ప్రత్యేకత మరియు జ్ఞానం ఏమిటి! ఎలా నేను ఖిలాఫత్ మరియు ఇమామత్ కు అర్హుడనవుతాను?.
ఆ తరువాత ఇమామ్ ఇలా అన్నారు: ఏ ఒక్క సమూహం యొక్క భాష కూడా మా నుండి దాగి లేదు(మాకు అన్ని భాషలు తెలుసు).[4]

రిఫరెన్స్

1. వర్రామ్, మజ్ముఅయె వర్రామ్, భాగం1, పేజీ12.
2. అక్బర్ పూర్, హబీబుల్లాహ్, మొఅజాతె ఇమామ్ కాజిమ్(అ.స), పేజీ61, మష్హద్, నష్రె దిఖ్ఖత్, 1381.
3. జమానీ, ముస్తఫా, జిందగానీయె ఇమామ్ కాజిమ్(అ.స), పేజీ63, మష్హద్, నష్రె విలాయత్, 1378.
4. అక్బర్ పూర్, హబీబుల్లాహ్, మొఅజాతె ఇమామ్ కాజిమ్[అ.స], పేజీ41, మష్హద్, నష్రె దిఖ్ఖత్, 1381.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 15 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9