వివేకం మరియు అవివేకం యొక్క అర్ధాలు మరియు వీటి గురించి ఖుర్ఆన్ మరియు రివాయతుల వివరణ...

వివేకం: బుద్ధి, జ్ఞానం, తెలివి మొ..
రివాతలనుసారం మనిషి నిత్యం సృష్టికర్త ను బుద్ధివివేకాలను ప్రసాదించమని కోరుకోవాలి. అంటే మనిషి పరధ్యానం మరియు నిర్లక్ష్యంగా ఉండ కూడదు, నిత్యం బుద్ధివివేకాలను ఉపయోగించాలి, జాగృతి కలిగి ఉండాలి.
బుద్ధి మరియు జాగృతి, అమృతం లాంటివి, ఇస్లాం పరిభాషలో దీనిని వివిధ రకాలుగా వివిధ సందర్భాలలో ప్రాధాన్యత ఇవ్వబడింది. దీనినే బసీరత్ (అంతర్ దృష్టి) అంటారు. ఇమామ్ అలీ(అ.స) నెహ్జుల్ బలాగహ్ లో ఇలా ప్రవచించారు: “జాగృతి కాంతితో కళ్లు, చెవులు మరియు హృదయాన్ని కాంతిపజేశారు”[1]
మరో చోట ఇలా ఉపదేశించారు: “నీపై ఆపద వచ్చి పడుతుంది అన్న భయం రాత్రి నిన్ను నిద్ర నుంచి ఎందుకు లేపలేదు? నీవు అల్లాహ్ ఆదేశాలను పాటించలేదు, పాపాలలో మునిగి ఉన్నావు, నీవు అల్లాహ్ అధికారంలో లేవా? అయితే నీ హృదయానికి పట్టిన పరధ్యానం మరియు నిర్లక్ష్య రోగాలను నీ గట్టి నిర్ణయం మరియు ఆలోచనతో చికిత్స చేయి. నీ కళ్లను మాసేసిన ఈ నిర్లక్ష్యాన్ని జాగృతితో తెరిచివేయి, అల్లాహ్ విధేయుడిగా మారు, ఆయన స్పరణతో పరిచయాన్ని పెంచుకో”[2]
పరధ్యానం మరియు నిర్లక్ష్యం ప్రాణాలను హరించే రోగం అని అల్లాహ్ ఖుర్ఆన్ లో చాలా ఆయతులలో సూచించెను: “ప్రజల లెక్కల ఘడియ సమీపించింది. అయిన్నప్పటికీ వారు పరధ్యనంలో పడి, విముఖత చూపుతున్నారు. వారి వద్దకు వారి ప్రభువు తరపునుంచి క్రొత్తగా ఏ ఉపదేశం వచ్చినా దాన్ని వారు ఆడుకుంటూ వింటారు(ఆషామాషీగా తీసుకుంటారు). అసలు వారి హృదయాలు ప్రమత్తతలో పడి ఉన్నాయి”[సూరయె అంబియా, ఆయత్1-3]
అవివేకం: బుద్దిహీనత, అజ్ఞానం మరియు తప్పుడు చర్యలు మొ...
మనిషి తన సృష్టికర్తను తనను బుద్దిహీనత, అజ్ఞానం మరియు మిథ్యకార్యముల నుంచి దూరంగా ఉంచమని వేడుకుంటూ ఉండాలి. కొంచెం దృష్టి పెట్టి చూసినట్లైతే ఇహపరలోకాల కష్టాలకు మూలకారణం అజ్ఞానమే అని తెలుస్తుంది; అందుకే అల్లాహ్ తరపు నుంచి అవతరించబడ్డ ప్రవక్తలందరూ ఈ హానికరమైన అజ్ఞానం అనబడే రోగం నుండి విముక్తి పొందాలని జ్ఞానాన్ని పంచేవారు.
అజ్ఞానంలో ఉన్న చెడును దైవప్రవక్త(అ.స) ఇలా వివరించారు: “ఇహపరలోకాల మంచి జ్ఞానంతో పాటు ఉంది, ఇహపరలోకాల చెడు అజ్ఞానంతో పాటు ఉంది”[3]
మరో రివాయత్ లో ఇమామ్ అలీ(అ.స) ఇలా ప్రవచించారు: “అజ్ఞానం అతి పెద్ద ఆపద”[4] మరో రివాయత్ లో వారు అజ్ఞానాన్ని చెడుకార్యములన్నీంటిని యొక్క మూలం అని సూచించారు.[5]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “జ్ఞానం, మంచివాటన్నీంటికి మూలం మరియ అజ్ఞానం, చెడ్డవాటన్నీంటికి మూలం”[6]
విజ్ఞానం మరియు ఉలమాల ప్రతిష్టత ఖుర్ఆన్ దృష్టిలో
ఖుర్ఆన్ ఉపదేశం: “అల్లాహ్ దాసులలో జ్ఞాన సంపన్నులు మాత్రమే ఆయనకు భయపడతారు”[సూరయె ఫాతిర్, ఆయత్28]
ఖుర్ఆన్ ఉపదేశం: “చెప్పండి – తెలిసినవారు, తెలియనివారు ఒక్కటేనా? బుద్దిమంతులు మాత్రమే ఉపదేశాన్ని గ్రహిస్తారు”[సూరయె జుమర్, ఆయత్9]
ఖుర్ఆన్ ఉపదేశం: “ప్రజలకు బోధపరచడానికి మేము ఈ ఉపమానాలను ఇస్తున్నాము. అయితే జ్ఞానం కలవారు మాత్రమే వీటిని అర్థం చేసుకోగలుగుతారు”[సూరయె అన్కబూత్, ఆయత్43]
ఖుర్ఆన్ ఉపదేశం: “ఎవరికి విజ్ఞతా వివేచనలు వొసగబడ్డాయో అతనికి ఎన్నో మేళ్లు వొసగబడినట్లే”[సూరయె బఖరహ్, ఆయత్269]
విజ్ఞానం మరియు ఉలమాల ప్రతిష్టత రివాయతుల దృష్టిలో
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “ఉలమాలు ప్రవక్తల వారసులు”[7]
మరో హదీసులో ఇలా ఉల్లేఖించారు: అల్లాహ్! నా ఖలీఫాలపై దయ చూపించుగాక! కొందరు ఇలా ప్రశ్నించారు: ఓ దైవప్రవక్తా(స.అ)! మీ ఖలీఫాలు ఎవరు? దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: నా తరువాత వచ్చేవారు, నా హదీసులు మరియు సున్నతులను ఉల్లేఖిస్తారు మరియు వాటిని ప్రజల వద్దకు చేరుస్తారు.[8]
హజ్రత్ సయ్యదుస్సాజిదీన్(అ.స) ఉల్లేఖనం: “ఒకవేళ ప్రజలకు విద్యాభ్యాసంలో ఉన్నదాన్ని తెలుసుకుంటే ఏది ఎంతైనా సరే విద్యాభ్యాసం కోసం వెళతాడు; ఒకవేళ అతడి రక్తం చిందించాల్సిన అవసరం పడినా సరే మరియు సముద్రాల లోతుల్లో వెళ్లాల్సి వచ్చినా సరే”[9]
హజ్రత్ మొహమ్మద్ బాఖిర్(అ.స) ఉల్లేఖనం: “తాను నేర్చుకున్న విద్య పై అమలు చేసే ఆలిమ్ 70 వేల ఆబిద్(ఆరాధనలు చేసేవాడు) కన్నా ప్రతిష్టత గలవాడు”.[10]
హజ్రత్ జాఫరె సాదిఖ్(స.అ) ఉల్లేఖనం: “ఒకవేళ అల్లాహ్ పట్ల జ్ఞానం (నేర్చుకోవడం) యొక్క ప్రతిష్టత ప్రజలకు తెలిస్తే, వాళ్లు ప్రపంచం మరియు అందులో ఉన్న అనుగ్రహాల పై ఆశపడరు, ప్రపంచం వాళ్ల దృష్టిలో తక్కువగా కనిపిస్తుంది... అల్లాహ్ పట్ల జ్ఞానం భయాందోళన సమయంలో సహకారి, ఒంటరితనంలో మిత్రుడు, ప్రతీ చీకటిలో కాంతి, బలహీనుల శక్తి, కష్టాలకు ఉపసమనం”.[11]
రిఫరెన్స్
1. ఇర్షాదుల్ ఖులూబ్ (తర్జుమా తబాతబాయి), భాగం68, పేజీ192
2. నెహ్జుల్ బలాగహ్, (సుబ్హీ సాలెహ్), పేజీ344
3. నెహ్జల్ ఫసాహ, పేజీ466
4. తస్నీఫు గురరుల్ హికమ్, పేజీ73.
5. తస్నీఫు గురరుల్ హికమ్, పేజీ73
6. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, (తా-బీరూత్), భాగం74, పేజీ175.
7. కన్జుల్ ఉమ్మాల్, భాగం10, పేజీ135, హదీస్28679; కాఫీ, భాగం1, పేజీ32, హదీస్2.
8. బిహారుల్ అన్వార్, భాగం2, పేజీ144, హదీస్4.
9. కాఫీ, భాగం1, పేజీ35, హదీస్5.
10. బిహారుల్ అన్వార్, భాగం2, పేజీ19, హదీస్50 క్రమంలో.
11. కాఫీ, భాగం8, పేదీ248.
వ్యాఖ్యలు
Behtareen vazahat
వ్యాఖ్యానించండి