. మాయిదహ్ సూరా 3వ ఆయత్ ఎప్పుడు ఎవరి ప్రతిష్టతను వివరిస్తూ అవతరించబడిందో సంక్షిప్తంగా.
ఇది కూడా ఖిలాఫత్ పదవికి సంబంధించిన ఆయతే. ٱلۡيَوۡمَ أَكۡمَلۡتُ لَكُمۡ دِينَكُمۡ وَأَتۡمَمۡتُ عَلَيۡكُمۡ نِعۡمَتِي وَرَضِيتُ لَكُمُ ٱلۡإِسۡلَٰمَ دِينٗا; ఈ రోజు నేను మా దీన్
ని మీ కొరకు పరిపూర్ణం చేశాను. మీ పై నా అనుగ్రహాన్ని పూర్తి చేశాను. మీ కొరకు ఇస్లాం ధర్మాన్ని ఇష్టానుసారమైనదిగా చేశాను.
“దైవప్రవక్[స.అ], ‘గదీర్ మైదానం’లో హజ్రత్ అలీ[అ.స] యొక్క ఖిలాఫత్ అధికార ప్రకటన తరువాత ఈ ఆయత్ అవతరించబడింది” అని షియా ముస్లింలందరూ ఏకీభవిస్తారు. మరి ఈ విషయాలను పవిత్ర అహ్లెబైత్[అ.స]ల రివాయతులతో వెల్లడిస్తారు. అందుకని షియా ముస్లింలు “ఇమామత్”ను ఉసూలె దీన్ లో లెక్కిస్తారు.
మరి అలాగే అహ్లె సున్నత్‌ల చాలా ఉలమాలు కూడా ఈ ఆయత్ అవతరించబడడానికి గల కారణం, “గదీరె ఖుమ్”లో హజ్రత్ అలీ[అ.స] ఖిలాఫత్ ప్రకటన తరువాత అని ఒప్పుకున్నారు. ఉదాహారణకు ఇబ్నె అసాకిర్, తారీఖె దమిష్ఖ్ లో. ఇబ్నె మగాజీ, మనాఖిబే అలీ[అ.స]లో[తారీఖె దమిష్ఖ్, భాగం2, పేజీ75. మనాఖిబే అలీ[అ.స], పేజీ19.]
రిఫ్రెన్స్
ఇబ్నె అసాకిర్, తారీఖె దమిష్ఖ్, భాగం2, పేజీ75. ఇబ్నె మగాజీ, మనాఖిబే అలీ(అ.స), పేజీ19.
వ్యాఖ్యలు
جزاک اللہ
Shukriya...
వ్యాఖ్యానించండి