నిస్సందేహముగా పుణ్యం మానవుని బుద్ధిని బట్టి ప్రసాదించబడుతుంది అన్న విషయం పై ఇమామ్ హదీస్ నిదర్శనం.
“సులైమానె దైలమీ” ఉల్లేఖనం ప్రకారం, అతను ఇలా అన్నారు: నేను ఇమామ్ జాఫర్ సాదిఖ్[అ.స]తో ధర్మపరంగా, ప్రార్ధనల పరంగా, ప్రతిష్టత పరంగా మంచి స్థానం కలిగి ఉన్న వాడి గురించి చెప్పాను, వారు అతడి బుద్ధి గురించి చెప్పూ అన్నారు. నేను తెలియదూ, అన్నాను. ఇమామ్ ఇలా అన్నారు: పుణ్యం బుద్ధిని బట్టి ఇవ్వబడుతుంది, ఇలాగే “బనీ ఇస్రాయీల్”కు చెందిన ఒకవ్యక్తి నది ఒడ్డున ఉన్న ఒక పచ్చని ద్వీపంలో అల్లాహ్ యొక్క ప్రార్ధన చేసేవాడు. ఒక దైవదూత అక్కడ నుండి వెళ్తూ అతడిని చూసి ‘ఓ అల్లాహ్! నీ ఈ దాసుడి పుణ్యాన్ని నాకు చూపించు’ అని కోరాడు. అల్లాహ్ అతడి పుణ్యాన్ని చూపించగా అది ఆ దూతకు చాలా తక్కువ అనిపించింది. అల్లాహ్ ఆ దూతను నీవు అతడితో పాటు (కొంతకాలం) ఉండు అని ఆదేశించాడు. ఆ తరువాత ఆ దూత మనిషి రూపంలో ఆ దాసుడి వద్దకు వచ్చాడు. అతడు నువ్వెవరివీ? అనీ అడిగాడు. నేను కూడా దాసుడను, ఈ ప్రదేశంలో నీ స్థానం మరియు నీ దాసోహం గురించి విని నీతో పాటు అల్లాహ్ ను ప్రార్ధించేందుకు నీ వద్దకు వచ్చాను, అని అన్నాడు. ఆ రోజు అతడితో గడిపాడు. మరుసటిరోజు ఉదయం ఆ దూత అతడితో ‘ఈ ప్రదేశం చాలా శుభ్రంగా, మంచిగా ఉంది ఇదే ప్రార్ధన చేసేందుకు చాలు’ అని అన్నాడు. అప్పడు అతడు ‘ఇక్కడ ఒక దోషముంది’ అన్నాడు. ‘ఆ దోషమేంటీ’ అని దూత ప్రశ్నించాడు. అతడు ‘మా అల్లాహ్ వద్ద చతుష్పాత్తు(నాలుగు కాళ్ళ జంతువు) లేదు, ఒకవేళ ఆయన వద్ద గాడిద ఉండిఉంటే ఇక్కడ దాన్ని మేపేవారము, దాంతో ఈ గడ్డి మాయమయ్యేది!’ అని అన్నాడు. ఆ దూత అల్లాహ్ వద్ద గాడిద లేదు, అన్నాడు. అతడు ‘ఒకవేళ ఉండిఉంటే ఇంత గడ్డి వృధా అయ్యేది కాదు’ అని అన్నాడు. అప్పుడు అల్లాహ్ ఆ దుతకు ఇలా తెలియపరిచాడు: “నిస్సందేహముగా అతడికి అతడి బుద్ధిని బట్టి పుణ్యాన్ని ప్రసాదిస్తాము” [ఉసూలె కాఫీ, భాగం1, పేజీ13]
రిఫ్రెన్స్
మర్హుమ్ కులైనీ, ఉసూలె కాఫీ, ముస్తఫవీ, కితాబ్ ఫురూషియె ఇల్మియయే ఇస్లామియ, తెహ్రాన్, 1369.
వ్యాఖ్యలు
ماشا اللہ
Shukriya...
Thanks nice information about knowledge topic
Shkuriya
Iltemase Dua.
వ్యాఖ్యానించండి