ప్రార్థనల స్వీకరణ

మంగళ, 05/30/2023 - 15:38

మనం చేసే ప్రార్ధనలు అల్లాహ్ సమక్షంలో ఏలా స్వీకరించబడతాయి అన్న విషయంపై సంక్షిప్త వివరణ...

ప్రార్థనల స్వీకరణ

ప్రార్థనలు నిర్వర్తించడం ఒక ఎత్తు అయితే అవి అల్లాహ్ సానిధ్యానా స్వీకరించబడడం మరో ఎత్తు. మనం చేసే ప్రార్థనలన్నీ స్వీకరించబడాలనేదేమీ లేదు. దాసుడి ఇతర చర్యలను బట్టీ, ప్రార్థనల షరత్తులను పాటించడాన్ని బట్టీ మరియు ఇతర ఎన్నో చర్యలను బట్టి అవి స్వీకరించబడతాయా లేదా అనేది ఉంటుంది. సూరయె ఇన్సాన్ లో అల్లాహ్ ఇలా ఉపదేశించెను: “ఇది మీ కర్మలకు బదులుగా ఇవ్వబడిన ప్రతిఫలం. మీ కృషి స్వీకరించబడింది (గుర్తించబడింది అని వారితో అనబడుతుంది)”[సూరయె ఇన్సాన్, ఆయత్23]. అనగా అల్లాహ్ తరపు నుంచి కృతజ్ఞతకు అర్హులవుతారు. దీని అసలైన అర్ధమేమిటంటే ఆ ప్రయత్నానికి ప్రతిఫలం స్వర్గం; ఎందుకంటే స్థాయిని బట్టి ప్రతిఫలం ఉంటుంది అంతే గాని కార్యాన్ని నిర్వర్తించేవారిని బట్టి ప్రతి ఫలం ఉండదు. అల్లాహ్ కృతజ్ఞత స్వర్గం కన్నా తక్కువ అయి ఉండదు, స్వర్గం లేదా దానికి మించినది అయి ఉంటుంది.[2]
ఖుర్ఆన్: “తమ ప్రాపంచిక జీవితపు ప్రయత్నాలన్నీ వృధా అయి పోతున్నప్పటికీ, తాము చేసేదంతా సజావుగానే ఉందని భ్రమ పడేవారే వారు”[సూరయె కహఫ్, ఆయత్104]
పరలోకం కోసం ప్రయత్నించేవారి విశ్వాసి యొక్క ప్రయత్నం కూడా అల్లాహ్ స్వీకరిస్తాడు. దానికి ప్రతిఫలంగా స్వర్గాన్ని ప్రసాదిస్తాడు.
మరో చోటు ఇలా వివరించబడి ఉంది: “మరెవరయితే పరలోకాన్ని కోరుకుని, దానికోసం కృషి చేయవలసిన విధంగా కృషిచేస్తాడో, విశ్వసి అయి ఉంటాడో అలాంటి వాని కృషి అల్లాహ్ వద్ద ఆదరణ పొందుతుంది”[సూరయె బనీ ఇస్రాయీల్, ఆయత్19]

అల్లాహ్ ను మా పాపము పట్ల మా పశ్చాత్తాపాన్ని మరియు తౌబహ్ ను స్వీకరించి మమ్మల్ని క్షమించమని వేడుకోవాలి ఎందుకంటే పాపములు సత్కార్యముల నుంచి అడ్డుకుంటాయి, అదే పాపములు తొలిగిపోతే మన ఆమాల్ అల్లాహ్ సన్నిధిలో స్వీకరించబడతాయి.

హజ్రత్ అలీ(అ.స) ఉల్లేఖనం: “అల్లాహ్ కు భయపడు! అల్లాహ్ కు భయపడు! అల్లాహ్ సాక్షిగా ఆయన నిన్ను క్షమించేశాడన్న విధంగా నీ లోపాలను దాచిపెట్టాడు”[3]

మనందరి ప్రార్ధనలు అల్లాహ్ సమక్షంలో స్వీకరించబడే విధంగా ఉండాలని ఆయననే కోరి ప్రార్ధిద్దాం... ఆమీన్

రిఫరెన్స్
1,2. తఫ్సీరె నమూనహ్, మకారిమ్ షీరాజీ, భాగం12, పేజీ66
3. నెహ్జుల్ బలాగహ్, సుబ్హీ సాలెహ్, పేజీ472

 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 5