ప్రతీ రోజు చదవాల్సిన నాఫెలహ్ నమాజులు మరియు వాటి ప్రాధాన్యత గురించి సంక్షిప్త వివరణ...

నాఫెలహ్ అనగా మంచి మరియు ముస్తహబ్ కార్యం అని, అయితే దాని నిర్వర్తన మనిషిపై విధి కాదు.[1] ఫిఖా పరిభాషలో నాఫెలహ్ ముస్తహబ్ నమాజుల కోసం ఉపయోగపడే పదం.[2]
నాఫెలహ్ రక్అత్ ల సంఖ్య
ప్రతీరోజు చదవాల్సిన నాఫెలహ్ నమాజ్ యొక్క రక్అత్ల్ సంఖ్య 34, అవి:
జొహర్ నమాజ్ యొక్క నాఫెలహ్ నమాజ్: 8 రక్అతుల నమాజ్, ఇవి నమాజె జొహ్ర్ కు ముందు చదవాలి.
అస్ర్ నమాజ్ యొక్క నాఫెలహ్ నమాజ్: 8 రక్అతుల నమాజ్, ఇవి నమాజె అస్ర్ కు ముందు చదవాలి.
మగ్రిబ్ నమాజ్ యొక్క నాఫెలహ్ నమాజ్: 4 రక్అతుల నమాజ్, ఇవి నమాజె మగ్రిబ్ తరువాత చదవాలి.
ఇషాఁ నమాజ్ యొక్క నాఫెలహ్ నమాజ్: 2 రక్అతుల నమాజ్ కూర్చొని నమాజె ఇషాఁ తరువాత చదవాలి. ఇది ఒక రక్అత్ గా లెక్కించబడుతుంది.
నమాజె షబ్(తహజ్జుద్ నమాజ్): 11 రక్అతులు. (8 రక్అత్లు నమాజె షబ్, 2 రక్అత్లు నమాజె షఫ్ మరియు ఒక రక్అత్ నమాజె విత్ర్ మొత్తం 11 రక్అత్లు) ఈ నమాజ్ అర్థరాత్రి తరువాత నుంచి ఫజ్ర్ నమాజ్ అజాన్ వరకు చదవవచ్చు.
ఫజ్ర్ నమాజ్ యొక్క నాఫెలహ్ నమాజ్: 2 రక్అతుల నమాజ్, ఇవి నమాజె ఫజ్ర్ కు ముందు చదవాలి.[3]
నవాఫిల్ నమాజ్ యొక్క ప్రాధాన్యత:
ఇస్లాం బోధనలనుసారం నవాఫిల్ కు చాలా ప్రాముఖ్యత ఉంది. వీటి ప్రముఖ్యతను వివరిస్తూ చాలా రివాయతులు ఉల్లేఖించబడి ఉన్నాయి. ఉమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ఉల్లేఖించారు: “నిర్లక్ష్యం మరియు సోమరితనం మీ నుంచి దూరం అవుగాక! నిస్సందేహంగా మీ ప్రభువు అనంతకరుణామయుడు. చిన్న విషయానికి కూడా కృతజ్ఞత తెలుపుతాడు(స్వీకరిస్తాడు మరియు దాని ప్రతిఫలాన్ని ప్రసాదిస్తాడు). ఒకవ్యక్తి అల్లాహ్ ప్రసన్నత కోసం రెండు రక్అత్లు ముస్తహబ్ నమాజును నిర్వర్తిస్తాడు ఆ వ్యక్తి చదివిన ఆ రెండు రక్అత్ల నమాజ్ కారణంగానే అతడిని స్వర్గంలో ప్రవేశించడానికి అనుమతి ఇస్తాడు”[4]
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: “నిస్సందేహంగా నా దాసుడు నాఫెలా మరియు ముస్తహబ్ కార్యములు నా సామిప్యం కోసం నేను అతడిని ఇష్టపడాలనే ఉద్దేశంతో నిర్వర్తిస్తే నేను అతడిని ఇష్టపడడం మొదలు పెడితే నేను అతడు వినే చెవులనువుతాను, నేను అతడు చూసే కళ్లనవుతాను, నేను అతడు మాట్లాడే నోరునౌతాను...”[5]
రిఫరెన్స్
1. అల్ మున్జిద్, భాగం2, పేజీ1986
2. ముస్తలెహాతుల్ ఫిఖ్, మిష్కీనీ, అలీ, పేజీ528
3. తౌజీహుల్ మసాయిల్, ఆయతుల్లాహ్ ఖుమైనీ(ర.అ), భాగం1, పేజీ425, మస్అలహ్746
4. వసాయిల్ అల్ షియా, హుర్రె ఆములి, భాగం4, పేజీ44
5. ఉసూలె కాఫీ, భాగం4, పేజీ53.
వ్యాఖ్యానించండి