“షైతాన్” మరియు “ఇబ్లీస్”లు ఎవరు, వారి మధ్య గల తేడా ఏమిటి అనే విషయాల పై ఖుర్ఆన్ నిదర్శనం...
ఖుర్ఆన్ మరియు హదీస్ పరిభాషలో “షైతాన్” మరియు “ఇబ్లీస్” మధ్య తేడ ఉంది. ఖుర్ఆన్ ఆయతుల ప్రకారం ఇబ్లీస్ అంటే అల్లాహ్ హజ్రత్ ఆదమ్(అ.స) ను సజ్దహ్ చేయమని ఆదేశించినప్పుడు,[1] వ్యతిరేకించిన ప్రత్యేక షైతాన్ పేరు; కాని షైతాన్ అనే పదం ఒక సర్వమైన పదం అందులో ఇబ్లీస్ మరియు ఇతర షైతాన్ ల కోసం ఉపయోగించే పదం. ఆ షైతానులు జిన్నాతుల నుండి కానివ్వండి లేదా మనుషుల నుండి కానివ్వండి.
షైతాన్ పదం ఖుర్ఆన్ లో నాలుగు విధాలుగా ఉపయోగించబడింది:
1. ఇబ్లీస్
ఒక్కోసారి షైతాన్ అనగా ఇబ్లీస్ అని అర్థం, ఉదా: “షైతాను, పరస్పరం వారిరువురికి కనబడకుండా ఉన్న వారి మర్మ స్థానాలను వారి ముందు బహిర్గతం చేసే ఉద్దేశంతో వారిద్దరి అంతర్యాలలో దుష్ప్రేరణను రేకెత్తించాడు”.[సూరయె అఅరాఫ్, ఆయత్20]
2. జిన్నాతులకు చెందిన షైతాన్
ఒక్కోసారి షైతాన్ అనగా, ఇబ్లీస్ మరియు జిన్నాతులకు చెందిన ఇతర షైతానులు అని అర్థం, ఉదా: “నిశ్చయంగా మేము (భూమికి) సమీపంతో ఉన్న ఆకాశాన్ని దీపాలతో (నక్షత్రాలతో) ముస్తాబు చేశాము. ఇంకా వాటిని (ఆ దీపాలను) షైతానులను తరిమికొట్టే సాధనాలుగా చేశాము. షైతానుల కొరకైతే మేము మండే నరకాగ్ని శిక్షను కూడా సిద్ధపరచి ఉంచాము”.[సూరయె ముల్క్, ఆయత్05].
ఈ ఆయత్ లో “షైయాతీన్” అనగా జిన్నాతులకు చెందిన షైతానులు.
3. మానవులకు చెందిన షైతాన్
కొన్ని ఆయతలులో షైతాన్ పదం కేవలం మానవులలో ఉండే షైతానుల కోసం ఉపయోగించబడింది, ఉదా” విశ్వాసులను కులుసుకున్నప్పుడు వారు, “మేమూ విశ్వసించిన వారమే” అని అంటారు. కాని తమ షైతనుల (అంటే తమ పెద్దల లేక సర్దారుల) వద్దకు పోయినప్పుడు, “మేము మీతోనే ఉన్నామండీ. కాకపోతే వాళ్ళతో పరహాసమాడుతున్నామంతే” అని పలుకుతారు.[సూరయె బఖరహ్, ఆయత్14].
ఈ ఆయత్ లో “షైయాతీన్” అనగా మానవులకు చెందిన షైతానులు లేదా ఇస్లాం మొదట్లో ఉండే కపటవర్తనుల మిత్రులు.
4. జిన్నాతులు మరియు మానవులు కు సంబంధించిన షైతాన్
కొన్ని ఆయతులలో జిన్నాతులు మరియు మానవులు కు సంబంధించిన షైతాన్ ను ఉద్దేశించబడింది. ఉదా; దైవప్రవక్తల శత్రువులను జిన్నాతులు మరియు మానవులు కు సంబంధించిన షైతానులుగా పరిచయించబడింది:
ఆయత్: “ఇదే విధంగా మేము ప్రతి ప్రవక్తకూ జిన్నులలోని షైతానులను, మనుషులలోని షైతానులను శత్రువులుగా చేశాము. వారిలో కొందరు మరి కొందరిని మోసంపుచ్చటానికి ముచ్చట గొలిపే మాటలతో ప్రేరేపిస్తుంటారు. నీ ప్రభువే గనక తలచుకుంటే వారెన్నటికీ అలా చేయలేరు. కాబట్టి వాళ్ళను, వారి కల్పనలను వదలివెయ్యి.[సూరయె అనఆమ్, ఆయత్112].
రిఫరెన్స్
1. హజ్రత్ ఆదమ్[అ.స], మట్టితో సృష్టించబడ్డ మొదటి మనిషి. మేమందరం వారి సంతానం. ఖుర్ఆన్ ఇలా ప్రవచిస్తుంది: “మానవులారా! మిమ్మల్ని ఒకే ప్రాణి నుంచి పుట్టించి, దాన్నుంచే దాని జతను కూడా సృష్టించి, ఆ ఇద్దరి ద్వారా ఎంతో మంది పురుషులను, స్త్రీలను వ్యాపింపజేసిన మీ ప్రభువుకు భయపడండి”.[నిసా,1]
అంతేకాదు హజ్రత్ ఆదమ్[అ.స], అల్లహ్ యొక్క మొట్టమొదటి ప్రవక్త కూడానూ. ఖుర్ఆన్లో “ఆదమ్” అన్న పదం 15 సార్లు మరియు “బనీ” అన్న పదంతో అనగ “బనీ ఆదమ్” అని 7 సార్లు “ఇబ్నై ఆదమ్” “జుర్రియతు ఆదమ్” “కమసలి ఆదమ్” ఇవన్ని ఒక్కొక్క సారి ఉపయోగించబడ్డాయి. అల్లాహ్ హజ్రత్ ఆదమ్[అ.స]కు సృష్టించాలనుకున్నప్పుడు దూతలతో ఇలా అన్నాడు: “నేను భువిలో ప్రతినిధిని చేయబోతున్నాను” అప్పుడు ఆ దూతలు ఇలా అన్నారు: “భూమిలో కల్లోలాన్ని రేకెత్తించి, రక్తం ప్రవహింపజేసేవాణ్ణి ఎందుకు సృష్టిస్తావు! నిన్ను స్తుతించటానికి, ప్రశంసించటానికి, నీ పవిత్రతను కొనియాడటానికి మేమున్నాము కదా!” దానికి అల్లాహ్ “నాకు తెలిసునవన్నీ మీకు తెలియవు” అని అన్నాడు.[సూరయె బఖరహ్, ఆయత్30]. దూతలు తమ అశక్తత మరియు అసహాయతను అల్లాహ్ సన్నిధిలో ఇలా వెల్లడించుకున్నారు: “(ఓ అల్లాహ్!) నీవు అత్యంత పవిత్రుడవు. నీవు మాకు తెలియజేసినది తప్ప ఇంకేమీ మాకు తెలియదు. నిశ్చయంగా అన్నీ తెలిసినవాడవు, వివేకవంతుడవూ నీవే![సూరయె బఖరహ్, ఆయత్32].
వ్యాఖ్యానించండి