.వివిధ వర్గాల ఇమాములు ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] యొక్క జ్ఞాన ప్రతిష్టత గురించి చెప్పిన మాటలు.
ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] యొక్క జ్ఞాన ప్రతిష్టత గురించి చరిత్ర పుస్తకాలు సాక్ష్యాలతో నిండి ఉన్నాయి. ఇలా అని షియా మరియు అహ్లె సున్నత్ విద్వాంసులందరు అంగీకరిస్తారు. వారి జ్ఞానం ముందు పెద్ద పెద్దలు తల వంచారు మరియు ప్రశంసలు చేశారు.
హనఫీయుల ఇమామ్, అబూహనీఫా ఇలా అనెను: “నేను జాఫర్ ఇబ్నె ముహమ్మద్ కు మించిన జ్ఞానిని చూడలేదు”.
మాలికీయుల ఇమామ్, మాలిక్ ఇలా అనెను: “చాలా కాలం వరకు జాఫర్ ఇబ్నె ముహమ్మద్ వద్దకు వస్తూవెళ్తూ ఉండేవాడిని, వారిని నిరంతరం ఈ మూడు స్థితిలో ఏదో ఒక స్థితిలో చూసే వాడిని; నమాజ్ చదువుతూ ఉండేవారు, లేదా ఉపవాసం ఉండేవారు లేదా ఖుర్ఆన్ పఠిస్తూ ఉండేవారు. వారిని ఎప్పుడు కూడా ఉజూ లేకుండా హదీస్ ను చెప్పినట్టు చూడలేదు”.
వివిధ వర్గాల పెద్ద పెద్ద ఇమాములు మరియు జ్ఞానలు ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] నుండే హదీసులను ఉల్లేఖించేవారు. ఉదాహరణకు “యహ్యా ఇబ్నె సయీద్”, “ఇబ్నె జురైహ్”, “మాలిక్”, “సుఫ్యాన్ ఇబ్నె ఉయైయ్నె”, “అబూ హనీఫా”, “షుఅబహ్” మరియు “అయ్యూబె సజిస్తానీ” వీరందరూ వారి నుండి హదీసులను ఉల్లేఖించేవారు.[సీమాయే పీష్వాయాన్, పేజీ96]
రిఫ్రెన్స్
సీమాయే పీష్వాయాన్, మహ్దీ పీష్వాయి, దారుల్ ఇల్మ్, 1388.
వ్యాఖ్యానించండి