దహ్ఉల్ అర్జ్ యొక్క అర్ధం మరియు ఈ సంఘటన పై ఖుర్ఆన్ మరియు హదీస్ నిదర్శనలు...
బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీమ్
నిస్సందేహముగా వస్తువుల యదార్థాలు తెలుసుకుంటే, అవే మనకు అల్లాహ్ యొక్క ఆదేశాలు తెలుసుకోవడానికి కారణం అవుతాయి. అందుకనే “దహ్ఉల్ అర్జ్” యొక్క అర్థం తెలుసుకోవడం అవసరం అని భావించి ఇక్కడ ఇస్లామీయ నిఘంటుకారులు ఆ పదానికి ఎలా వివరించారో తెలుకుందా. చాలా అర్ధాలు ఉల్లేఖించబడి ఉన్నాయి కాని ఇక్కడ సంక్షిప్తంగా చెప్పడం జరిగింది.
“జౌహరీ” “దహూ” అనగా “వ్యాపించడం”, మరియు “దొర్లించడం”[1] అనీ, కొందరు కొందరు “పెంచడం” అని అన్నారు[2]. మరి “రాగిబె ఇస్ఫెహానీ” “ఒక ప్రదేశం నుండి తీయడం(పీకడం)” అని అంటారు[3]. ఇస్లామీయ ఉలమాల అభిప్రాయం ప్రకారం, ఒకవేళ «دحی» ను «دحو» అన్న పదం నుండి తీసుకున్నట్లైతే దాని అర్ధం “గట్టిగా విసరడం” అని. అంటే సృష్టి మొదటి దశలో భూమి తన మూలం నుండి విడదీయబడడాన్ని సూచిస్తుంది[4]. వీటన్నింటిని కలిపి ఒక మాటలో చెప్పాలంటే “దహ్ఉల్ అర్జ్” అనగా “భూమి విస్తరణ”[5].
కరుణామయుడైన అల్లాహ్ “జిల్ ఖఅదహ్” మాసం యొక్క 25 తారీఖున “కాబహ్” నేలను విస్తరించాడు. భూమి అల్లాహ్ యొక్క పవిత్ర గృహం యొక్క కారుణ్యం ద్వార ప్రాణం పొందడానికి, దానిని భూమి పొరలలో ఉంచాడు. ఆరు రోజుల తరువాత అల్లాహ్ శక్తి యొక్క కాంతి భూమి పై పడింది, మెల్లమెల్లగా నేల వ్యాపించడం మొదలయ్యి తన అస్తిత్వాన్ని అల్లాహ్ ఆజ్ఞలో చాటుకుంది. “దహ్ఉల్ అర్జ్” నాడు సృష్టితాలు కరుణామయుడైన అల్లాహ్ యొక్క స్తుతి మరియు ప్రార్థనలలో లీనమయ్యేందుకు మరియు హజ్రత్ ఆదమ్(అ.స) సంతానం వినయవిధేయతలతో మట్టి పై సాష్టాంగం చేసేందుకు, భూమి అల్లాహ్ ఆజ్ఞతో సుఖశాంతుల ఒడిగా నిర్ధారించబడింది. నిస్సందేహముగా విశ్వాసుల నాయకుడు, దైవప్రవక్త(స.అ) యొక్క అసలైన ఉత్తరాధికారి యొక్క జన్మస్థలం, హజ్రత్ ఆదమ్(స.అ)కు శరణాలయంగా నిలిచిన నిలయం, హజ్రత్ ఇబ్రాహీమ్(అ.స) ద్వార నిర్మించబడి మరియు కాబాలో జన్మించిన ఆ పవిత్రుని కుమారుడు తన అదృశకాలాన్ని పూర్తి చేసుకొని వచ్చే నేల నుండే భూమి సృష్టించబడింది.
దహ్ఉల్ అర్జ్ ఖుర్ఆన్ దృష్టిలో
అల్లాహ్ “దహ్ఉల్ అర్జ్” గురించి పవిత్ర గ్రంథమైన ఖుర్ఆన్ లో వివరించెను: “తరువాత భూమిని విస్తరించాడు”[సూరయె నాజిఆత్, ఆయత్30]. ఈ ఆయత్ ను అల్లామా తబతబాయి(ర.అ) ఇలా వ్యాఖ్యానించారు: ఈ ఆయత్ యొక్క అర్ధం; ఆకాశాన్ని పైకప్పుగా చేసిన తరువాత, ప్రతీ చిన్నదానిని తమతమ స్థానంలో నిర్ధారించిన తరువాత, దాని రాత్రిని చీకటిగా మరియు పగలును వెలుతురుగా నిశ్చయించిన తరువాత భూమిని విస్తరించాడు, అని.[6].
మరి కొందరు ఇలా వ్యాఖ్యానించారు: మరో ఆయత్ లో ఇలా ఉంది: “ఇంకా మేము భూమిని వ్యాపించాము(విస్తరించాము), దానిపై పర్వాతాలను పాతి పెట్టాము”[సూరయె హిజ్ర్, ఆయత్19]. ఈ ఆయత్ లో వచ్చిన «مد» పదం నుండి కూడా వ్యాపించడం, విస్తరించడం, లాగటం అనే అర్ధాలే వస్తాయి అని ఉలమాలు చెబుతున్నారు.
దహ్ఉల్ అర్జ్ ప్రతిష్టత పై హదీస్ నిదర్శనం
“దహ్ఉల్ అర్జ్” అనగా జిల్ ఖఅదహ్ మాసం యొక్క 25వ తేది. ఆ రోజు అల్లాహ్ భూమిని విస్తరించాడు. ఈ రోజు ప్రతిష్టత గురించి మన పవిత్ర మాసూములు వివరించారు. అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) ఉల్లేఖనం: “నింగి నుండి మొట్టమొదటి దయానుగ్రహం అవతరించబడిన రోజు జిల్ ఖఅదహ్ యొక్క 25వ తేది; అందుకని ఎవరైతే ఆ రోజు ఉపవాసం ఉంటారో మరియు ఆ రాత్రి ప్రార్థనలు చేస్తారో, వారికి వందేళ ప్రార్ధన పుణ్యం కలదు”
మరి అలాగే మరోచోట వారు ఇలా సెలవిచ్చారు: “ఆ రోజు, ఒక సమూహం అల్లాహ్ ను స్మరిస్తే, ఆ సమూహ సభ్యులు వేరుకాక ముందే అల్లాహ్ వారి కోరికలను మన్నిస్తాడు; అల్లాహ్ ఈ రోజున వేల సంఖ్యలో దయానుగ్రహాలను అవతరింపజేస్తాడు, కలిసికట్టుగా అల్లాహ్ ను స్మరించే, ఉపవాసం ఉండేవారు మరియు రాత్రి ప్రార్ధనలు నిర్వర్తించే వారు ఆ దయానుగ్రహాల భాగ్యాన్ని పొందుతారు”[7].
రిఫ్రెన్స్
1. ఇబ్నె సీనా, షిఫా, తస్హీహె అల్లామా హసన్ జాదె ఆములి, అల్ తబవుర్రిహలీ, బీ.తా.
2. ఇబ్నె మన్జూర్, లిసానుల్ అరబ్, చాప్3, దారె సాదిర్, బీరూత్, 1414 హిజ్రీ.
3. బాబాయి, బర్ గుజీదె తఫ్సీరె నమూనహ్, చాప్13, దారుల్ కుతుబిల్ ఇస్లామియ్యహ్, తెహ్రాన్, 1382 షంమ్సీ.
4. అల్ జుర్జానీ, కితాబుత్తారీఫాత్, నాసిర్ ఖుస్రో, తెహ్రాన్, బీ.తా.
5. హసన్ జాదెహ్ ఆములీ, దురూసె హైఅత్ వ దీగర్ రిష్తెహాయే రియాజీ, భాగం2, చాప్3, బూస్తానె కితాబ్, ఖుమ్, 1386.
6. అల్లామా తబాతబాయి, తర్జుమా అల్ మీజాన్, భాగం20, పేజీ308.
7. మకారిమ్ షీరాజీ, కుల్లియాతె మఫాతీహె నవీన్, పేజీ831, మద్రసతుల్ ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్ అలైహిస్సలామ్, ఖుమ్, ఇరాన్, 1390.
వ్యాఖ్యానించండి