హిజ్రీ యొక్క 10వ సంవత్సరంలో దైవప్రవక్త(స.అ) నిర్వర్తించిన అంతిమ హజ్ యాత్ర గురించి సంక్షిప్త వివరణ...

దైవప్రవక్త(స.అ) అంతిమ హజ్ యాత్రకు బయలుదేరాలనుకుంటున్నప్పుడు, ప్రజలందరికీ హజ్ కు రమ్మని కోరారు, ఈ ప్రకటన దూర ప్రదేశాలలో ఉన్న వారి వరకు చేరింది, మదీనహ్ చుట్టుప్రక్కలు ఉన్న ప్రజలు పెద్ద సంఖ్యలో మదీనహ్ కు వచ్చి వారు కూడా దైవప్రవక్త(స.అ)తో పాటు హజ్ కు వెళ్లేందుకు తమ సమ్మతాన్ని వెల్లడించారు, దైవప్రవక్త(స.అ) హిజ్రీ యొక్క 10వ సంవత్సరం జీఖఅదహ్ నెల 25వ తేదీన మదీనహ్ నుండి మక్కా కోసం బయలు దేరారు. హజ్రత్ అలీ(అ.స) కు యమన్ నుండి మక్కాకు హజ్ కోసం రమ్మని కోరారు. ఖుర్బానీ కోసం ఒంటెలను తీసుకొని మక్కా వైపుకు బయలుదేరారు; మస్జిదె షజరహ్ లో ఇహ్రామ్ ధరించారు, ప్రజలు కూడా వారిని అనుచరిస్తూ ఇహ్రామ్ ను ధరించారు. బైదా (మస్జిదె షజరహ్ నుండి రెండు కిలో మీటర్ల దూరంలో ఉన్న) ప్రదేశం నుండి కరాఉల్ గమీమ్ వరకు లబ్బైక్ చెబుతూ వెళ్లారు, ప్రజలలో కొందరి వద్ద సవారీలు ఉన్నాయి మరి కొందరు నడుస్తూ వస్తున్నారు, కాలినడకతో వస్తున్న వారిలో కొందరికి చాలా కష్టంగా ఉండడం గురించి దైవప్రవక్త(స.అ) కు తెలిసింది, దైవప్రవక్త(స.అ) సవారీలు దొరకడం కష్టం అందుకని హర్వలహ్(మామూలుగా నడవడం మరియు పరుగుకు మధ్య స్థిలో నడవడం) రూపంలో నడవండి అని ఆదేశించారు.
మరోవైపు, అలీ(అ.స) తనతో ఉన్న సైన్యాన్ని తీసుకొని యమన్ నుండి మక్కాకు బయలుదేరారు. మక్కా సమీపంలో దైవప్రవక్త(స.అ)తో కలిశారు. వారి దైవప్రవక్త(స.అ)కు జరిగిన సంఘటనల సమాచారాన్ని ఇచ్చారు. దైవప్రవక్త(స.అ) అలీ(అ.స) ని చూసి వారి సమాచారాన్ని విని చాలా సంతోషించి వారిని “అలీ! ఎహ్రామ్ ను ఏ నియ్యత్ తో ధరించావు? అని ప్రశ్నించారు. ఓ దైవప్రవక్త(స.అ) మీరు ఏ నియ్యత్ చేయాలో వ్రాయలేదు మరో దారి లేక నేను మీరు చేసిన నియ్యత్ తో నియ్యత్ చేస్తూ ఇలా అన్నాను: “ఓ అల్లాహ్ నా ఎహ్రామ్ ను నీ ప్రవక్త నియ్యత్ మాధిరి చేస్తున్నా మరియు 34 ఒంటెలు ఖుర్బానీ కోసం తీసుకొచ్చాను” అప్పుడు దైవప్రవక్త(స.అ) ఇలా అన్నారు: “అల్లాహు అక్బర్” నేను 66 ఒంటెలు ఖుర్బానీ కోసం తీసుకొచ్చాను, నువ్వు హజ్ మరియు ఖుర్బానీలో నాతో పాటు ఉన్నావు, ఇక ఇప్పుడు ఈ ఎహ్రామ్ లోనే ఉండి నీ సైన్యాం వైపుకు తిరిగి వెళ్లారు. మక్కాలో దైవప్రవక్త(స.అ)తో కలిశారు.
అక్కడ దైవప్రవక్త(స.అ) హజ్ చర్యలు అమలు పరిచిన తరువాత అలీ(అ.స) ను తన ఖుర్బానీలో భాగస్వామిని చేశారు. తమతో పాటు వచ్చిన ప్రజలందరితో కలిసి మదీనహ్ కు తిరిగి వెళ్లడానికి బయలు దేరారు.[1]
రిఫరెన్స్
1. షేఖ్ ముఫీద్(ర.అ), అల్ ఇర్షాద్, భాగం1, పేజీ171-179, కొంగురయె షేఖ్ ముఫీద్, ఖుమ్, 1413ఖ.
https://www.islamquest.net/fa/archive/fa24655
వ్యాఖ్యానించండి