హజ్రత్ అలీ(అ.స) యే నాయకత్వానికి అర్హులు

సోమ, 09/20/2021 - 15:52

హజ్రత్ అలీ(అ.స) యే దైవప్రవక్త(స.అ) తరువాత నాయకత్వం మరియు ఖిలాఫత్ కు అర్హులు అని నిదర్శించే ఖుర్ఆన్ ఆయతులు మరియు దైవప్రవక్త(స.అ) హదీసుల వివరణ...

హజ్రత్ అలీ(అ.స) యే నాయకత్వానికి అర్హులు

దైవప్రవక్త(స.అ) ఏ వ్యక్తి(అలీ(అ.స))ని అయితే తన ఖలీఫాగా నియమించారో ప్రజలు అతనినే ఖిలాఫత్ అధికారం నుండి దూరం చేశారు. దాంతో ఉమ్మత్ ఇమామ్ అలీ(అ.స) యొక్క తత్వజ్ఞాన నాయకత్వం మరియు వారి విజ్ఞానం నుంచి దూరమయ్యారు.
ఒకవేళ ముస్లిములు స్వమతపక్షపాతం మరియు ఉద్రేకాలను దూరంగా ఉంచి చూసినట్లైతే వాళ్ళకు దైవప్రవక్త(స.అ) తరువాత హజ్రత్ అలీ(అ.స) అందరి కన్న జ్ఞానులు అని తెలుస్తుంది. సహాబీయులలో జ్ఞానులు, కష్ట సమయాలలో హజ్రత్ అలీ(అ.స)నే ఆశ్రయించే వారు అని చరిత్రే సాక్షి. హజ్రత్ ఉమర్ తన జీవిత కాలంలో 70 సార్ల కన్న ఎక్కువే ఇలా అన్నారు: “لولا علی لهلک عمر; ఒకవేళ అలీ(అ.స)యే లేకుంటే ఉమర్ చచ్చుండేవాడు”[1] వాస్తవంగా చేప్పాలంటే స్వయంగా హజ్రత్ అలీ(అ.స) తన జీవితంలో ఎవ్వరిని ఏదీ అడగలేదు.
మరి అలాగే చరిత్ర ఇలా కూడా ఉల్లేఖిస్తుంది: హజ్రత్ అలీ(అ.స) సహాబీయులందరిలో అందరి కన్న ధైర్యశాలి మరియు వీరులు, సహాబీయులలో ఎవరినైతే వీరుడు అని అనుకునే వారో అతను కూడా చాలా యుద్ధాలలో యుద్ధభూమిని వదిలి పారిపోయారు కేవలం హజ్రత్ అలీ(అ.స) తప్ప. అతను ఏ ఒక్క యుద్ధం నుండి కూడా పారిపోలేదు. హజ్రత్ అలీ(అ.స) యొక్క ధైర్యసాహసాలకు దైవప్రవక్త(స.అ) ఖైబర్ యుద్ధ సందర్భంలో అతనిని ఉద్దేశించి చెప్పిన ఈ మాటలే అన్నీటి కన్న పెద్ద సాక్ష్యం; దైవప్రవక్త(స.అ) ఖైబర్ యుద్ధ సందర్భంలో ఇలా ప్రవచించారు: “రేపు నేను ఎవరికైతే ఇస్లాం ధ్వజం ఇస్తానో అతను అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ)ను ఇష్టపడేవాడై ఉంటాడు, అల్లాహ్ మరియు దైవప్రవక్త(స.అ) అతనిని ఇష్టపడేటువంటివాడై ఉంటాడు, శత్రువులను ఓడించేవాడై ఉంటాడు, యుధ్ద భూమిని వదిలి పారిపోయే వాడై ఉండడు, ఈమన్ ద్వార అల్లాహ్ అతడిని పరీక్షించినవాడై ఉంటాడు”[2] మరుసటిరోజు సహాబీయులందరు ఎగబడి ధ్వజం పొందాలనే ఆలోచనలో ఉన్నారు కాని దైవప్రవక్త(స.అ), హజ్రత్ అలీ(అ.స)కు ధ్వజాన్ని ఇచ్చారు.
సంక్షిప్తంగా చెప్పాలంటే హజ్రత్ అలీ(అ.స), అందరిలో కన్న జ్ఞానవంతులు, అందరి కన్న ధైర్యవంతులు, అందరి కన్న బలవంతులు అని సాధారణ వ్యక్తి నుండి ప్రముఖుల వరకు ప్రతీ ఒక్కరు నమ్ముతారు. అందులో కనీసం ఇద్దరు వ్యక్తులలో కూడా అభిప్రాయభేదం కనిపించదు. హజ్రత్ అలీ(అ.స) విలాయత్‌ని నిరూపించే నుసూస్ ఉదా: గదీర్ మొ॥ లాంటివి చూసీచూడనట్లు వదిలేసినా కూడా ఖుర్ఆన్ దృష్టిలో ఇమామత్ మరియు నాయకత్యానికి జ్ఞాని, దైర్యశాలి, బలమైన వ్యక్తి అయ్యి ఉండాలి.

అందుకే ఖుర్ఆన్ ఉలమాల ఆచరణ విషయంలో ఇలా ప్రవచించింది: “అలాంటప్పుడు మీరే చెప్పండి, సత్యం వైపునకు మార్గం చూపేవాడా విధేయతకు ఎక్కువ అర్హుడు? లేక తనకు ఎవడైనా మార్గం చూపితే తప్ప స్వయంగా మార్గాన్ని పొంద లేనివాడా? అసలు మీకేమయింది, ఇటువంటి తలకిందుల నిర్ణయాలు చేస్తున్నారు?”[యూనుస్ సూరా:10, ఆయత్:35]
జ్ఞాని, దైర్యశాలి మరియు బలవంతుడు అయ్యి ఉండడం నాయకత్వానికి అవసరం అనే విషయం పట్ల ఖుర్ఆన్ ఇలా ప్రవచిస్తుంది: “...వారు ఇలా అన్నారు: “మా పై రాజ్యం చేసే హక్కు అతనికెలా సంక్రమిస్తుంది? రాజ్యం చేసే హక్కూ, అర్హతలూ అతనికంటే మాకే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే, అతడు శ్రీమంతుడు కాదు”. దానికి సమాధానంగా ప్రవక్త వారితో ఇలా అన్నారు: “మీకు బదులుగా అల్లాహ్ అతనినే ఎన్నిక చేశాడు”. అల్లాహ్ అతనికి బుద్ధిబలాన్నీ, కండబలాన్నీ సమృద్ధిగా ప్రసాదించాడు. తాను కోరిన వారికి తన రాజ్యం ప్రసాదించే అధికారం అల్లాహ్‌కు ఉంది. అల్లాహ్ అంతా వ్యాపించి ఉన్నాడు, సర్వమూ తెలిసినవాడు”[అల్ బఖర సూరా:2, ఆయత్:247]

అల్లాహ్, సహాబీయులందరిలో హజ్రత్ అలీ(అ.స)కే ఎక్కువ జ్ఞానాన్ని ప్రసాదించాడు, అందుకే దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించారు: “అలీ(అ.స) విజ్ఞాన పట్టణానికి ద్వారం” మరియు దైవప్రవక్త(స.అ) మరణాంతరం సహాబీయులు ఆశ్రయించే ఒకగానొక వ్యక్తి వారే. ఎప్పుడైన సహాబీయులకు ఏదైన కష్టం వస్తే హజ్రత్ అలీ(అ.స)నే ఆశ్రయించి ఇలా అనే వారు: “معضله ليس لها الا ابوالحسن” అనువాదం: “ప్రతీ కష్టాన్ని అబుల్ హసన్(హజ్రత్ అలీ(అ.స))యే దూరం చేయ గలరు”[3]. మీరు అతనిని శారీరకంగా చూసినట్లైతే సరైన అర్ధంలో అతనే అసదుల్లాహిల్ గాలిబ్[4], అతని వీరత్వం మరియు ధైర్యం తరతరాలకు లోకహితోక్తి అయ్యింది. చరిత్రకారులు వ్రాసిన అతని ధైర్యసాహసముల సంఘటనాలు అయితే అద్భుతకృత్యాల కన్న తక్కువేమి కావు. ఉదా: ఇరవై మంది సహాబీయులు కలిసి కూడా కదపలేని ఖైబర్ ద్వారాన్ని పెకలించడం.[5] అందరి కన్న పెద్ద విగ్రహాన్ని(హబల్) కాబా పైనుండి పడగొట్టడం.[6] సైన్యమంతా కలిసి కూడా కదపలేని అతిపెద్ద శిలను తొలగించడం.[7] ఇవే కాకుండా ఇంకా చాలా ప్రసిధ్ధ సంఘటనాలు ఉన్నాయి.

రిఫరెన్స్
1. మనాఖిబె ఖారజ్మి, పేజీ48. అల్ ఇస్తీఆబ్, భాగం3, పేజీ39. తజ్కిరతుల్ బస్త్, పేజీ87. మతాలిబుల్ సుఆల్, పేజీ13. తఫ్సీరె నైషాపూరీ, ఫైజుల్ ఖదీర్, భాగం4, పేజీ357.
2. సహీ బుఖారీ, భాగం5, పేజీ12 మరియు భాగం5, పేజీ77. సహీ ముస్లిం, భాగం7, పేజీ121, బాబొ ఫజాయిలు అలీ ఇబ్నె అబీతాలిబ్.
3. మనాఖిబె ఖారజ్మీ, పేజీ58. తజ్కిరతుల్ బస్త్, పేజీ87. ఇబ్నుల్ మగాజిలి అనువాదం అలీ, పేజీ79.
4. ఇమామ్ అలీ(అ.స)  యొక్క బిరుదు. అసదుల్లాహిల్ గాలిబ్ అనగా అందరిపై ఎల్లప్పుడూ జయించే అల్లాహ్ యొక్క సింహం.
5, 6, 7. షర్హె నెహ్జుల్ బలాగహ్ ఇబ్నె అబిల్ హదీద్ యొక్క ముందుమాటలో.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 0 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 9