ఇస్లాం దృష్టిలో ఉత్తమ వివాహం అంటే ఏమి అన్న విషయం పై దైవప్రవక్త(స.అ) హదీస్ నిదర్శనం...

దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం
సాధారణ వివాహం, ఉత్తమ వివాహం.[1]
ఇమామ్ రిజా(అ.స) హదీస్ లో హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) మెహ్ర్ ను 500 దిర్హమ్(వెండి నాణాలు) కు సమానమైనది అని ఉంది.[2] ఇమామ్ అలీ(అ.స) కూడా తన మహ్ర్ కోసం తన వద్ద ఉన్న వస్తువును అమ్మి దాన్ని దైవప్రవక్త(స.అ)కు ఇచ్చారు. దైవప్రవక్త(స.అ) కూడా ఆ ఇచ్చిన సొమ్ము నుండి కొంత బిలాల్ కు ఇచ్చి ఇలా అన్నారు.. దీంతో నా కుమార్తె కోసం అత్తరు కొను. మిగిలింది అబూబక్ర్ కు ఇచ్చి ఇలా అన్నారు: ఈ డబ్బుతో నా కూతురికి అవసరమైన వాటిని సిద్ధం చేయి. అమ్మార్ మరియు సహాబీయుల నుండి కొంత మంది అబూబక్ర్ తో పాటు సామానులు కొనడానికి వెళ్లారు. హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) యొక్క జహేజ్ యొక్క లిష్టు: 7 దిర్హముల చొక్కా, 4 దిర్హముల స్కార్ఫ్, నల్ల రంగు ఖతీఫా(తువాలు లాంటిది), ఖర్జూరపు ఆకులతో అల్లిన పడక మంచం, రెండు దుప్పట్లు అందులో ఒకటి ఖర్జూరపు ఆకులతో మరొకటి గొర్రెల ఉన్నితో నింపబడినవి, నాలుగు దిండులు, ఉన్ని పరదాలు, ఒక చాప, ఒక రోకలి, ఒక రాగి బేసన్, చెక్క కప్పు, పాలు పితకడానికి ఒక గిన్నె, నీళ్ల కూజా, ఒక చెంబు, ఒక పెద్ద కుండ మరియు కొన్ని మట్టి కుండలు[3] పనికి రాని ఏ వస్తువూ వీటిలో లేదు అని తెలుస్తుంది.
రిఫరెన్స్
1. నెహ్జుల్ ఫసాహహ్, హదీస్1507.
2. అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం93, పేజీ170, రివాయత్10.
3. షహీదీ, జిందగానీయె ఫాతెమా జహ్రా, పజీ58-59.
వ్యాఖ్యలు
Mashallah Mashallah Jazakallah
వ్యాఖ్యానించండి