ప్రతీ ఒక్కరు పెళ్లి కోసం జోడీదారుని ఎన్నిక విషయంలో చాలా జాగ్రత్త వహించాలి, ముఖ్యంగా ఆడకూతురి విషయంలో.....
వివాహం కోసం జోడీదారుని ఎన్నిక విషయంలో సాధారణంగా జనం దృష్టి డబ్బూ, అందం, వంశం మరియు పరపతీ వంటి వాటి పై ఉంటుంది. కాని హదీసులలో దీనికి వ్యతిరేకంగా చెప్పబడి ఉంది.
1. జోడీదారుని ఎన్నిక విషయంలో మన దృష్టి వారి విశ్వాసాలపై ఉండాలి.[కన్జుల్ ఉమ్మాల్, హదీస్46602]
2. అందం నాశనానికి కారణం మరియు డబ్బు అవిధేయతకు కారణం.[మీజానుల్ హిక్మహ్]
3. మీ కూతురి కోసం పెళ్లి సంబంధం వస్తే, అతడి ధర్మం మరియు న్యాయవర్తతనం మీకు నచ్చితే, ఆ సంబంధాన్ని రద్దు చేయకండి లేకపోతే అతిపెద్ద నాశనానికి గురి అవుతారు.[బిహారుల్ అన్వార్, భఆగం103, పేజీ372]
4. ధర్మనిష్ట కలిగి ఉన్నవాడిని అల్లుడిగా ఎన్నుకో ఎందుకంటే నీ కూతురిని ఇష్టపడితే ఆమెను గౌరవిస్తాడు, ఒకవేళ ఇష్టపడకపోతే అతడిలో ఉన్న ధర్మనిష్ట వల్ల ఆమెకు అన్యాయం చేయడు.[మకారిముల్ అఖ్లాఖ్, భాగం1, పేజీ446]
5. త్రాగుబోతులకు, చెడు స్వభావం మరియు వక్రఆలోచన కలిగి ఉన్న మరియు చెడు కుటుంబంలో పెరిగిన వారి ఇంట వివాహం చేయకండి.[మీజానుల్ హిక్మహ్]
రిఫ్రెన్స్
మొహ్సిన్ ఖిరాఅతీ, దఖాయికి బా ఖుర్ఆన్, ముఆవినతె ఫర్హనంగ్ వ ఇజ్తిమాయియే సాజ్మానె ఔఖాఫ్ వ ఉమూరె ఖైరియ్యహ్, 1392.
వ్యాఖ్యానించండి