హజ్రత్ అలీ(అ.స) మరియు హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) వివాహం గురించి సంక్షిప్త వివరణ...
ఒక కుటుంబం ఏర్పడాలంటే దానికి ముందు ఒక మంచి ఎన్నిక అవసరం. మంచి ఎన్నిక మరియు ఎదుటివారి అంగీకరణతో ఒక కుటుంబం ఏర్పడుతుంది. హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) కు చాలా సంబంధాలు వచ్చాయి, మంచి మంచి డబ్బున్నావాళ్లు, గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నవారు. వచ్చిన వాళ్లు మంచి ఇంటిలో అన్ని వసతులను ఆమెకు అనుకూలంగా ఉంచుతాము అని అన్నారు. అబూబక్ర్, ఉమర్ మరియు అబ్దర్రహ్మాన్ ఇబ్నె ఔఫ్ లు కూడా సంబంధం అడిగిన వాళ్లలో ఉన్నారు, కాని దైవప్రవక్త(స.అ) వాళ్లలో ఏ ఒక్కరికీ సమ్మతించలేదు. దైవప్రవక్త(స.అ) వాళ్లతో ఇలా అనేవారు: నా కుమార్తె వివాహం అల్లాహ్ చేతుల్లో ఉంది ఆయన ఆదేశం కొరకు వేచి ఉన్నాను.[1]
మరో వైపు హజ్రత్ ఇమామ్ అలీ(అ.స) మంచి సంబంధం కోసం వెతుకుతున్నారు, ఎవరితో పడితే వారితో రాజీ పడేవారు కాదు, అయితే వారు ఎక్కువ ధనం కూడా కలిగిలేరు. ముహాజిరీనులు హజ్రత్ జహ్రా(స.అ) యొక్క సంబంధం అడగడానికి వెళ్లమని సలహా ఇచ్చారు. కాని తన ధన స్థితిని చూసి వాళ్ల సలహాను అంగీకరించలేదు. ముహాజిరీనులు వారితో దైవప్రవక్త(స.అ) నీ నుండి ఏదీ కోరరు, అన్నారు. చివరికి హజ్రత్ అలీ(స.అ) దైవప్రవక్త(స.అ) వద్దకు వెళ్లారు కాని సిగ్గు వల్ల తన కోరికను చెప్పలేకపోయారు. అలా మూడవ సారికి వారు తన కోరికను చెప్పి, హజ్రత్ జహ్రా(స.అ) సంబంధాన్ని ఆమె తండ్రితో అడిగారు. దైవప్రవక్త(స.అ) వారితో ఇలా అడిగారు: నీ దగ్గర ఏదైనా ఉందా? అలీ(అ.స) దానికి ఇలా సమాధానమిచ్చారు: యా రసూలల్లాహ్ కవచం తప్ప మరేది లేదు. దైవప్రవక్త(స.అ), హజ్రత్ ఫాతెమా ను పన్నెండున్నర(12.50) బంగారపు నాణ్యాల మెహ్ర్ తో హజ్రత్ అలీ(అ.స)కు ఇచ్చి వివాహం చేశారు మరియు వారి కవచాన్ని తిరిగి ఇచ్చేశారు.[2] వారిద్దరి వివాహం పై దైవప్రవక్త(స.అ) అంగీకారం పై ముహాజిరీనులలో కొందరు నిరాశ చెందారు, పిర్యాదు చేశారు. దైవప్రవక్త(స.అ) వారికి ఇలా సమాధానమిచ్చారు.. ఫాతెమాను అలీకు నేనివ్వలేదు., అల్లాహ్ ఆమెను అలీకిచ్చాడు[3].
రిఫరెన్స్
1. అల్లామా ఖజ్వీనీ, ఫాతెమా జహ్రా అజ్ విలాదత్ తా షహాదత్, పేజీ191.
2. తారీఖె తహ్ఖీఖీ-ఎ-ఇస్లాం, మొహమ్మద్ యూసుఫీ గరవీ, భాగం2, పేజీ251.
3. తారీఖె యాఖూబీ, భాగం2, పేజీ41.
వ్యాఖ్యానించండి