మన్సూరె దవానెఖీ

శని, 06/24/2023 - 17:04

అబ్బాసీ ఖలీఫాలలో రెండవ ఖలీఫా అయిన మన్సూరె దవానఖీ యొక్క జీవిత చరిత్ర సంక్షిప్తంగా...

మన్సూరె దవానెఖీ

అబూజాఫర్ అబ్దుల్లాహ్ మన్సూర్ అనగా మన్సూరె దవానెఖీ. అధికార కాలం హిజ్రీ యొక్క 136 నుండి 158వ సంవత్సరం వరకు. ఇతడు అబ్బాసీ ఖలీఫాలలో రెండవ ఖలీఫా, అబ్దుల్ ముతల్లిబ్ యొక్క మనవళ్ల నుండి. తన ఖిలాఫత్ కాలంలో అబ్బాసీ మరియు అలవీ సమూహాలకు చెందిన వారి మధ్య కలహాలు రేపిన మొదటి వ్యక్తి ఇతడే. ఇతడి ఉత్తర్వుల వలనే హసనీ సయ్యదులు బంధించబడ్డారు. ఇతడు ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) కాలంలో ఖలీఫా పదవిలో ఉండేవాడు. ఇబ్నె షహ్రె ఆషూబ్ ఉల్లేఖనం ప్రకారం ఇమామ్ ను ఇతడే చంపించాడు. ఇతడు తన ఖిలాఫత్ కాలంలో ఎన్నో దాడులకు కారకుడు అందులో నఫ్సె జకియహ్ మరియు ఖతీల్ బా ఖుమ్రా విప్లవాలు కూడా ఉన్నాయి. బగ్దాద్ పట్టణ నిర్మాణం అతడి ఉత్తర్వులతో జరిగింది.

పూర్వీకులు మరియు జన్మం
అబ్దుల్లాహ్ ఇబ్నె మొహమ్మద్ ఇబ్నె అలీ ఇబ్నె అబ్దుల్లాహ్ ఇబ్నె అబ్బాస్ ఇబ్నె అబ్దుల్ ముతల్లిబ్ హిజ్రీ యొక్క 95వ సంవత్సరంలో హమీమహ్ లో జన్మించాడు. అతడి తల్లి బర్ బర్ జాతికి చెందిన ఒక దాసి, పేరు సలామహ్. అబూజాఫర్ అతడి కున్నియత్ మరియు మన్సూర్ అతడి బిరుదు.[1]

ఉత్తరాధికారి
అబ్బాసీయులు, ఖిలాఫత్ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం జరుగుతున్న ప్రయత్నాలలో ఇబ్రాహీమ్ ఇమామ్, మన్సూర్ కన్నా వయసులో చిన్నవాడు అయిన సఫ్పాస్ ను తన ఉత్తరాధికారిగా నియమించాడు., ఎందుకంటే మన్సూర్ తల్లి ఒక దాసి కాబట్టి[2] మన్సూర్ తన సోదరుడి ఖిలాఫత్ కాలంలో, జజీరహ్(ఉత్తర ఇరాఖ్), ఇర్మనిస్తాన్ మరియు ఆజర్ బాయిజాన్ యొక్క గవర్నర్ గా ఉండేవాడు[3].

ఖిలాఫత్
సఫాహ్ మరణించినప్పుడు మన్సూర్ హజ్ ప్రయాణంలో ఉన్నాడు. తన సోదరుడి మరణ వార్త విన్న తరువాత ఇరాఖ్ కు చేరుకున్నాడు ఎందుకంటే కొంత కాలం ముందే ఉత్తరాధికారిగా నియమించబడ్డాడు కాబట్టి. వచ్చి ఖిలాఫత్ అధికారాన్ని స్వీకరించాడు.[4]

ప్రత్యేకతలు
స్థాయి కోరిక

మన్సూర్ తనను చక్రవర్తిగా భావించేవాడు. అతడి నుండి ఇలా ఉల్లేఖించబడి ఉంది అతడు ఇలా అనేవాడు: ఖలీఫాలు నలుగురు: అబూబక్ర్, ఉమర్, ఉస్మాన్ మరియు అలీ; మరియు చక్రవర్తులు, నలుగురు.. ముఆవియహ్, అబ్దుల్ మలిక్ ఇబ్నె మర్వాన్, హిషామ్ ఇబ్నె అబ్దుల్ మలిక్ మరియు నేను.[5]

అతడు ఇలా అన్నాడు అని ఉల్లేఖించబడి ఉంది: “ఓ ప్రజలారా! నేను ఈ భూమి పై అల్లాహ్ యొక్క చక్రవర్తిని మరియు వారి ఆస్తుల రక్షకుడిని. ఆయన ఇచ్చానుసారం పంచుతాను మరియు ఆయన ఆజ్ఞతో ప్రసాదిస్తాను”[6]

పిసినారితనం
మన్సూర్ పీనాసి మరియు అల్పుడు. పనొళ్ల మరియు నిపుణుల నుండి చిన్న చిన్న రొక్కముల విషయంలో లెక్కలు అడిగే వాడు అందుకనే “దవానెఖీ” అని పిలవబడేవాడు.[7] దానఖ లేదా దాంగ్ అంటే ఒక దిర్హమ్ యొక్క 6వ భాగం) ఇలా ఉల్లేఖించబడి ఉంది అబ్దుల్ మలిక్ ఇబ్నె మర్వాన్ ఖలీఫాగా ఉన్నప్పుడు మస్జిదుల్ అఖ్సా ను నిర్మించినపుడు దాని తలుపులను వెండీ బంగారపు ప్లేట్లతో కప్పాడు, కాని మన్సూరె దవానెఖీ మస్దిద్ నిర్మాణం కోసం తలుపుల పైనున్న వెండీ బంగారాలను తీసి నాణ్యాలుగా మార్చాడు.[8].

సామాజిక రాజకీయం యొక్క రూపురేఖలు
మన్సూరె దవానెఖీ కాలంలో రాజకీయ మరియు సామాజిక రూపురేఖలు అరేబీయుల సంస్కృతి మరియు విజయం సాధించబడిన దేశాలు ఉదా; ఇరాన్ మరియు రోము సంస్కృతి ప్రభావితం అయి ఉండేవి. ఇరాన్ సంస్కృతి మరియు మూలాలు ఈ కాలంలో అధికారంలో ఉండేవి. రాజకీయం ఇరానీ ఆకారం దాల్చుకుంది. మన్సూర్ వివిధ విప్లవాలను తలవంచించి, తన అధికారాన్ని బలపరుచుకొని సాసానియులు(ఇరాన్ చక్రవర్తులు) మాధిరి సంపూర్ణ అధికారాన్ని చేతుల్లో తీసుకున్నాడు. చిన్న చిన్న రాజులు, మంత్రులు, న్యాయమూర్తులు, నాయకులు మొ... వారందరిని తన క్రింద తీసుకొని వారి పై అధికారం చేసేవాడు.[9]

ఇతడి కాలంలో సామాజిక రూపురేఖలు చాలా తేడాగా మారారి. ఇరానీ రాజకీయం వల్ల అరేబీయులు తమ దాసులను అల్పంగా చూడడం వల్ల షుఊబియహ్ విప్లవం ముందుకొచ్చింది. జాతియా రీతులు ఈ కాలంలో మరోసారి తలెత్తాయి, నౌరూజ్ పండగలు మరియు సంగీతకారులు లంటివి వచ్చాయి. మరెన్నో విషయాలు ఈ కాలంలో ప్రభావితం అయ్యాయి. వీటంన్నీటిని మన్సూర్ చాలా ప్రోత్సహించేవాడు.[10]

రిఫరెన్స్
1. జర్కలీ, అల్ అఅలామ్, భాగం4, పేజీ117.
2. ఇబ్నె సఅద్, అల్ తబఖాతుల్ కుబ్రా, భాగం5, పేజీ382.
3.4. తారీఖె యాఖూబీ, భాగం2, పేజీ358.
5.6. ఇబ్నె కసీర్, అల్ బిదాయతు వన్నిహాయహ్, భాగం10, పేజీ122.
7. దియారు అల్ బక్రీ, తారీఖుల్ ఖమీస్, భాగం2, పేజీ324.
8. హుమైదీ, తారీకె ఉరుషెలమ్, పేజీ183.
9. జైఫ్, తారీఖుల్ అదబ్ అల్ అరబీ(అల్ అస్రుల్ అబ్బాసిల్ అవ్వల్), పేజీ21.
10. ముఖాయిసయె జంబహాయె ముఖ్తలిపె అందర్జ్ నామె అర్ద్ షీర్ సాసానీ వ వస్సిత్ నామె మన్సూరె అబ్బాసీ, సుఖనె తారీఖ్, షుమారహ్21, సాలె నహుమె బహార్ వ తాబిస్తాన్1394, పేజీ120.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 6 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 16