షఖ్ఖుల్ ఖమర్ అద్భుత చర్య గురించి చెప్పబడిన వ్యాఖ్యాలు మరియు వాటి సమాధానాలు...

దైవప్రవక్త(స.అ) యొక్క అద్భుత చర్యలలో చంద్ర బింబాన్ని రెండు భాగాలుగా విడదీయం ఒకటి. సూరయె ఖమర్ యొక్క 1 నుండి 3వ ఆయత్ వరకు దీని గురించి వివరించబడి ఉంది. అల్లాహ్ ఇలా సూచించెను: ప్రళయ ఘడియ దగ్గరపడింది. చంద్రుడు చీలిపోయాడు. ఒకవేళ వీళ్లు ఏదైనా మహిమను చూసినా, దాన్నుండి ముఖం త్రిప్పుకుంటారు. “పూర్వం నుండీ జరుగుతూ వస్తున్న మాయా జాలమే కదా ఇది!” అనంటారు. వీళ్లు ధక్కరించారు. తమ మనోవాంఛల వెనుకపోయారు. అయితే ప్రతి విషయానికీ ఒక సమయం నిర్ధారితమై ఉంది.[సూరయె ఖమర్, ఆయత్1-3] ఇక్కడ ఈ ఆయత్ లో చెప్పబడిన విషయం దేనికి నిదర్శనం; ఈ అద్భుతం జరిగిపోయిందా? లేక ప్రళయకాలం ఆరంభ చిహ్నాలలో ఒకటిగా భవిష్యత్తులో ఈ అద్భత చర్య జరగనున్నదా?
ముస్లిములలో ముందు చెప్పబడిన మాట ప్రఖ్యాతి చెందినది; ఫఖ్రె రాజీ ఉల్లేఖనుసారం: ఖుర్ఆన్ వ్యాఖ్యులందరి విశ్వాసం చంద్రుడు (ఒక అద్భత చర్యగా) రెండు భాగాలుగా విడిపోయింది మరియు రివాయతులు ఈ సంఘటన జరిగింగి మరియు సహీ గ్రంథాలలో సహాబీయులు ఉల్లేఖించిన ప్రముఖ హదీసును చూడగలరు.[1]
మర్హూమ్ తబర్సీ కూడా తన గ్రంథం మజ్మఉల్ బయాన్ లో చంద్రుడు రెండు భాగాలుగా విడిపోయిన హదీస్ ను దైవప్రవక్త(స.అ) సహాబీయుల సంఖ్య మరియు ముఫస్సిరీనుల సమూహం నుండి చాలా మంది ఉల్లేఖించారు. ఈ విషయంలో కేవలం మూడు వ్యక్తులు(ఉస్మాన్ బిన్ అతా, హసన్ మరియు బల్ఖీ) మాత్రమే వ్యతిరేకించారు. ఆ తరువాత ఇలా చెప్పెను: “వారి మాటలు సరైనవి మరియు అంగీకరించలేనివి ఎందుకంటే ఈ విషయంలో ముస్లిముల ఇజ్మా మరియు ఐక్యత కలిగివున్నారు; అందుకని వ్యతిరేక మాటలకు పట్టించుకోడం అనవసరం.[2]
మరి కొంత మంది ముఫస్సిరీన్ లు కూడా తబర్సీ మరియు రాజీ వ్రాసినట్లే, రచించారు.
అంతేకాకుండా ఈ క్రింది ఆయతుల సందర్భాలను బట్టి కూడా మనం తెలుసుకోవచ్చు:
1. وَانْشَقَّ الْقَمَرُ ఈ వాక్యం భూతకాలానికి నిదర్శిస్తుంది ఇది ఈ సంఘటన జరిగిపోయింది అన్న విషయం పై సాక్ష్యం. అయితే భూతకాలం కోసం ఉపయోగించిన పదం భవిష్యత్తు అర్థం కోసం ఉపయోగించబడుతుంది మరి ఖుర్ఆన్ లో అలా ఉపయోగించబడింది కూడాను., కాని ఎక్కడ అయితే అలా ఉపయోగించబడిందో అక్కడ చేరువైన సందర్భాలు ఉంటాయి కాని ఇక్కడ ఎటువంటి చేరువైన సంబంధం(ఖరీనహ్) లేదు.
2. రెండవ ఆయత్ وَ اِنْ يَرَوْا آيَةً يُعْرِضُوا وَ يَقُولُوا سِحْرٌ مُّسْتَمِرٌّ (ఒకవేళ వీళ్లు ఏదైనా మహిమను చూసినా, దాన్నుండి ముఖం త్రిప్పుకుంటారు. “పూర్వం నుండీ జరుగుతూ వస్తున్న మాయా జాలమే కదా ఇది!” అనంటారు) ఈ ఆయత్ అత్యంత ముఖ్యమైన నిదర్శనం.
3. وَ كَذَّبُوا وَاتَّبَعُوا اَهْواءَهُمْ (వీళ్లు ధిక్కరించారు. తమ మనోవాంఛల వెనుకపోయారు) ఈ మూడవ ఆయత్ లో దైవప్రవక్త(స.అ) పట్ల వాళ్ల చర్యలను మిథ్యమైనవి అని సూచించబడి ఉంది.
4. ఇవే కాకుండా మరెన్నో రివాయతులు హదీస్ మూల గ్రంథాలలో ఈ అద్భుత చర్య జరిగింది అని ఉల్లేఖించబడి ఉంది. ఈ హదీసులు తవాతుర్(నిరాకరించబడలేనటువంటివి) హదీసులుగా పరిగణించబడినవి. ముఫస్సిరీనులలో తబర్సీ, ఫఖ్రె రాజీ మరియు సయ్యద్ ఖుతుబ్ మొదలగు వార షఖ్ఖుల్ ఖమర్ కు సంబంధించిన హదీసులన్నీంటిని సమ్మతించారు. కేవలం కొన్ని అపోహాల కారణంగా ఆయతుల మరియు రివాయతుల నిదర్శనలను వదిలేయలేము.
రిఫరెన్స్
1. ఫఖ్రె రాజీ, భాగం29, పేజీ28.
2. మజ్మఉల్ బయాన్, భాగం9 మరియు 10, పేజీ186.
https://makarem.ir/main.aspx?lid=0&typeinfo=42&catid=27343&pageindex=0&m...
వ్యాఖ్యానించండి