.ఇస్లామీయ క్యాలండర్ ప్రకారం జుమాదస్సానియహ్ 6వ నెల. ఇస్లామీయ చరిత్రలో ఆ మాసంలో జరిగిన కొన్ని సంఘటనల వివరణ.
2వ తారీఖు: హిజ్రీ యొక్క 193వ సంవత్సరంలో “హారున్ అల్ రషీద్” మరణించాడు.
3వ తారీఖు: హిజ్రీ యొక్క 11వ సంవత్సరంలో దైవప్రవక్త[స.అ] కుమార్తె అయిన హజ్రత్ “ఫాతెమా జహ్రా”[స.అ] మరణించారు.
10వ తారీఖు: హిజ్రీ యొక్క 640వ సంవత్సరంలో “ముస్తన్సిర్ బిల్లాహ్ అబ్బాసీ” మరణించాడు.
13వ తారీఖు: హిజ్రీ యొక్క 64వ సంవత్సరంలో “ఉమ్ముల్ బనీన్” మరణించారు.
20వ తారీఖు: బేసత్ యొక్క 5వ సంవత్సరంలో హజ్రత్ “ఫాతెమా జహ్రా”[స.అ] మక్కాలో జన్మించారు.
21వ తారీఖు: హిజ్రీ యొక్క 61వ సంవత్సరంలో జనాబె “ఉమ్మె కుల్సూమ్”[స.అ] మరణించారు. అనగ కర్బలా నుండి మదీనహ్ కు తిరిగి వచ్చిన 4 నెలల తరువాత.
22వ తారీఖు: హిజ్రీ యొక్క 13వ సంవత్సరంలో “అబూబక్ర్ ఇబ్నె అబీ ఖహాఫహ్” మరణించారు.
27వ తారీఖు: హిజ్రీ యొక్క 254వ సంవత్సరంలో ఒక రివాయత్ ప్రకారం ఇమామ్ “అలీ నఖీ”[అ.స] మరణించిన రోజు.
29వ తారీఖు: హిజ్రీ యొక్క 126వ సంవత్సరంలో “వలీద్ ఇబ్నె యజీద్” చనిపోయాడు. మరియు హిజ్రీ యొక్క 252వ సంవత్సరంలో ఇమామ్ “అలీ నఖీ”[అ.స] యొక్క కుమారుడు “సయ్యద్ ముహమ్మద్” మరణించారు.
రిఫ్రెన్స్
రూజ్ షుమారె తారీఖ్, ఖుమ్, మొఅస్ససయే జహానీయె సిబ్తైన్[స.అ], చాపె అవ్వల్,(తారీఖె నష్ర్ 1384 షమ్సీ).
వ్యాఖ్యలు
Mashaallah
Shukriya himmat afzaei ka ...
వ్యాఖ్యానించండి