వసాయిల్ అల్ షియా యొక్క రివాయతులనుసారం ఇమామ్ హుసైన్(అ.స) అర్బయీన్ జియారత్ యొక్క పుణ్యం మరియు ప్రతిష్ట గురించి 40 అంశాలు:
వసాయిల్ అల్ షియా యొక్క రివాయతులనుసారం ఇమామ్ హుసైన్(అ.స) అర్బయీన్ జియారత్ యొక్క పుణ్యం మరియు ప్రతిష్ట గురించి 40 అంశాలు:
1. ఉపాధిని పెంచుతుంది
2. జీవితకాలాన్ని పెంచుతుంది
3. ఆపదలను దూరం చేస్తుంది
4. మునుపటి మరియు భవిష్యత్తు పాపాలను తొలగిస్తుంది
5. జియారత్ చేయు వాడు 50 మందిని షిఫాఅత్ చేయించగలడు
6. సమాధి సమీపంలో అతడి దుఆలు స్వీకరించబడతాయి
7. ఇమామ్ హుసైన్(అ.స) జియారత్ కు వచ్చిన వారికి దైవదూతలు దుఆ చేస్తారు
8. అతడి పేరు ఉత్తముల క్రమంలో లిఖించబడుతుంది
9. ఇంటి నుండి బయలుదేరినపుడు పాపముల నుండి దూరమౌతాడు
10. స్వీకరించబడిన వెయ్యి హజ్ ల పుణ్యం లభిస్తుంది
11. దైవదూతలు అతడు తిరిగి వచ్చేంత వరకు అతడి మరియు అతడి ధన రక్షణ చేస్తారు
12. ఖియామత్ రోజు అల్లాహ్ అతడి ఉత్తమ రక్షకుడు అవుతాడు
13. మొదటి అడుగులోనే క్షమించబడి, తరువాత అడుగులలో ఇమామ్ ఆశ్రయంతో అల్లాహ్ సామిప్యాన్ని పొందుతాడు
14. ప్రతీ దిర్హమ్ కు పది దిర్హములుగా మార్చి ఇహపరలోకాలలో ఇవ్వబడతాయి
15. ఖియామత్ రోజున అందరూ ఇమామ్ హుసైన్(అ.స) యొక్క జవ్వార్ అయి ఉండాలని కోరుకుంటారు
16. ఇమామ్ హుసైన్(స.అ) దర్శకులు ఖియామత్ రోజున కాంతితో నిండి వున్న దస్తర్ ఖాన్(భోజనము చేయు బల్లపీటపై పరుచు బట్ట) పై ఉంటాడు
17. ఇమామ్ హుసైన్(అ.స) యొక్క దర్శకులు(జాయిరీన్) దైవప్రవక్త(స.అ), ఇమామ్ అలీ(అ.స) మరియు హజ్రత్ ఫాతెమా(స.అ) పొరుగులో ఉంటారు
18. ఇమామ్ హుసైన్(అ.స) యొక్క దర్శకులు ఇతరుల కంటో 40 సంవత్సరాలు ముందుగానే స్వర్గంలో ప్రవేశిస్తారు
19. అల్లాహ్ జాయిర్ యొక్క ప్రాపంచిక ముఖ్యమైన వాటిని ప్రసాదిస్తాడు
20. ఇమామ్ హుసైన్(అ.స) దర్శకుడు(జాయిర్) వీరునిగా మరణిస్తాడు
21. రెండు నెలల ఏతెకాఫ్ మరియు మస్జిదుల్ హరామ్ లో ఉపవాస దీక్షలు నిర్వర్తించనంత పుణ్యం కలుగుతుంది
22. ప్రతీ నెల ఇమామ్ హుసైన్(అ.స) జియారత్ యొక్క పుణ్యం వెయ్యి షహీదుల పుణ్యంతో సమానం
23. పాదయాత్రలో దర్శకుడి ప్రతీ అడుగు వెయ్యి పుణ్యాలకు కారణం, వెయ్యి పాపములు క్షమించబడతాయి మరియు వెయ్యి స్థానాలు (గ్రేడ్) పెరుగుతాయి
24. పాదయాత్రలో ప్రతీ అడుగుకు ఇస్మాయీ నబీ(అ.స) యొక్క సంతానానికి చెందిన ఒక బానిసను విడిపించిన పుణ్యం లభిస్తుంది
25. ఇమామ్ హుసైన్(అ.స) వద్ద ఉన్న ప్రతీ రోజు వెయ్యి నెలలతో సమానం
26. ఇమామ్ హుసైన్(అ.స) దర్శకుడికి అడుగు పెట్టడం పై ఒక హజ్ యొక్క పుణ్యం మరియు అడుగు తీయడం పై ఒక ఉమ్రా యొక్క పుణ్యం ఉంది, అయితే ఈ చర్య ప్రజల కోసం లేదా వ్యర్థం అయి ఉండకూడదు
27. ఇమామ్ హుసైన్(అ.స) జియారత్ యొక్క పుణ్యం బద్ర్ అమరవీరుల వెయ్యి వీరుల పుణ్యం(తో సమానం)
28. ఇమామ్ హుసైన్(అ.స) జియారత్ యొక్క పుణ్యం వెయ్యి స్వీకరించబడిన సద్ఖాల(తో సమానం)
29. వెయ్యి ఉపవాసాల పుణ్యం జాయిర్ కు ప్రసాదించబడుతుంది
30. వెయ్యి బానిసలను విడిపించినంత పుణ్యం ఉంది
31. ఇమామ్ హుసైన్(అ.స) దర్శకుడు దుర్మార్గుల నుండి అయితే అతడు ఉత్తముల(క్రమం)లో లిఖించబడతాడు
32. అల్లాహ్ మార్గంలో వెయ్యి గుర్రాలను సిద్ధం చేసిన వారి పుణ్యం ప్రసాదించబడుతుంది
33. ఇమామ్ హుసైన్(అ.స) యొక్క జియారత్ అల్లాహ్ యొక్క జియారత్
34. దైవప్రవక్త(స.అ) లేదా ఇమామె ఆదిల్ తో కలిసి చేసిన వెయ్యి యుద్ధాల పుణ్యం ప్రసాదించబడుతుంది
35. ఇమామ్ హుసైన్(అ.స) జియారత్ యొక్క పుణ్యాలు లెక్కలేనివన్ని ఉన్నాయి
36. అరఫహ్ లో ఇమామ్ హుసైన్(అ.స) జియారత్ పుణ్యం పది లక్ష హజ్ మరియు పది లక్షల ఉమ్రా పుణ్యం గలదు
37. ఇమామ్ హుసైన్(అ.స) జియారత్ అత్యుత్తమ చర్య
38. ఇమామ్ హుసైన్(అ.స) యొక్క దర్శకులను (చూసి) అల్లాహ్ గర్విస్తాడు
39. దైవప్రవక్త(స.అ) మరియు పవిత్ర ఇమాములు(అ.స) అతడి కోసం దుఆ చేస్తారు
40. దైవప్రవక్త(స.అ) మరియు దైవదూతలు ఖియామత్ రోజున జాయిర్ తో చేతులు కలుపుతారు(ముసాఫహహ్ చేస్తారు) మరియు ఇమామ్ హుసైన్(అ.స) తో పాటు కలిసి వస్తారు
వ్యాఖ్యానించండి