పాలస్తీనీయుల పై జరుగుతున్న అన్యాయం మరియు దౌర్జన్యాల పట్ల మన షియాల కర్తవ్యం ఏమిటి? అన్న విషయం పై సున్నత్ నిదర్శనం...

కొందరు షియా ముస్లిముల మనోభావాలను ప్రేరేపించేందుకు మీరు సహాయం చేసే పాలస్తీనీయులు నాసీబీలు అహ్లె బైత్(అ.స) యొక్క శత్రువులు; అందుకని వాళ్ల తరపు నుండి డిఫెన్స్ చేయకండి, వారికి సహాయం అందిచకండి, అని చెబుతున్నారు. ఈ సందేహానికి సమాధానం ఇచ్చే ప్రయత్నంలో కొన్ని అంశాలు ఇక్కడ వివరించబడ్డాయి; నిజానికి ఈ ఆలోచన ఖుర్ఆన్ మరియు అహ్లెబైత్(అ.స) యొక్క ఉపదేశాలకు వ్యతిరేకమైనది అని ముందుగా మనం తెలుసుకోవాలి.
బాధితుల రక్షణ
పాలస్తీనా ప్రజలు యూదుల అమానుష్యత, అంతులేని దౌర్జన్యం మరియు క్రూరమైన వేటకు గురై ఉన్నారు, వారి పై అన్ని రకాల ఒత్తిడిని తీసుకొస్తున్నారు, వారి పై చేస్తున్న దౌర్జన్యాలను వ్రాయడానికి కలం వణుకుతుంది మరియు మాట పడిపోతుంది మరియు హృదయం అదుపు తప్పుతుంది, దీనికి మించిన మరియు మానవత్వం సిగ్గు పడే విషయమేమిటంటే ఇంటర్ నేషనల్ సంస్థలు మౌనంగా వేడుక చూస్తున్నారు. వ్యతిరేకత ప్రదర్శించడం కాకుండా ఇజ్రాయీల్ చేస్తున్న ఈ అవీవేక చర్యలు, అమెరికా మరియు యూరప్ ఆధ్వర్యంలో పూర్తీ మద్దతతుతో జరుగుతున్నాయి.
బాధితుల రక్షణ ప్రతీ మనిషి యొక్క కర్తవ్యం, బాధితుల రక్షణ ప్రవక్త(అ.స) ల ఉపదేశాల నుండి ముఖ్యమైన అంశం, బాధితుల రక్షణ ఖుర్ఆన్ మరియు దైవప్రవక్త(స.అ) మరియు వారి అహ్లెబైత్(అ.స) రివాయతులలో కేంద్ర స్థానం మరియు ఒక ప్రత్యేక దర్జా కలిగి ఉంది.
దైవప్రవక్త(స.అ) ఉపదేశం.. దౌర్జన్యుడి నుండి బాధితుడికి న్యాయం చేకూర్చేవాడు స్వర్గంలో నాతో పాటు నాకు సమానంగా కూర్చుంటాడు.[1]
అమీరుల్ మొమినీన్(అ.స) తన చివరి వసీయత్ లో ప్రజలందరిని, ముస్లిములందరినీ, తన షియాలందరినీ, వారిని ఇష్టపడేవారందరినీ మరియు తన కుమారులందరినీ ఉద్దేశించి ఇలా ఉపదేశించారు.. నిత్యం దౌర్జన్యుడికి శత్రువు మరియు బాధితుడి సంరక్షకుడు మరియు మద్దత్తుదారుడిగా ఉండి[2]
అమరవీరుల నాయకుడు అయిన హజ్రత్ ఇమామ్ హుసైన్(అ.స) కర్బలా మార్గంలో చరిత్ర గర్వించదగ్గ ఉపన్యాసమిచ్చారు అందులో వారు ఇలా ఉపదేశించారు: ప్రజలారా!, దైవప్రవక్త(స.అ) ఇలా ఉల్లేఖించెను: ఎవరైనా అల్లాహ్ హరామ్ నిర్ధారించిన వాటిని హలాల్ గా నిర్ధారించే, అల్లాహ్ నిశ్చయాలను మార్చే, దైవప్రవక్త(స.అ) సున్నత్ ను వ్యతిరేకించే, అల్లాహ్ దాసుల పట్ల పాపం, దౌర్జన్యం మరియు అన్యాయంగా ప్రవర్తించే దౌర్జన్యపు అధికారిని చూస్తున్నాడు కాని తన మాట ద్వార లేదా చేత ద్వారా గాని వాడిని వ్యతిరేకించడపోతే, వాడి చర్యకు ప్రతి చర్య ప్రదర్శించకపోతే అల్లాహ్ కు అతడికి ఆ దౌర్జన్యుడి తో పాటు నరకంలో వేసే హక్కు ఉంది.[3]
ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స) తన దుఆ గ్రంథం అయిన సహీఫయె సజ్జాదియహ్ లో అల్లాహ్ సన్నిధిలో ఇలా వేడుకున్నారు: “ఓ అల్లాహ్, నేను నీ సన్నిధిలో నా ముందు దౌర్జన్యానికి గురి మరియు నేను అతడికి సహాయం చేయలేకపోయిన బాధితుడి విషయంలో క్షమాపణ కోరుకుంటున్నాను.[4]
రిఫరెన్స్
1. మజ్లిసీ, మొహమ్మద్ బాఖిర్, బిహారుల్ అన్వార్, భాగం75, పేజీ359.
وَ مَنْ أَخَذَ لِلْمَظْلُومِ مِنَ الظَّالِمِ كَانَ مَعِي فِي الْجَنَّةِ مُصَاحِبا
2. నెహ్జుల్ బలాగహ్, మక్తూబ్47.
كُونَا لِلظَّالِمِ خَصْماً وَ لِلْمَظْلُومِ عَوْنا
3. తబరీ, తారీఖుల్ ఉమమ్ వల్ ములూక్, భాగం5, పేజీ403.
أيُّهَا النّاسُ ! إنَّ رَسولَ اللَّهِ صلى اللَّه عليه وآله قالَ : مَن رَأى سُلطاناً جائِراً ، مُستَحِلّاً لِحُرَم اللَّهِ ، ناكِثاً لِعَهدِ اللَّهِ ، مُخالِفاً لِسُنَّةِ رَسولِ اللَّهِ ، يَعمَلُ في عِبادِ اللَّهِ بِالإِثمِ وَالعُدوانِ ، فَلَم يُغَيِّر عَلَيهِ بِفِعلٍ ولا قَولٍ ، كانَ حَقّاً عَلَى اللَّهِ أن يُدخِلَهُ مُدخَلَهُ
4. సహీఫ ఎ సజ్జాదియహ్, దుఆ38.
اللَّهُمَّ إِنِّي أَعْتَذِرُ إِلَيْكَ مِنْ مَظْلُوم ظُلِمَ بِحَضْرَتِي فَلَمْ أَنْصُرْه۔
వ్యాఖ్యానించండి