బాధితుల పట్ల మద్దత్తు దైవప్రవక్త(స.అ) దృష్టిలో

ఆది, 11/26/2023 - 09:28

బాధితులకు సహాయం చేయడం, వారికి రక్షణ కలిపించడం మరియు వారి తరపు నుండి డిఫెన్స్ చేయడం తప్పని సరి ఇస్లాం మనకు ఆదేశిస్తుంది...

పీడితుల పట్ల మద్దత్తు దైవప్రవక్త(స.అ) దృష్టిలో

పీడితులకు సహాయం చేయడం, వారికి రక్షణ కలిపించడం మరియు వారి తరపు నుండి డిఫెన్స్ చేయడం తప్పని సరి అని ఇస్లామీయ రివాయతులలో ఉంది. దైవప్రవక్త(స.అ) ఒక హదీసులో ఇలా ప్రవచించారు: “బాధించబడే వారి హక్కులను దౌర్జన్యపరుడి నుండి తీసుకున్నవాడు స్వర్గంలో నాతో పాటు ఉంటాడు”[1] . నిజానికి బాధితుడికి సహాయం చేయడం, మరియు అతడికి చెందిన హక్కులు దౌర్జన్యపరుడి నుండి తిరిగి తీసుకోవడం ఎంత గొప్పపని అనే విషయాన్ని ఈ హదీస్ ద్వారా తెలుస్తుంది, అతడి స్థానం స్వర్గంలో దైవప్రవక్త(స.అ)తో పాటు కూర్చునే భాగ్యం లభిస్తుంది.

మరో రివాయత్ లో దైవప్రవక్త(స.అ) ఇలా ఉపదేశించారు: “బాధితుడు ముస్లిముల నుండి సహాయం కోరడాన్ని వినీ అతడికి సహాయం అందించకపోతే అతడు ముస్లిం కాదు”[2] ఈ రివాయత్ కూడా బాధితులందరి కోసం ప్రత్యేకించబడింది, ఇందులో ముస్లిములు కాని వారు కూడా ఉన్నారు. ఈ రివాయత్ ప్రకారం ఎవరైతే బాధితుడి పై అన్యాయాలను వింటాడో, అతడి ఆర్తనాధాలు చేవులకు చేరుతాయో మరియు సహాయం చేసే స్థితితో ఉన్నా కూడా సహాయం చేయకపోతే అతడు ముస్లిం కాదు.

ఇమామ్ అలీ(అ.స) తన ఇద్దరు కుమారులు ఇమామ్ హసన్ మరియు హుసైన్(అ.స)లను ఉద్దేశించి ఇలా అన్నారు: “దౌర్జన్యపరుడి పట్ల శత్రువు మరియు బాధితుడి పట్ల సహాయకుడిగా ఉండి”[3] ఈ రివాయత్ కూడా కేవలం ముస్లిములకు మాత్రమే సహాయం చేయండి అని చెప్పలేదు, ఈ విధంగా చూసుకున్నట్లైతే బాధితుడికి రక్షణ కలిపించడం ప్రతీ ముస్లిం యొక్క బాధ్యత; బాధితుడు ముస్లిం కాకపోయినా సరే సహాయం చేయాలి.

ఇమామ్ సజ్జాద్(అ.స) ప్రముఖ దుఆ గ్రంథం అయిన సహీఫ-ఎ-సజ్జాదియహ్ యొక్క 38వ దుఆలో ఇలా ఉపదేశించారు: “ఓ ప్రభువా! నీ ఆస్తానంలో మూడింటి నుండి క్షమాపణ కోరుతున్నాను”
1. నా ముందు బాధించబడినా, నేను అతడికి సహాయం అందిచలేకపోయినటువంటి వ్యక్తి నుండి.
2. నాకు సహాయం అందించినా, నేను అతడికి కృతజ్ఞత తెలుపుకోలేకపోయినటువంటి వ్యక్తి నుండి.
3. నా పట్ల చెడు చేసి నా నుండి క్షమాపణ కోరినా, నేను దానిని అంగీకరించలేకపోయినటువంటి వ్యక్తి నుండి.[4]

ఈ హదీస్ ద్వారా మనకు తెలిసే విషయాలేమిటంటే:
అ. ఇమామ్ సజ్జాద్(అ.స) బాధితులకు సహాయం చేయకపోవడం, సహాయం చేసినవాడి పట్ల కృతజ్ఞత చూపకపోవడం మరియు క్షమాపణ కోరేవారి క్షమాపణను అంగీకరించకపోవడం పాపంగా భావించారు, అందుకనే అల్లాహ్ సన్నిధిలో వీటి పట్ల అశ్రద్ధత గనక చూపించినట్లైతే క్షమించమని కోరారు.
ఆ. ఇమామ్, పవిత్రులు వారు ఎటువంటి తప్పులు చేయరు, వీటిని మా గురించి వివరించారు, ఒకవేళ ఇలాంటి పనులు చేసి ఉంటే మనం తౌబాహ్ చేసుకోవాలనే భావం అందులో ఉంది.
ఇ. ఎలాగైతే మేము ఒకరి చేత బాధించేటప్పుడు ఇతరులు మనకు సహాయం చేయాలని అనుకుంటామో, ఎవరికైనా సహాయం చేసినప్పుడు మనకు కృతజ్ఞత తెలపాలని అనుకుంటామో మరియు తప్పు చేసి క్షమాపణ కోరినప్పుడు స్వాకరించాలని అనుకుంటామో, అదే విధంగా మేము కూడా ఇతరుల పట్ల ఈ భావన కలిగి ఉండాలి. బాధితులకు సహాయం చేయాలి, సహాయం చేసిన వారికి కృతజ్ఞత తెలపాలి మరియు క్షమాపణ కోరిన వారిని క్షమించాలి. ఆశ్చర్యమేమిటంటే మేము దుఆ చేస్తే అల్లాహ్ మన పాపములన్నింటిని క్షమించి మన తప్పులను తుడిచివేయాలి అని భావిస్తాము కాని మనం మాత్రం మన పట్ల జరిగిన ఇతరుల తప్పులను సంవత్సరాల పాటు మనసులో అట్టి పెట్టుకుంటాము, ఎట్టి పరిస్థితిలో కూడా క్షమించడానికి సిద్ధమవ్వము. ఒకవేళ ప్రజలు క్షమా గుణం మరియు దయా లక్షణం కలిగి ఉంటే కోర్టులలో ఇన్ని కేసులు ఉండేవి కావు.[5]

రిఫరెన్స్
1. కన్జుల్ ఫవాయిద్, కరాజకీ, మొహమ్మద్ ఇబ్నె అలీ, మొహఖ్ఖిఖ్/ముసహ్హెహ్: నేమతున్, అబ్దుల్లాహ్, దారుజ్ జఖాయిర్, ఖుమ్, 1410ఖ, భాగం1, పేజీ135.
مَنْ اَخَذَ لِلْمَظْلُومِ مِنَ الظَّالِمِ كانَ مَعى فى الجنّة مُصاحِباً
2. అల్ కాఫీ, కులైనీ, మొహమ్మద్ ఇబ్బె యాఖూబ్, మొహఖ్ఖిఖ్/ముసహ్హెహ్: గఫ్పారీ, అలీ అక్బర్, ఆఖుందీ, మొహమ్మద్, దారుల్ కుతుబ్ అల్ ఇస్లామియహ్, తెహ్రాన్, 1407ఖ, చాప్4, భాగం2, పేజీ164.
مَنْ سَمِعَ رَجُلاً يُنادى يا لَلْمُسْلِمينْ فَلَمْ يُجِبْهُ فَلَيْسَ بِمُسْلِم
3. నెహ్జుల్ బలాగహ్, షరీఫ్ అల్ రజీ, మొహమ్మద్ ఇబ్బె  హుసైన్, మొహఖ్ఖిఖ్/ముసహ్హెహ్: సుబ్హీ సాలెహ్, హిజ్రత్, ఖుమ్, 1414ఖ, పేజీ421, నామె47.
كُونا لِظّالِمِ خَصْماً وَ لِلْمَظْلُومِ عَوْناً
4. సహీఫయె సజ్జాదియహ్, దుఆ38.
اَللّهُمَّ اِنّى اَعْتَذِرُ اِلَيْكَ مِنْ مَظْلُوم ظُلِمَ بِحَضْرَتى فَلَمْ اَنْصُرْهُ، وَ مِنْ مَعْرُوف اُسْدِىَ اِلَىَّ فَلَمْ اَشْكُرْهُ، وَ مَنْ مُسِىء اِعْتَذَرَ اِلَىَّ فَلَمْ اَعْذِرْهُ
5. అజ్ తూ సవాల్ మీ కునంద్, మకారిమ్ షీరాజీ, నాసిర్, తహయ్యెహ్ వ తన్జీమ్: ఇల్యాన్ నెజాదీ, అబుల్ ఖాసిమ్, మద్రసతు ఇమామ్ అలీ ఇబ్నె అబీ తాలిబ్(అ.స), ఖుమ్, 1387ష, చాప్2, పేజ76.    

https://makarem.ir/main.aspx?lid=0&typeinfo=42&mid=406588

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
3 + 7 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7