హజ్రత్ జహ్రా(స.అ) సద్గుణం

గురు, 11/30/2023 - 05:48

హజ్రత్ జహ్రా(స.అ) సద్గుణాలు మరియు సహాయ రీతిని వివరిస్తున్న ఒక సంఘటన... 

హజ్రత్ జహ్రా(స.అ) సద్గుణం

హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) యొక్క జీవిత చరిత్ర ఉత్తమ గుణాలలో మరియు మానవ ఉత్తమ రీతి మరియు ఉత్తమ మాటతీరుతో నిండి ఉంటుంది. మీ అస్తిత్వం మరియు ఉనికి దౌత్యం మరియు ఇమామత్ కు కలిపే కారణం. ఆమె జీవితం కేవలం స్ర్తీలకే కాదు యావత్ ప్రపంచానికి నమూనా. దైవప్రవక్త(స.అ) ప్రవచనలనుసారం ఆమె దౌత్యం యొక్క భాగం[1] ఇమామ్ హసన్ అస్కరీ(అ.స) ఉల్లేఖనుసారం ఆమె అల్లాహ్ నియమించిన హుజ్జతుల పై హుజ్జత్ అని వ్యక్తమౌతుంది.[2]

గౌరవనీయులైన గొప్ప సహాబీ అయినా జాబిర్ ఇబ్నె అబ్దుల్లాహ్ అన్సారీ నుండి రివాయత్ ఇలా ఉల్లేఖిబడి ఉంది, వారు ఇలా రివాయత్ ను ఉల్లేఖించారు.. ..వలసి వచ్చిన ఆరాబీ వర్గానికి చెందిన ఒక ఫకీరు మరియు బీదవాడు అస్ర్ నమాజ్ చదివిన తరువాత దైవప్రవక్త(స.అ) వద్దకు వచ్చి ఆయన నుండి సహాయం కోరాడు, వారు ఇప్పుడు నా వద్ద ఇవ్వడానికి ఏమి లేదు అని చెప్పి వారు అతడ్ని మజ్జిద్ ప్రక్కనే ఉన్న హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) ఇంటికి పంపారు. అతడు జనాబె బిలాల్ తో పాటు కలిసి హజ్రత్ ఫాతెమా(స.అ) ఇంటికి చేరాడు, అతడు ఆమెకు సలామ్ చేసి తాను ఉన్న పరిస్థితిని ఆమెకు వివరించాడు. నిజానికి అప్పుడు ఆమె తండ్రి మరియు భర్త ఇద్దరూ ఆకలితో ఉన్నప్పటికీ ఆ ఫకీరు పరిస్థితిని విని ఆమె మెడలో ఉన్న హారం, దాన్ని ఆమె చెల్లెలు(బాబయ్ కూతురు) బహుమతిగా ఇచ్చారు అది ఆమె కోసం ఒక ముఖ్యమైన జ్ఞాపకార్థం, అయినప్పటికీ ఆమె దాన్ని తన మెడలో నుండి తీసి ఆ ఆరాబీ కిచ్చి దీన్ని తీసుకొని వెళ్లి అమ్ముకో అల్లాహ్ నీకు ఇంతకన్నా మంచిది ప్రాసిందించుగాక, అని అన్నారు. అఅరాబీ ఆ హారాన్ని తీసుకొని దైవప్రవక్త(స.అ) వద్దకు వచ్చి జరిగిన పూర్తి సంఘటనను వివరించాడు, దైవప్రవక్త(స.అ) అఅరాబీ చెప్పిన మాటలకు ప్రభావితుల్లయ్యారు వారి కళ్ల నుండి నీళ్లు వచ్చాయి, వారు ఆ అఅరాబీ కోసం దుఆ చేశారు.

జనాబె అమ్మారె యాసిర్, దైవప్రవక్త(స.అ) మీరు అనుమతిస్తే నేను ఈ హారాన్ని కొనాలనుకుంటున్నాను అని అన్నారు. దానికి దైవప్రవక్త(స.అ) అల్లాహ్ ఈ హారాన్ని కొన్న వారికి శిక్షించడు అని అన్నారు. అమ్మార్ ఆ అఅరాబీతో ఎంతకు అమ్ముతావు అని అడిగారు. దానికి ఆ అఅరాబీ కడుపు నిండడానికి భోజనం, ధరించడానికి యమానీ బట్టలు మరియు స్వదేశానికి తిరిగి వెళ్లేందేకు డబ్బులు అని అన్నాడు.

అమ్మార్, హారానికి బదులుగా 200 దిర్హములు చెల్లిస్తాను, మాంసం మరియు రొట్టితో నీ కడుపు నింపుతాను, యమానీ బట్టలు నీకు ఇస్తాను ఒంటె ద్వార నీ ఇంటికి చేరుస్తాను అని చెప్పి తన ఇంటికి తీసుకొని వెళ్లారు.

ఆ తరువాత ఆ అఅరాబీ మరలా దైవప్రవక్త(స.అ) వద్దకు వచ్చాడు. వారు నీ అవసరాలన్నీ తీరాయి కదా అని అడిగారు, అతడు ఔను, అంతేకాదు ఇక ఇప్పుడు ఎటువంటి లోటు లేని వాడినయ్యాను. అప్పుడు దైవప్రవక్త(స.అ) హజ్రత్ ఫాతెమా జహ్రా(స.అ) యొక్క కొన్ని ప్రతిష్టతలను వివరించారు.

అమ్మార్ ఆ హారాన్ని అత్తరు పూసి, యమానీ గుడ్డలో చుట్టి, తన వద్ద ఉన్న సెహమ్ పేరు గల పనివాడికిచ్చి దీన్ని దైవప్రవక్త(స.అ)కు తీసుకెళ్లు అని చెప్పి నిన్ను కూడా వారికి ఇచ్చేశాను అని అన్నారు, దైవప్రవక్త(స.అ) సెహమ్ ను హజ్రత్ ఫాతెమా(స.అ) వద్దకు పంపారు, దైవప్రవక్త(స.అ) కుమార్తె హారాన్ని తీసుకొని ఆ బానిసను ఆజాద్ చేశారు. ఆ బానిస స్వేచ్చ పొందిన తరువాత నవ్వాడు, హజ్రత్ జహ్రా(స.అ) అతడి నవ్వుకు కారణం అడిగారు, అతడు ఆ హారం యొక్క శుభాన్ని చూసి నవ్వుకుంటున్నాను., ఆకలితో ఉన్నవాడికి కడుపు నింపింది, అవసరం ఉన్నవాడి అవసరం తీర్చింది, బట్టలు లేని వాడికి బట్టలు పెట్టింది, దాసుడికి స్వేచ్ఛను ప్రసాదించింది మరియు తిరిగి తన యజమాని వద్దకు వచ్చేసింది.[3]  

రిఫరెన్స్
1. ఖాజీ నోమానీ మగ్రిబీ, షర్హుల్ అఖ్బారి ఫీ ఫజాయిల్ అయిమ్మతిల్ అత్హార్, భాగం3, పేజీ30.
فَاطِمَةُ بَضْعَةٌ مِنِّی ‏فَمَنْ آذَاهَا فَقَدْ آذَانِی
2. తఫ్సీరె అత్ యబిల్ బయాన్, భాగం133, పేజీ236.
نَحْنُ حُجَةُ اللّه‏ عَلى خَلْقِهِ وَ فاطِمَةُ حُجَّةُ ‏اللّه‏ عَليَنا
3. https://erfan.ir/farsi/48831.html

tolidi: 
غیر تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13