దైవప్రవక్త[స.అ] యొక్క చివరి జమాఅత్ నమాజ్

శుక్ర, 12/01/2017 - 12:51

.దైవప్రవక్త[స.అ] జనాబె బిలాల్ యొక్క అజాన్ ను విని ఇద్దరి వ్యక్తుల సహాయంతో మసీదుకు వెళ్ళి జమాఅత్ చదివిన సంఘన వివరణ.

దైవప్రవక్త[స.అ] యొక్క చివరి జమాఅత్ నమాజ్

ఎలాగైతే దైవప్రవక్త[స.అ] మొట్ట మొదటి నమాజ్ ను హజ్రత్ ఖదీజా[అ.స] మరియు హజ్రత్ అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స]తో పాటు కలిసి జమాఅత్ నమాజ్ ను చదివారో అలాగే వారి చివరి నమాజ్ ను కూడా మసీదులో జమాఅత్ తో చదివారు.
రివాయత్ లో ఇలా ఉల్లేఖించబడి ఉంది, దైవప్రవక్త[స.అ] చివరి గడియాలలో వారు మంచాన పడి ఉన్నప్పుడు ఒక్కసారిగా “బిలాలె హబషీ” యొక్క అజాన్ విని నమాజ్ సమయం అయ్యింది అని గ్రహించారు. దైవప్రవక్త[స.అ] అలీ ఇబ్నె అబీతాలిబ్[అ.స] మరియు ఫజ్ల్ ఇబ్నె అబ్బాస్ లతో “మసీదుకు వెళ్ళేందుకు నన్ను సహకరించండి” అని అన్నారు. ఎప్పుడైతే వారిద్దరి సహాయంతో మసీదుకు చేరారో అప్పుడు నమాజ్ ను జమాఅత్ తో చదివారు.
ఇదే దైవప్రవక్త[స.అ] యొక్క చివరి జమాఅత్ నమాజ్. ఆ తరువాత వారు ఇంటికి తిరిగి వచ్చారు చాలా తక్కువ సమయంలోనే వారి పవిత్ర ఆత్మ అల్లాహ్ ఆహ్వానాన్ని అంగీకరించి ఈలోకాన్ని విడిచింది.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
10 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 7