సయ్యద్ రజీ మూసవీ వీరమరణం

గురు, 01/04/2024 - 07:39

అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని సుతరామూ మృతులుగా తలపోయకండి. వారు సజీవులు. వారికి తమ ప్రభువు వద్ద ఆహారం ఇవ్వబడుతుంది...

సయ్యద్ రజీ మూసవీ వీరమరణం

అల్లాహ్ తన గ్రంథం ఖుర్ఆన్ లో ఇలా ప్రవచించెను: “అల్లాహ్ మార్గంలో చంపబడిన వారిని సుతరామూ మృతులుగా తలపోయకండి. వారు సజీవులు. వారికి తమ ప్రభువు వద్ద ఆహారం ఇవ్వబడుతుంది”[1]

ఇస్లాంలో షహాదత్ అధ్యాయం ఒక గొప్ప అధ్యాయం, దీని పట్ల ప్రతీవాడికి ఆశ ఉంటుంది, ఎందుకంటే మృత్యువు అన్నది నిశ్చయం, ప్రతి ప్రాణి మరణం యొక్క రుచి తప్పక చూడ వలసిందే[2]. ఇది మనిషి జీవితం యొక్క యదార్థం. చివరికి దైవప్రవక్త(స.అ) కు కూడా మృత్యువు ఉంది. షహాదత్, మృత్యువు యొక్క గొప్ప స్థాయి మరణం, ఇందులో వినాశనం, అంతం అనే ఊహలు కూడా లేవు ఎందుకంటే అల్లాహ్ వారిని సజీవులు. వారికి తమ ప్రభువు వద్ద ఆహారం ఇవ్వబడుతుంది”[3] అని వాగ్దానం చేసెను.

హజ్రత్ జాఫరె సాదిఖ్(అ.స) షహీద్ గురించి ఇలా ఉపదేశించెను: “అల్లాహ్ మార్గంలో తన ప్రాణాలను అర్పించినవాడికి అల్లాహ్ అతడు చేసిన పాపముల నుండి ఏ ఒక్క దాని గురించి కూడా అతడికి తెలియపరచడు”[4]

మరో రివాయత్ లో దైవప్రవక్త(స.అ) ఇలా ప్రవచించెను: మంచిని మించిన మంచి ఉంది కాని అల్లాహ్ మార్గంలో తన ప్రాణాలను అర్పించిడానికి మించిన మంచి పని మరొకటి లేదు.[5]

షహీద్ సయ్యద్ రజీ మూసవీ, సోమవారం డమాస్కస్ శివార్లలో జియోనిస్ట్ దోపిడీ ప్రభుత్వం యొక్క దాడిలో వీరమరణం పొందారు, అతను జంజాన్ ప్రావిన్స్ కు చెందినవారు, ఎనిమిది సంవత్సరాల పవిత్ర రక్షణ, అంటే ఇరాన్-ఇరాక్ యుద్ధంలో జంజానీ యొధులతో పాటు కలిసి పోరాడారు.

అమవీరుడు సయ్యద్ రజీ మూసవీ, హృదయాల నాయకుడు షహీద్ ఖాసిమ్ సులైమానీ యొక్క సహచరులు మరియు సిరియాలోని ఇస్తెఖామతీ గ్రూప్ కు మద్దతు ఇవ్వడానికి వారు బాధ్యత వహించారు.

సయ్యద్ రజీ మూసవీ యొక్క షహాదత్ అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడం, సిరియా యొక్క అంతర్గత వ్యవహారాల్లో జోక్యం మరియు సిరియా సార్వభౌమాధికారంపై దాడి యొక్క బహిరంగ నిర్ధారణ, ఎందుకంటే వారు ఇరాన్ రాయబార కార్యాలయంలో దౌత్యవేత్త మరియు రెండవ కాన్సుల్‌గా తన విధులను నిర్వర్తించడంలో బిజీగా ఉన్నారు మరియు వారు రాయబార పాస్‌పోర్ట్ కలిగివున్నారు.

జియోనిస్ట్ దోపిడి ప్రభుత్వం చేత ఇస్లామిక్ రివల్యూషన్ గార్డ్స్ యొక్క సలహాదారులు మేజర్ జనరల్ సయ్యద్ రజీ మూసావి యొక్క చంపబడడం, మరియు ఇజ్రాయెల్ యొక్క ఈ నేరపూరిత చర్యలు, జియోనిస్ట్ రాజ్యం తీవ్రమైన పిరికితనం మరియు భయం కారణంగా ఇటువంటి యుద్ధ నేరాలకు పాల్పడుతోందని స్పష్టంగా తెలుస్తుంది.

షహీద్ సయ్యద్ రజీ మూసవీపై దాడి 1961 AD మరియు 1973 AD నాటి అంతర్జాతీయ ఒప్పందాలను తీవ్రంగా ఉల్లంఘించడం మరియు యుద్ధ నేరాల కిందకు వస్తుందని, అంతర్జాతీయ నేరస్థుడైన ఇజ్రాయెల్ బహిరంగంగా అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘిస్తోందని గమనించాలి.

1. సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్169.
وَلَا تَحْسَبَنَّ الَّذِينَ قُتِلُوا فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتًا بَلْ أَحْيَاءٌ عِنْدَ رَبِّهِمْ يُرْزَقُونَ
2. సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్185.
کُلُّ نَفْسٍ ذَائِقَۃُ الْمَوْتِ
3. సూరయె ఆలి ఇమ్రాన్, ఆయత్169.
وَلَا تَحْسَبَنَّ الَّذِينَ قُتِلُوا فِي سَبِيلِ اللَّهِ أَمْوَاتًا بَلْ أَحْيَاءٌ عِنْدَ رَبِّهِمْ يُرْزَقُونَ
4. షేఖ హుర్రె ఆములీ, మొహమ్మద్ ఇబ్నె హసన్ ఇబ్నె అలీ, వసాయిల్ అల్ షియా, భాగం11, పేజీ9.
مَن قُتِلَ فِی ‌سَبیلِ اللهِ لَم یُعَرّفْهُ اللهُ شَیئاً مِن سَیِّئاتِه
5. షేఖ్ సదూఖ్, మొహమ్మద్ ఇబ్నె అలీ ఇబ్నె హుసైన్, ఖిసాల్, భాగం1, పేజీ8.
فَوقُ كُلِّ ذِی‌بِرّ‍ٍ بِرٌّ حتّی یُقتلَ الرّجُلُ شهیداً فی سبیلِ الله

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
9 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13