పాలస్తీనీయుల పై జరుగుతున్న అన్యాయం మరియు దౌర్జన్యాల పట్ల ఇతర మానవుల కర్తవ్యం ఏమిటి? అన్న విషయం పై సంక్షిప్త వివరణ....

పాలస్తీనీయుల ఆక్రందన మరియు ముస్లిం ఉమ్మత్ యొక్క బాధ్యత
దైవప్రవక్త(స.అ) ఉల్లేఖనం: ఎవరైతే ఒక బాధితుడి నుండి “ముస్లిములారా! నాకు సహాయం చేయండి” అని పిలవడాన్ని విని అతడు వారికి సమాధానం ఇవ్వనివాడు ముస్లిం కాదు[1]
సహాయం చేయండి అని పిలిచేవాడి మరియు బాధితుల కు సహాయం చేయడం అతడి మొరను విని అతడికి సహాయం చేయడం ఇస్లాం లో చాలా ముఖ్యమైన అంశం. అదే ఒకవేళ సహాయం కోరేవాడు ఒక ముస్లిం అయి ఉంటే దీని ప్రాముఖ్యత ఇంక పెరుగుతుంది. అందుకని పాలస్తీన ముస్లిముల కు సహాయం అందించడం మనందరి కర్తవ్యం అవుతుంది.
పాలస్తీనలో అహ్లెబైత్(అ.స)లను ఇష్టపడే వారి సంఖ్య
పాలస్తీనలో బహుశ అహ్లెబైత్(అ.స) పట్ల వైరం కలిగివున్నవారు ఉండి ఉండవచ్చు కాని పాలస్తీనీయులలో ఎక్కువ సంఖ్య అహ్లెబైత్(అ.స) ను ఇష్టపడేవారే ఉన్నారు ఎందుకంటే పాలస్తీనాలో ఎక్కువగా షాఫెయీ వర్గానికి చెందిన వారు ఉన్నారు మరి అహ్లెబైత్(అ.స) యొక్క ప్రతిష్టత గురించి షాఫెయి యొక్క ప్రసిద్ధి చెందిన కవిత్వాలు కూడా ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే వాళ్లు తమ కొన్ని మస్జిదుల పేర్లు కూడా వారి పేర్ల పై పెట్టుకున్నారు ఉదా; మస్జిదె పాతెమతుజ్జహ్రా(స.అ), మస్జిదె అలీ(అ.స).[2]
పాలస్తీనీయులు ఇస్లాం శత్రువుల బలగాలతో పోరాడుతుంది
మరో ముఖ్యమైన విషయమేమిటంటే ఇప్పుడు పాలస్తీన ప్రజలు మరియు లెబ్నానాన్ కు చెందిన హిజ్బుల్లాహ్, ఇస్లాం శత్రువులతో పోరాడే విషయంలో ముందుగా ఉన్నారు. ఎందుకంటే ప్రపంచంలో ముస్లిముల పై మిక్కిలి దౌర్జన్యం మరియు ముస్లిముల పట్ల మిక్కిలి శత్రుత్వం జియోనిష్టులు, అమెరికా మరియు యూరప్ సహాయం మరియు మద్దత్తులో చేస్తున్నారు అందుకని ఈ రంగంలో జరుగుతున్న యుద్ధం ఇస్లాం యొక్క ఒక ముఖ్యమైన యుద్ధం, దీని ప్రభావం ఇస్లాం ప్రపంచం పై పడుతుంది. ఈ విధంగా పాలస్తీన సమస్య ఇస్లాం ప్రపంచం యొక్క మూల సమస్య అవుతుంది. దీని పట్ల అశ్రద్ధత మరియు అలక్ష్యత ముస్లిములకు తీవ్రమైన కష్టాలను తీసుకొస్తుంది.
రిఫరెన్స్
1. షైఖ్ తూసీ, తహ్జీబుల్ అహ్కామ్, భాగం6, పేజీ175; హుర్రె ఆములీ, వసాయిల్ అల్ షియా, భాగం11, పేజీ108, 560; కులైనీ, ఉసూలె కాఫీ, భాగం3, పేజీ329.
أَحْمَدُ بْنُ مُحَمَّدٍ عَنِ اَلنَّوْفَلِيِّ عَنِ اَلسَّكُونِيِّ عَنْ جَعْفَرٍ عَنْ أَبِيهِ عَنْ آبَائِهِ عَلَيْهِمُ اَلسَّلاَمُ قَالَ قَالَ رَسُولُ اَللَّهِ صَلَّى اَللَّهُ عَلَيْهِ وَ آلِهِ : مَنْ سَمِعَ رَجُلاً يُنَادِي يَا لَلْمُسْلِمِينَ فَلَمْ يُجِبْهُ فَلَيْسَ بِمُسْلِمٍ
2. https://farsi.khamenei.ir/video-content?id=27034
వ్యాఖ్యానించండి