మంచి చేసినవారి పట్ల మన బాధ్యత

సోమ, 01/08/2024 - 04:03

ఇస్లాంలో ఇతరులకు మంచి చేసినవారి యొక్క ప్రాముఖ్యం మరియు వారి పట్ల మన బాధ్యతలు ఏమిటి అన్న విషయం పై సంక్షిప్త వివరణ...

మంచి చేసినవారి పట్ల మన బాధ్యత

అమీరుల్ మొమినీన్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స) ఉల్లేఖనం.. మంచి చేయబడ్డవారి పై గల బాధ్యత ఏమిటంటే మంచి చేసిన వాడికి ప్రతి చర్యగా ఉత్తమ రూపంలో చెల్లించాలి, ఒకవేళ అతడి వద్ద చేల్లించే స్థోమత లేకపోతే, ఉత్తమ రూపంలో నోటితో కృతజ్ఞత తెలుపుకోవడం అతడి బాధ్యత. ఒకవేళ మూగవాడైతే ఆ అనుగ్రహం యొక్క ప్రాముఖ్యత ను గమనించాలి మరియు మంచి చేసిన వాడిని ఇష్టపడాలి అతిడి పట్ల గౌరవం కలిగివుండాలి ఒకవేళ ఇదీ చేయలేకపోతే అతడు మంచి చేయబడడానికి అర్హుడే కాడు.[1]

మరో హదీస్ లో ఇమామ్ ఇలా ఉపదేశించారు: ఒకవేళ ఎవరైనా నీ శరీరం పైనుండి చిన్న దూళిని దులిపినా (అతడి కోసం దుఆ చేసేందుకు ఇలా) అను: నీ నుండి అల్లాహ్ నీకు ఇష్టం లేని వాటిని దూరం చేయు గాక.[2]

ఇమామ్ జైనుల్ ఆబెదీన్(అ.స) ఉల్లేఖనం: నీకు మంచి చేసిన వాడికి పట్ల నీ బాధ్యతలేమిటంటే నువ్వు అతడికి కృతజ్ఞత తెలుపుకో, అతడి మంచిని గుర్తు చేయి, అతడి గురించి మాట్లాడేటప్పుడు మంచిగా మాట్లాడు, నీ ప్రభువు ముందు అతడి కోసం కల్మషం లేని విధంగా దుఆ చేయి, ఒకవేళ నువ్వు గనక ఈ పనులు చేసినట్లైతే నువ్వు ప్రత్యేక్షంగా మరియు గోప్యంగా అతడికి కృతజ్ఞత తెలిపినట్లు అవుతుంది. అయితే ఒకవేళ ఏదో ఒకరోజు అతడి మంచిని తీర్చుకునే సందర్భం వస్తే తప్పుకుండా దానిని అమలు పరుచు.[3]

ఒకరికి మంచి చేసే వ్యక్తిని ఇస్లాం చాలా ప్రాముఖ్యత ఇస్తుంది మరియు గౌరవిస్తుంది. అదే విధంగా మంచి చేసిన వాడికి కూడా నేను ఫలానా వ్యక్తికి సహాయం చేశాను అని నలుగురిలో చెప్పుకోకూడదు అని ఉపదేశిస్తుంది.

1. షైఖ్ తూసీ, అమాలీ, భాగం1, పేజీ501, హదీస్1097.
أَخْبَرَنَا جَمَاعَةٌ، عَنْ أَبِي الْمُفَضَّلِ، قَالَ: حَدَّثَنِي أَبُو شَبَّةَ سَنَةَ سِتَّ عَشْرَةَ وَ ثَلَاثِ مِائَةٍ، وَ فِيهَا مَاتَ (رَحِمَهُ اللَّهُ)، قَالَ: حَدَّثَنَا إِبْرَاهِيمُ بْنُ سُلَيْمَانَ النِّهْمِيُّ، قَالَ: حَدَّثَنَا أَبُو حَفْصٍ الْأَعْشَى، عَنْ زِيَادِ بْنِ الْمُنْذِرِ، عَنْ مُحَمَّدِ بْنِ عَلِيٍّ (عَلَيْهِمَا السَّلَامُ)، عَنْ أَبِيهِ، عَنْ جَدِّهِ، قَالَ: قَالَ عَلِيٌّ (عَلَيْهِ السَّلَامُ): حَقٌّ عَلَى مَنْ أُنْعِمَ عَلَيْهِ أَنْ يُحْسِنَ مُكَافَاةَ الْمُنْعِمِ، فَإِنْ قَصُرَ عَنْ ذَلِكَ وُسْعُهُ فَعَلَيْهِ أَنْ يُحْسِنَ الثَّنَاءِ، فَإِنَّ كَلَّ عَنْ ذَلِكَ لِسَانُهُ فَعَلَيْهِ بِمَعْرِفَةِ النِّعْمَةِ وَ مَحَبَّةِ الْمُنْعِمِ بِهَا، فَإِنْ قَصُرَ عَنْ ذَلِكَ فَلَيْسَ لِلنِّعْمَةِ بِأَهْلٍ.
2. అల్లామా మజ్లిసీ, బిహారుల్ అన్వార్, భాగం10, పేజీ113.
إذا اُخِذَت مِنكَ قَذاةٌ فَقُلْ : أماطَ اللّهُ عنكَ ما تَكرَهُ
3. షైఖ్ సదూఖ్, మన్ లా యహ్జుర్, భాగం2, పేజీ622, 623.
الإمامُ زينُ العابدينَ عليه السلام : أمّا حَقُّ ذِي المَعروفِ علَيكَ فأن تَشكُرَهُ و تَذكُرَ مَعروفَهُ ، و تُكسِبَهُ المَقالَةَ الحَسَنَةَ ، و تُخلِصَ لَهُ الدعاءَ فيما بينَكَ و بينَ اللّه ِ عَزَّ و جلَّ ، فإذا فَعَلتَ ذلكَ كنتَ قد شَكَرتَهُ سِرّا و عَلانِيَةً ، ثُمّ إن قَدَرْتَ على مُكافَأتِهِ يَوما كافَيتَهُ

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 33