ఆదినుంచే మంచి శిక్షణ

శని, 03/02/2019 - 19:08

పిల్లలకు లోకజ్ఞానంతో పాటు మతసంబంధిత జ్ఞానాన్ని కూడా అందించటం తల్లితండ్రుల కర్తవ్యం ఒకవేళ అలా చేయనిచో వారు ఆ దేవుని వద్ద జవాబుదారులవుతారు.

ఆదినుంచే మంచి శిక్షణ

తమ సంతానం యొక్క విద్యకు మెరుగులు దిద్దటమే తల్లితండ్రుల కర్తవ్యం అని అనుకుంటారు కానీ దానితో పాటు పిల్లలకు మతపరమైన శిక్షణ అవసరం లేదా? అని మనల్ని మనము ప్రశ్నించుకోవటం అవసరం, ఏ విద్యైతే ఆ దేవుని వద్దకు చేర్చుతుందో ఆ విద్యను మించిన విద్య లేదు, పరమాత్మ చెంతకు చేర్చని విద్య కూడా ఒక విద్యేనా? అందువలనే చిన్న నాటినుండే విద్యతో పాటు కూడా పిల్లలకు మతపరమైన జ్ఞానం, పద్దతులు  వారికి అలవర్చాలని ఇస్లాము తాకీదు చేస్తుంది, ముఖ్యంగా నమాజు లాంటి ఆరాధనల విషయంలో చిన్న నాటినుండే వారికి దాని పద్ధతిని మరియు దాని ప్రాముఖ్యతను వివరించాలని చెబుతుంది.
ఇమాం బాఖిర్[అ.స]ల వారు ఈ విధంగా సెలవిస్తున్నారు: “ఎప్పుడైతే మీ పిల్లవానికి మూడు సంవత్సరాలు నిండుతాయో వాడితో ఏడు సార్లు “లా ఇలాహ ఇల్లల్లాహ్” చెప్పమని చెప్పండి(నేర్చుకొనుట కొరకు), నాలుగేళ్లు నిండిన తరువాత వాడితో ఏడుసారు “మొహమ్మదుర్ రసూలుల్లాహ్” చెప్పమని చెప్పండి (నేర్చుకునెంత వరకు), ఐదేళ్ళు నిండిన తరువాత వాడిని ఖిబ్లా దిక్కును పరిచయం చేయండి తరువాత (అటువైపు) సజ్దా(సాష్టాంగ నమస్కారం) చేయమని చెప్పండి, ఆరెళ్ళు నిండిన తరువాత సజ్దా మరియు రుకూ(నమజులో మోకళ్ళపై చెతులను ఉంచి వంగడం)లను సరిగా చేసేటట్లు నేర్పండి, ఏడేళ్ళు నిండిన తరువాత ముఖాన్ని, కాళ్ళూ చేతులు కడిగిన తరువాత (ఇప్పుడు)నమాజు చేయమని ఆదేశించండి”.

రెఫరెన్స్:మకారిముల్ అఖ్లాఖ్,పేజీ నం:115.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
13 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 29