హసద్ ఎంత ప్రమాధకరమైన లక్షణం మరియు దాని ప్రభావం ఏమిటి అన్న అంశం పై హదీసుల నిదర్శనం...
ఇతరులకు అల్లాహ్ తరపు నుండి ప్రసాదింబడ్డ అనుగ్రహాలను, నేమతులను చూసి ఆ అనుగ్రహాల వల్ల వారి పట్ల అసూయ పడడం ఇది నిజానికి అల్లాహ్ యొక్క జ్ఞానం మరియు ప్రవీణత పట్ల వ్యతిరేకత అందుకే హసద్ ఒక రకమైన కనిపించని(చిన్న) అవిశ్వాసం మరియు షిర్క్ అని ఉలమాలు భావిస్తారు. హసద్ మరియు ఈర్ష్య ఇమామ్ అలీ(అ.స) దృష్టిలో ఒక రోగం అది కూడా సాధారణమైన రోగం కాదు, అతి చెడ్డ రోగం వారు ఇలా ఉపదేశించారు: “హసద్ నైతిక పరంగా చాలా చెడ్డ రోగం”. మరో చోట వారు హసద్ ను నీఛమైన లక్షణాలుకు కారణం అని ఉపదేశించారు: “నీఛలక్షణాల మూలం హసద్”
మరో చోట హసద్ గుణాన్ని ఉద్దేశించి దానిని ఇమామ్ ఇలా ప్రశంసించారు: “శబాష్ హసద్! ఎంత న్యాయపరంగా ఉంటుందో, ముందుగా దాని యజమాని వద్దకే వెళుతుంది మరియు అతడిని చంపుతుంది” ఇమామ్(అ.స) హసద్ యొక్క ఫలితం ఇహలోకంలోనే కష్టాల రూపంలో దక్కుతాయి అని ఉపదేశించారు: “హసద్ యొక్క పండ్లు(ఫలితం) ఇహపరలోక కష్టాలు”.
మని ఒక వైపు పుణ్యం చేస్తూ మరో వైపు ఇతరుల పట్ల ఈర్ష్య కలిగి ఉంటే అతడి పుణ్యాలు అగ్నికి ఆహుతి అవుతాయి అని దైవప్రవక్త(స.అ) ఉపదేశించారు: “హసద్ పుణ్యాన్ని నిప్పు కట్టెలను తినే విధంగా తినేస్తుంది” అంటే హసద్ పుణ్యాలను నాశనం చేస్తుంది.
మరో చోట దైవప్రవక్త(స.అ) ఇలా ఉపదేశించారు: “అల్లాహ్ లెక్కతీసుకోక ముందే నరకానికి వెళ్ళే గుంపులు ఆరు ఉన్నాయి” వారు ఎవరు దైవప్రవక్తా! అని ప్రశ్నించగా దైవప్రవక్త(స.అ) వాళ్లకు ఇలా సమాధానమిచ్చారు:
1. అధికారులు అన్యాయం మరియు అధర్మం వలన,
2. అరేబీయులు పక్షపాతం వలన,
3. పెద్దలు మరియు నాయకులు గర్వం వలన,
4. వ్యాపారవేత్తలు మోసం మరియు అవినీతి వలన,
5. గ్రామస్తులు అజ్ఞానం వలన మరియు
6. జ్ఞానులు హసద్ వలన.
ఇస్లాం స్వచ్చమైనది మరియు ఈమాన్ పవిత్రమైనది ఇవి మనిషిలో ముందు నుండి ఉండవు, ఇవి మనిషి యొక్క ఆలోచనల మరియు విశ్వాసం యొక్క లోపం వల్ల వస్తాయి, అందుకే దైవప్రవక్త(స.అ) ఇలా ఉల్లేఖించారు: “త్వరలోనే (ఇతర) ఉమ్మత్తుల అతి పెద్ద రోగం నా ఉమ్మత్ ను చుట్టుముడుతుంది!. ఉమ్మత్తుల యొక్క ఆ పెద్దరోగం ఏమిటి? అని ప్రశ్నించగా దైవప్రవక్త(స.అ) ఇలా సెలవిచ్చారు: “కామాతురము, మోహం, అత్యాస, ప్రాపంచిక పోటి, విరోధం, కపటం, ఇతరుల పట్ల ఈర్ష్య(హసద్). వీళ్ళ పరిణామం; అన్యాయానిక గురయ్యి ఆ తరువాత అస్తవ్యస్తతతకు గురవుతారు.
హసద్ నైతిక పరంగా చాలా చెడు లక్షణం. అది మనిషిని నాశనం చేసేస్తుంది. ఇహపరలోకాలలో వాటి ప్రభావం ఉంటుంది. మనిషి విశ్వాసం తగ్గితే హసద్ అతడి చెంతకు చేరుతుంది ఇక హసద్ చేరిందంటే మనిషి ఇహపరలోకాలు ప్రభావితమైనట్లే ఎందుకంటే వీటి మధ్య సంబంధం ఉంది కాబట్టి. ఇమామ్ జాఫరె సాదిఖ్(అ.స) ఇలా ఉపదేశిస్తున్నారు: దీన్ మరియు ఈమాన్ యొక్క ఆపద (ఈ మూడింటిలో ఉంది) హసద్, గర్వం మరియు బడాయి.
మరో చోట ఇలా రివాయత్ ఉల్లేఖించబడి ఉంది: ప్రవక్త హజ్రత్ మూసా(అ.స) అల్లాహ్ ను ప్రార్ధిస్తున్న సమయంలో వారి దృష్టి ఒక వ్యక్తి పై పడింది, ఆ వ్యక్తి పై నింగి యొక్క నీడ పడుతుంది. అప్పుడు హజ్రత్ మూసా(అ.స) అల్లాహ్ తో “యా అల్లాహ్! నీ నింగి ఇతనిని నీడనిస్తుంది, ఎవరితను?” అని ప్రశ్నించారు. అల్లాహ్ ఇలా సమాధానమిచ్చెను: “ఓ మూసా! అల్లాహ్ అతనికి ప్రసాదించకుండా ఇతరులకు ప్రసాదించినా కూడా తోటి మానవుల పట్ల ఈర్ష్య(హసద్) చెందని వారిలో ఒకడు.[1].
“హసద్” యొక్క చెడును, ప్రభావాలను, ఫలితాలను వివరిస్తూ చాలా రివాయత్లు ఉల్లేఖించబడి ఉన్నాయి. ఇక్కడ మేము వాటి నుండి కొన్నింటిని మాత్రమే ప్రదర్శించాము.
ఈ కొన్ని హదీసులను బట్టి తెలిసే విషయమేమిటంటే మనిషి హసద్ ద్వార తనను తానే నాశనం చేసుకుంటున్నాడు. ఇక్కడి జీవితమే కాకుండా పరలోక జీవితాన్ని కూడా నాశనం చేసుకుంటున్నాడు.
రిఫ్రెన్స్
మకారిమ్ షీరాజీ, ఉలమాల సమూహం, అఖ్లాఖ్ దర్ ఖుర్ఆన్, భాగం2, హసద్ అధ్యాయం, ఇంతెషారాతె ఇమామ్ అలీ ఇబ్నె అబీతాలిబ్(అ.స), 3సంపుటం, 1378ష.
వ్యాఖ్యానించండి