హైౙ్ యొక్క అర్థం మరియు దానికి సంబంధించిన కొన్ని అంశాల వివరణ ప్రశ్నల రూపంలో...
హైౙ్ రక్తం (ఋతు రక్తము) ఇది స్త్రీలకు సంబంధించిన అంశం. ఇక్కడ దాని గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం.
ఖుర్ఆన్ లో దీని గురించి చెప్పబడి ఉంది, హజ్రత్ ముహమ్మద్(స.అ) యొక్క హదీసులో దాని గురించి ఉంది మరియు పవిత్ర మాసూములు(స.అ) తమ సహచరులకు ఇస్లాం అహ్కాములు వివరిస్తూ దాని గురించి బోధించారు. దీని గురించి ఇస్లాం ఆదేశాలనుసారం తెలిసుకోవడం అవసరం.
హైౙ్ కు కారణం
హైౙ్ రక్తం, స్ర్తీలకు తొమ్మిదవ ఏట నుండి యాభై ఏళ్ల వయస్సు వరకు వచ్చేటువంటి రక్తం. ఈ రక్తం దాదాపు ప్రతీ నెల ఒక ఖచ్చిత సమయంలో వస్తుంది. హైౙ్ రక్తం దాదాపు నల్ల లేదా ఎరుపు రంగులో మరియు వేడిగా ఉంటుంది, అందులో మంట ఉంటుంది, వేగంగా బయటకు వస్తుంది మరియు ఒక్కోసారి దీనికి విరుద్ధంగా కూడా జరుగుతుంది.
ప్రశ్న: హైౙ్ రక్తం వచ్చే స్ర్తీల వయస్సు నిశ్చితమై ఉంటుందా?
సమాధానం: ఔను, స్ర్తీ ఖమరీ సంవత్సరం ప్రకారం తొమ్మిది సంవత్సరాల వయసుకు చేరినప్పటి నుండి ఖమరీ సంవత్సరం ప్రకారం అరవై సంవత్సరాల వయసు వరకు, ఎందుకంటే స్ర్తీ అరవై సంవత్సరాల వయసులో “యాయిసహ్” అనబడుతుంది.
ప్రశ్న: అయితే హైౙ్ రక్తం వచ్చే స్ర్తీలు 9 నుండి 60 సంవత్సరాల మధ్యలో ఉంటారా?
సమాధానం: ఔను, తొమ్మిది సంవత్సరాలు పూర్తవని అమ్మాయి ఒక వేళ ఒక్క క్షణం రక్తాన్ని చూసినా, ఆ రక్తం హైౙ్ రక్తం కాదు. అలాగే 60 ఏళ్ల తరువాత రక్తం వచ్చినా అది కూడా హైౙ్ రక్తంగా భావించకూడదు.
ప్రశ్న: హైౙ్ రక్తం ఎన్ని రోజుల వరకు వస్తుంది?
సమాధానం: హైౙ్ రక్తం కనీసం మూడు రోజుల గడువులో రెండు రాత్రుళ్లు, మరియు పది రోజులకు దాటదు.
ప్రశ్న: ఒకవేళ మూడు రోజుల కన్నా తక్కువ రోజులు వచ్చినా లేదా మధ్యలో ఆగిపోయినా సరే అది హైౙ్ స్థితి గానే భావించాలా?
సమాధానం: అయితే ఆ రక్తం హైౙ్ రక్తం కాదు.
ప్రశ్న: ఒకవేళ పదిరోజులకు మించి పోతే?
సమాధానం: హైౙ్, పదిరోజులకు మించి రాదు.
ప్రశ్న: ఒకవేళ హైౙ్ యొక్క సమయం పూర్తయి స్ర్తీ పవిత్రమైన ఏడు రోజుల తరువాత మరో సారి రక్తం వచ్చినట్లైతే ఏమి చేయాలి?
సమాధానం: ఈ రక్తం, హైౙ్ రక్తం కాదు, ఎందుకంటే రెండు హైౙ్ ల మధ్య వ్యవధి ఎప్పుడు కూడా పది రోజులకు తక్కువ ఉండదు.
ప్రశ్న: స్ర్తీ ఎప్పుడు తనను హాయిౙ్ అని భావిస్తుంది?
సమాధానం: హైౙ్ రక్తం తన నిశ్చిత కాలంలో వచ్చినప్పుడు, లేదా నిశ్చిత కాలం నుండి కొంచెం ముందుగా వచ్చినా ఉదాహారణకు ఒకరోజు లేదా రెండు రోజులు ముందు రక్తం వస్తే ఆ స్ర్తీ తనను హాయిజ్‌గా భావిస్తుంది.
ప్రశ్న: స్ర్తీ ఎప్పుడు ఆదతె వఖ్తియా(సమయం అలవాటు గల స్ర్తీ) అవుతుంది?
సమాధానం: ఎప్పుడైతే హైౙ్ రక్తం రెండు నెలలలో రెండు సార్లు నిశ్చిత సమయంలో వచ్చినప్పుడు, ఆ స్త్రీని ఆదతె వఖ్తియా(సమయానికి అలవాటు పడిన స్ర్తీ)గా అనబడుతుంది.
ప్రశ్న: ఒక స్ర్తీకు నిశ్చిత కాలం లేదా సమయం లేకపోతే, ఉదాహారణకు మొదటి సారి రక్తం వచ్చిన అమ్మాయి, లేదా నిశ్చిత అలవాటు లేని ముజ్తరిబా(స్థిరత్వం లేని/స్థిమితం లేని) స్త్రీ తనను ఎప్పుడు హాయిజ్ గా భావించగలదు?
సమాధానం: ఎప్పుడైతే రక్తంలో హైౙ్ యొక్క పూర్తి లక్షణాలు ఉంటాయో, ఉదాహారణకు రక్తం నలుపు లేదా ఎరుపు రంగులో ఉండడం, వేడిగా ఉండడం, మంట మరియు వేగంగా బయటకు రావడం. రక్తాన్ని చూసినప్పుడు ఆమెకు ఈ రక్తం మూడు రోజులు లేదా ఎక్కువ రోజుల వరకు వస్తుంది అని నమ్మకం కలిగినప్పుడు.
ప్రశ్న: పై చెప్పిన వాటి ద్వార స్ర్తీ తనను హాయిౙ్ గా భావించి, ఆమె నమాజ్ చదవలేదు కాని రక్తం మూడు రోజుల కు ముందే ఆగిపోయింది, దాంతో ఆమెకు తెలిసొచ్చింది ఈ రక్తం హైజ్ రక్తం కాదు అని ఆ సమయంలో ఆమె ఏమి చేస్తుంది?
సమాధానం: ఆ సమయంలో చదవని నమాజులను తప్పకుండా ఖజా చేయాలి (చదవాలి).
రిఫరెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ముతహ్హిరాత్ అధ్యాయం, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి