నిఫాస్

బుధ, 02/28/2024 - 16:45

నిఫాస్ మరియు నఫసా మరియు వీటికి సంబంధించిన కొన్ని సమస్యల సంక్షిప్త వివరణ...

నిఫాస్

ప్రశ్న: నిఫాస్ అంటే ఏమిటి?
సమాధానం: స్ర్తీకు కాన్పు సమయంలో లేదా కాన్పు తరువాత, కాన్పు కారణంగా వచ్చే రక్తం. ఆ రక్తం వచ్చే కాలంలో ఆ స్ర్తీను “నఫసా” అని అంటారు.

ప్రశ్న: నిఫాస్ ఎన్ని రోజులు ఉంటుంది?
సమాధానం: పది రోజులకు మించి ఉండదు.

ప్రశ్న: కనీసం ఎన్ని రోజులు ఉంటుంది?
సమాధానం: దానికి పరిమిత కాలం లేదు ఒక్కోసారి ఒక్క నిమిషం కూడా ఉండోచ్చు, ఒక్కోసారి అయి దాని కన్నా తక్కువ సమయం.

ప్రశ్న: స్ర్తీలలో నిఫాస్ యొక్క వివిధ రకాలు ఉంటాయా?
సమాధానం: నిఫాస్ స్థితిలో ఉన్న స్ర్తీలు మూడు రకాలు. ప్రతీ ఒక్కరికీ వేర్వేరు ఆహ్కాములు ఉన్నాయి. నిఫాస్ రక్తం పది రోజులకు మించని స్ర్తీ.

ప్రశ్న: ఈ స్ర్తీ పట్ల ఆదేశమేమిటి?
సమాధానం: పూర్తిగా నిఫాస్ రక్తంగా భావించాలి.

ప్రశ్న: నిఫాస్ రక్తం పది రోజులకు మించి పోతే మరియు ఆ స్ర్తీ తన హైజ్ స్థితి పరిమిత రోజుల ప్రకారంగా ఉండి ఉంటే అనగా ఆ స్ర్తీకు ప్రతీ నెల ఐదు రోజులు హైజ్ వస్తుంది. ఇలాంటి స్ర్తీ గురించి ఏ ఆదేశం ఉంది?
సమాధానం: ఆమె తన నెలసరి పరిమిత రోజులను నిఫాస్ గా భావించాలి, ఇంతకు ముందు ఉదాహారణలో ఐదు రోజుల గురించి చెప్పినట్లు వాళ్లు ఆ ఐదు రోజులను నిఫాస్ గా నిర్థారించాలి.

ప్రశ్న:  మిగిలిన రోజులు ఏమైనట్లు?
సమాధానం: మిగిలిన రోజులను ఇస్తిహాజా గా నిర్ధారించుకోవాలి.

ప్రశ్న: రక్తం పది రోజులకు మించి వస్తుంది మరియు హైజ్ విషయంలో ఆమె పరిమిత కాలం కూడా కాదు, ఇలాంటి స్ర్తీ ఏమి చేయాలి?
సమాధానం: ఆమె పది రోజులను నిఫాస్ గా భావించాలి.

ప్రశ్న: నఫసా(నిఫాస్ రక్తం వస్తున్న స్ర్తీ) హైజ్ విషయంలో అలవాటు స్థితిలో ఉంది మరియు ఆమెకు రక్తం వచ్చే కాలాన్ని మించి రక్తం వస్తుంది మరియు ఆమెకు ఇంకా తెలియదు ఈ రక్తం పది రోజులకు ముందే ఆగిపోతుందా లేక పది రోజుల తరువాత కూడా వస్తూనే ఉందా అని, ఇలాంటి పరిస్థితిలో ఆమె ఏమి చేయాలి?
సమాధానం: ఇలాంటి స్త్రీ 10 రోజుల వరకు ఆరాధనలు చేయకుండా ఉండవచ్చు, ఆ తరువాత ఒకవేళ రక్తం ఆగిపోతే ఈ గడిచిన కాలంమంతా నిఫాస గడువుగా భావించాలి. ఒకవేళ రక్తం పది రోజులకు మించి పోయి ఉంటే గుస్లె చేసి ఆ తరువాత నుండి ముస్తహాజా ఆదేశాల ప్రకారం అమలు చేయాలి.

ప్రశ్న: ఆమె యొక్క అలవాటు మరియ పది రోజుల మధ్య వచ్చిన అంతరం మరియు అందులో మానేయబడిన ఆరాధనల గురించి ఉన్న ఆదేశమేమిటి?
సమాధానం: ఆ అంతర కాలాన్ని ఆమె ఇస్తిహాజా గా నిర్ధారించాలి మరియు విదిలేసిన ఆరాధనలను ఖజా చేయాలి.

ప్రశ్న: ఒకవేళ మొదటి రోజు రక్తం వచ్చి ఆగిపోయి రెండవ సారి పదోవ రోజు లేదా పదోవ రోజుకు ముందే ఏదో ఒకరోజు రక్తం వచ్చినట్లైతే, ఏమి చేయాలి?
సమాధానం: ముందు వచ్చిన రక్తం మరియు రెండవ సారి వచ్చిన రక్తం ఈ రెండూ కూడా నిఫాస్ గా భావించాలి.

ప్రశ్న: ఈ రెండింటి మధ్య ఉన్న అంతరం పట్ల ఆదేశం ఏమిటి?
సమాధానం: ఆ రోజుల్లో నిఫాస్ నుండి శుభ్రమైన తరువాత చేసే ఆమాల్ మరియు నిఫాస్ స్థితిలో ఖచ్చితంగా చేయకూడని ఆమాలులను సంగ్రహించాలి.

ప్రశ్న: ఒకవేళ రక్తం ఆగిపోయి మరలా మొదలై, మరలా ఆగిపోయి మరలా తిరిగి మొదలై, ఈ క్రమం ఇలాగే కొనసాగుతూ ఉంది, అయితే ఇవన్నీ పదిరోజులకు మించకుండా ఉంటే ఏమి చేయాలి?
సమాధానం: రక్తం వచ్చిన రోజులన్నీ నిఫాస్ గా భావించాలి మరియు శుభ్రంగా ఉన్న రోజులు, అందులో ఆమె శుభ్రంగా ఉన్న స్ర్రీ మరియు నఫసా(నిఫాస్ స్థితిలో ఉన్న స్ర్తీ) చేయకూడని ఆమాల్ లను కలిపి చేయాలి. 

ప్రశ్న: నిఫాస్ పూర్తయిన తరువాత మరలా రక్తం చూస్తే ఏమి చేయాలి?
సమాధానం: నిఫాస్ తరువాత ఆమెకు పది రోజుల లోపు రక్తం కనిపిస్తే, ఆ రక్తం ఇస్తిహాజా రక్తం; ఇక ఆ రక్తంలో హైజ్ రక్తం లక్షణాలు కనబడిన లేదా కనబడకపోయినా సరే, ఆమె అలవాటు రోజులు ఉన్నా లేదా లేక పోయినా.

ప్రశ్న: నఫసా పై ఏ అహ్కాములు జారి అవుతాయి?
సమాధానం: హైజ్ రక్తం వచ్చినప్పుడు జారి అయ్యే అహ్కాములే నఫసా పై కూడా జారీ అవుతాయి; ఆ అహ్కాములు వాజిబ్ అహ్కాములు కానివ్వండి లేదా హరామ్ అహ్కాములు కానివ్వండి, లేదా మక్రూహ్ అహ్కాముల నుండి కానివ్వండి (చివరికి అజాయిమ్ సూరహ్ ల సజ్దా ఆయతులను పఠించడం, మస్జిదుల్ హరామ్ మరియు మస్జిదె నబవీ(అ.స)లో ప్రవేశించడం, అది కూడా ఒక ద్వారం నుండి ప్రవేశించి మరో ద్వారం నుండి బయటకు వెళ్లి పోవాలనుకున్నా, ఇతర మస్జిదులలో ఆగడం లేదా వాటిలో ఏదైనా పెట్టడానికి వెళ్లడం హరామ్ గా నిర్ధారించబడిన చర్యలు) హైజ్ చర్చలో చూడగలరు.

రిఫరెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ముతహ్హిరాత్ అధ్యాయం, ఫార్సీ అనువాదం.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
4 + 10 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 20