ఒక విశ్వాసి మరణించిన తరువాత చేయాల్సిన వాటిలో వాజిబ్ చర్యలలో ఒకటి గుస్లె మయ్యత్...
ఒక ముస్లిం ను చివరి గడియాలలో చూస్తే భయాన్ని ప్రక్కన పెట్టి అతడి ముఖం ఖిబ్లా తరపు త్రిప్పాలి.
ప్రశ్న: అతడిని ఖిబ్లా వైపుకు త్రిప్పాలి అంటే ఎలా త్రిప్పాలి?
సమాధానం: అతడిని వీపు పై పడుకోబెట్టి అతడి అరికాళ్లను ఖిబ్లా వైపుకు ఉంచాలి.
ప్రశ్న: అంటే అతడి కాళ్లను ఖిబ్లా వైపుకు సాగదీసి పెట్టాలి, అంతేనా?
సమాధానం: ఔను మంచి పద్ధతిలో చేయాలి, ఆ చనిపోయేవాడు పురుషుడైనా లేదా స్ర్తీ అయినా, చిన్నోడైనా లేదా పెద్దోడైనా సరే. వారితో కలెమ-ఎ-షహాదతైన్ చదవమని చెప్పడం, వారి నుండి దైవప్రవక్త(స.అ) మరియు అహ్లెబైత్(అ.స) ల ఇమామత్ స్వీకరణ తీసుకోవడం, ఆ గడియాలు సులభంగా గడిచిపోవాలని వారి వద్ద సాఫ్పాత్ సూరహ్ ను పఠించడం లాంటివి ముస్తహబ్. ముజ్నిబ్ మరియు హాయిజ్ స్థితిలో ఉన్నవారు అక్కడ ఉండడం మరియు అతడిని ముట్టుకోవడం మక్రూహ్.
ప్రశ్న: అతడు మరణించిన తరువాత ఏమి చేయాలి?
సమాధానం: అతడి కళ్లను మరియు నోరును మూయడం, అతడి రెండు చేతులను అతడి రెండు వైపులకు మరియు కాళ్లను నిఠారుగా చేయాడం మరియు అతడిని గుడ్డతో కప్పడం, అతడి వద్ద ఖుర్ఆన్ పఠించడం, మృతుడు ఉన్న చోట వెలుతురు ఉండే విధంగా చూడడం, అంతిమ యాత్రలో వచ్చేందుకు విశ్వాసులకు అతడి మరణ వార్త తెలియపరచడం, ఒకవేళ అతడి మరణం పట్ల సందేహం లేకపోతే అతడిని పూడ్చడంలో త్వరపడాలి లేకపోతే వేచి వుండాలి.
ప్రశ్న: అతడి మరణం లో సందేహం ఉంటే?
సమాధానం: ఇలాంటి పరిస్థితిలో అతడి మరణం పై నమ్మకం కలిగేంత వరకు వేచి ఉండడం అవసరం(వాజిబ్). ఎప్పుడైతే నీకు నమ్మకం కలుగుతుందో ఆ తరువాత అతడిని గుస్ల్ ఇవ్వడం అవసరం(వాజిబ్), ఆ మృతుడు పురుషుడు అయినా సరే లేదా స్ర్తీ అయినా, చిన్నోడు అయినా సరే లేదా పెద్దోడు అయినా సరే.
ప్రశ్న: ఒకవేళ బిడ్డ గర్భంలోనే చనిపోతే?
సమాధానం: చివరికి గర్భంలో నాలుగు నెలలు పూర్తి చేసుకున్న(నాలుగు నెలలు పూర్తి కాకపోయినా అతడి సృష్టి పూర్తయితే చాలు) బిడ్డ చనిపోయినా(గుస్ల్ ఇవ్వడం అవసరం) అయితే ఆ పసివాడి పై జనాజా నమాజ్ చదవడం వాజిబ్ కాదు అలాగే ముస్తహబ్ కూడా కాదు.
ప్రశ్న: మృతుడికి గుస్ల్ ఎవరు చేయిస్తారు?
సమాధానం: పురుషుడికి పురుషుడు గుస్ల్ ఇవ్వాలి, మరియు స్ర్తీకి స్ర్తీ గుస్ల్ ఇవ్వాలి. అయితే భార్యభర్తలు ఒకరినొకరు గుస్ల్ ఇవ్వడం సమ్మతమైనది. అలాగే మంచిచెడ్డలు అర్థం చేసుకోగల వయసు గల బాబు లేదా పాప(ఎవరైనా కానివ్వండి) వారిని కూడా పురుషుడు లేదా స్ర్తీ ఎవరో ఒకరు గుస్ల్ చేయించగలరు, అలాగే మహ్రమ్ విషయంలో కూడా తన జాతి(మగాడు లేదా ఆడది) వాడు లేనిచో తన జాతికి వ్యతిరేకమైన మహ్రమ్ ను గుస్ల్ చేయించగలడు (తన జాతి వాడు లేని సమయంలో మాత్రమే)
ప్రశ్న: మృతదేశానికి ఎన్ని సార్లు మరియు ఎలా గుస్ల్ స్నానం చేయించాలి?
సమాధానం: మూడు గుస్ల్ స్నానాలు చేయించాలి.
మొదటిది గుస్ల్ స్నానం రేగు ఆకులతో కలిపి చేయించాలి, దీనిని గుస్లె ఆబె సిద్ర్ అంటారు.
రెండవది కర్పూరపు నీళ్లతో దీనిని గుస్లె ఆబె కాఫూర్ అంటారు.
మూడవది స్వచ్ఛమైన నీళ్లతో దీనిని గుస్లె ఆబె ముత్లఖ్ అంటారు.
ఈ విధంగా గుస్ల్ స్నానం చేయించాలి; ముందుగా తలా మరియు మెడను కడగాలి, ఆ తరువాత శరీరం యొక్క కుడి వైపు ఆ తరువాత శరీరం యొక్క ఎడమ వైపు కడగాలి. గుస్ల్ కోసం ఉపయోగించే నీళ్లు శుభ్రంగా ఉండాలి, నజిస్ అయి ఉండకూడదు, ముబాహ్ అయి ఉండాలి కబ్జా చేయబడినది అయి ఉండకూడదు, ముత్లఖ్ అయి ఉండాలి ముజాఫ్ నీళ్లు అయి ఉండకూడదు అలాగే రేగు ఆకులు మరియు కర్పూరం కూడా ముబాహ్ అయి ఉండాలి.
ప్రశ్న: గుస్ల్ సమయంలో మృతుడి బట్టలు విప్పి వేయాలా లేక అలాగే ఉంచేయాలా?
సమాధానం: బట్టలతో పాటు గుస్ల్ ఇవ్వ వచ్చు అయితే బట్టలు విప్పేయడమే మంచిది.
ప్రశ్న: కర్పూరం మరియు రేగు ఆకులు నీళ్లలో కలపడం వాజిబ్ అయినప్పుడు ఆ నీళ్లు ముత్లఖ్ నీళ్లు ఎలా అవుతాయి?
సమాధానం: కర్పూరం మరియు రేగు ఆకులు నీళ్లను ముజాఫ్ నీళ్లుగా మారిపోనంతగా మాత్రమే కలపాలి.
ప్రశ్న: ఒకవేళ గుస్ల్ మధ్యలో మృతుడి దేహం, బయట మురికి(నజిబ్) ద్వారా లేదా మృతుడి మురికి(నజాసత్) ద్వారా నజిస్ అయితే ఏమి చేయాలి?
సమాధానం: శరీరంలో నజిస్ అయిన భాగాన్ని శుభ్రపరచడం వాజిబ్, మరో సారి గుస్ల్ చేయించడం వాజిబ్ కాదు.
రిఫరెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ముతహ్హిరాత్ అధ్యాయం, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి