గుస్లె మస్‌హె మయ్యత్ మరియు ఇద్దత్ కు సంబంధించిన కొన్ని అంశాల సంక్షిప్త వివరణ...
ప్రశ్న: గుస్లె మసె మయ్యత్ ఎప్పుడు చేయాలి?
సమాధానం: ఔను! మృతదేహం చల్ల బడిన తరువాత మరియు గుస్లె మయ్యత్ కు ముందు ఎవరైనా మృతదేహాన్ని ముట్టుకుంటే ఆ మృతదేహం ఒక ముస్లిముదు కానివ్వండి లేదా ఒక అవిశ్వాసునిది కానివ్వండి; గుస్లె మసె మయ్యత్ వాజిబ్ అవుతుంది.
ప్రశ్న: మృతదేహం తడిగా ఉంటే ఈ గుస్ల్ వాజిబ్ అవుతందా? ఒకవేళ మృతదేహం పొడిగా ఉండి ముట్టుకునే వాడి చేయి కూడా పొడిగా ఉంటే ఏమి చేయాలి?
సమాధానం: తడిగా ఉన్నా లేకపోయిన, నిస్సహాయ స్థితిలో ముట్టుకున్నా లేదా ఉద్దేశపూర్వకంగా ముట్టుకున్నా గుస్ల్ వాజిబ్ అవుతుంది.
ప్రశ్న: మృతదేహాన్ని ముట్టుకున్న వాడి పై ఏ ఏ అంశాలు లాగూ అవుతాయి?
సమాధానం: అతడు తప్పని సరిగా చేయవలసిన చర్యలు:
1. తహారత్ షరతుగా ఉన్న ఆరాధనలు ఉదాహారణకు నమాజ్; వాజిబ్ గుస్ల్ ను నిర్వర్తించాలి. అంటే నమాజ్ చదవాలనుకున్నప్పుడు ముందు ఈ గుస్ల్(గుస్లె మసె మయ్యత్) ను చేసి నమాజ్ చదవాలి.
2. ఖుర్ఆన్ మజీద్ యొక్క అక్షరాలను తాకడం మరియు మొహ్దస్ పై తాకడం హరామ్ గా నిర్దారించబడిన ప్రతీ దానిని ముట్టుకోవడం.
మరికొన్ని ముఖ్యంశాలు:
భర్త మరణించిన తరువాత అతడి భార్య పై ఇద్దత్ గడువు ను పాటించడం వాజిబ్ అవుతుంది, ఆ భార్యకు తన భర్తతో సంభోగం జరగకపోయినా సరే. గర్భిణీ కాని స్ర్తీల ఇద్దత్ గడువు 4 నెలల 10 రోజులు, ఇద్దత్ కోసం స్ర్తీ బాలిగహ్ (యవ్వన వయసు) మరియు ఆఖిలహ్ (బుద్ధిమంతురాలు) అయి ఉండడం అవసరం. ఇద్దత్ గడువులో ఆమె తన శరీర అలంకరణ మరియు దుస్తుల అలంకరణ చేయకూడదు, అలాగే రంగు రంగుల బట్టలు ధరించడం ఆమె పై హరామ్ అవుతుంది, ఉదా: ఎరుపు రంగు బట్టులు, అలాగే అబరణాలను ధరించడం, సుర్మా పెట్టుకోవడం, సుగంధాలు ఉపయోగించడం, కేశాలను రంగువేసుకోవడం, లిప్ స్టిక్ (110) పూసుకోవడం నిషిద్ధం(హరామ్). అయితే ఇద్దత్ గడుపుతున్న స్ర్తీ శరీరాన్ని శుభ్రపరుచుకోవడం, బట్టల శుభ్రత, గోళ్లు కత్తిరించుకోవడం, స్నానం చేసుకోవడం మరియు ఇంటి నుండి బయటకు వెళ్లడం, ముఖ్యంగా కర్తవ్య నిర్వాహణ(అదాయె హఖ్) లేదా తన అవసరాల క్రమంలో సమ్మతమైనది.
ప్రశ్న: గర్భిణీ స్ర్తీల ఇద్దత్ గడువు ఆదేశం ఏమిటి?
సమాధానం: గర్భిణీ స్ర్తీ యొక్క భర్త మరణిస్తే ఆమె ఇద్దత్ గడువు కాన్పు వరకు. అదే ఒకవేళ 4 నెలల 10 రోజులు పూర్తి అవ్వక ముందే కాన్పు జరిగితే 4 నెలల 10 రోజులు గడిచే వరకు వేచి ఉండాలి. ఒకవేళ 4 నెల 10 రోజుల తరువాత కాన్పు జరిగి ఉంటే ఆమె ఇద్దత్ గడువు పూర్తయినట్లే.
రిఫరెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ముతహ్హిరాత్ అధ్యాయం, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి