గుస్లె మయ్యత్ తరువాత్ మృతదేహానికి కఫన్ ఇవ్వాలి దాని గురించి సంక్షిప్త వివరణ...
ప్రశ్న: గుస్ల్ తరువాత మృతదేహాన్ని ఏమి చేయాలి?
సమాధానం: హనూత్ చేయడం మరియు కఫన్ ధరించడం వాజిబ్.
ప్రశ్న: ఈ హనూత్ అనగానేమి?
సమాధానం: మృతుడి సజ్దా చేసే సమయంలో నేలకు తగిలే ఏడు భాగాల పై తాజా మరియు సువాసనతో కూడి ఉన్న కర్పూర చూర్ణాన్ని రాయాలి. ఆ కర్పూరం ముబాహ్ అయి ఉండాలి కబ్జా చేసినది అంటి ఉండకూడదు, అది శుభ్రమైనదై ఉండాలి నజిస్ అయి ఉండకూడదు; ఒకవేళ ఆ కర్పూరం మృతదేహం నజిస్ అవ్వడానికి కారణం కాకపోయినా సరే. కర్పూరం రాయడం నొసలు నుండి మొదలు పెట్టి చేతి అరచేయి పై పూర్తి చేయాలి.
ప్రశ్న: మిగతా సజ్దా భాగాలను ఎలా రాయాలి?
సమాధానం: మిగతా భాగాలలో క్రమం అవసరం లేదు.
ప్రశ్న: మృతదేహానికి ఎలా కఫన్ ధరించాలి?
సమాధానం: మృతదేహానికి మూడు గుడ్డలతో కఫన్ చర్యను అమలు పరచడం వాజిబ్.
1. లుంగీ: ఈ లుంగీ బొడ్డు నుండి మోకాలు మధ్య భాగాన్ని దాచిపెట్టే విధంగా ధరించడం వాజిబ్.
2. ఖమీస్(చొక్కా): ఈ ఖమీస్ భూజాల పైనుండి సగం కాలు (మోకాలు క్రింది వరకు) వరకు రావడం వాజిబ్.
3. చాదర్: ఈ గుడ్డతో పూర్తి దేహాన్ని కప్పి వేయడం వాజిబ్. ఆ గుడ్డ, రెండు వైపులు(తల భాగం వైపు మరియు కాళ్ల భాగం వైపు) ముడి పడేంత పొగుడు అయి ఉండాలి.
ప్రశ్న: ఎంత వెడల్పు అయి ఉండాలి?
సమాధానం: దాని వెడల్పు ఒక వైపు భాగం మరో వైపు భాగానికి చేరుకోవానేంత ఉండాలి.
ప్రశ్న: కఫన్ చర్యలలో ఇవి కాకుండా ఇంకా ఏమైనా షరత్తులు ఉన్నాయా?
సమాధానం: ఔను! షరత్తేమిటంటే కఫన్ బట్టలు మృతుడి పూర్తి దేహాన్ని దాచేయాలి. అవి కబ్జా చేసినవి అయి ఉండకూడదు, పూర్తిగా పట్టు బట్టలు అయి ఉండకూడదు, అలాగే బంగారపు తీగలతో నేసి ఉండకూడదు, హరామ్ మాంసం జంతువుల భాగాలతో తయారుచేసినది అయి ఉండకూడదు, కఫన్ నజిస్ అయి ఉండకూడదు అయితే మరో దారి లేకపోతే ఉపయోగించడంలో తప్పు లేదు. పై చెప్పబడిన వాటిలో తప్పని సరి పరిస్థితిలో కఫన్ ఇవ్వడం సమ్మతమే కేవలం కబ్జా చేసినది అయి ఉండకూడదు అన్న షరత్తు తప్పని సరి.
ప్రశ్న: ఒకవేళ మూడు గుడ్డలు లభించడం కష్టమైతే?
సమాధానం: ఎంత ఇవ్వగలిగితే అంత వరకు కఫన్ చర్యను అమలు పరచాలి.
రిఫరెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ముతహ్హిరాత్ అధ్యాయం, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి