గుస్ల్ యొక్క రకాలు మరియు వాటికి సంబంధించిన అహ్కాముల సంక్షిప్త వివరణ...
గుస్ల్ రెండు రకాలు:
ఇర్తిమాసీ మరియు తర్తీబీ
ప్రశ్న: ఇర్తిమాసీ దేన్నంటారు?
సమాధానం: నీ శరీనాన్ని ఒక్క సారిగా నీళ్లలో ముంచుకోవడం గుస్లె ఇర్తిమాసీ అనబడుతుంది.
ప్రశ్న: గుస్లె తర్తీబీ దేన్నంటారు?
సమాధానం: ముందుగా నువ్వు నీ తల మరియు మెడను మరియు వాటిని అతుక్కుని ఉన్న వాటిని కడగాలి. చెవులను కడగడం మరచిపోకూడదు, రెండు చెవుల బాహ్య భాగాన్ని తప్పకుండా కడగాలి, లోపలి భాగాన్ని కడగడం అవసరం లేదు.
ఆ తరువాత నువ్వు నీ శరీరం యొక్క కుడి భాగాన్ని కడుక్కోవాలి. కొంత భాగం మెడతో కలిసి ఉన్న భాగాన్ని మరియు కొంతభాగం ఎడమ వైపు ఉన్న భాగాన్ని కూడా కడుక్కోవాలి. ఆతరువాత నువ్వు నీ ఎడమ భాగాన్ని, కొంత భాగం మెడతో కలిసి ఉన్న భాగాన్ని మరియు కొంతభాగం కుడి వైపు ఉన్న భాగాన్ని కూడా కడుక్కోవాలి. తల మరియు మెడ కడుక్కున్న తరువాత శరీరాన్ని ఒక్క సారి కడుక్కోవడం సమ్మతమైనది.
ప్రశ్న: గుస్ల్ కు ఇంకేమైన షరత్తులు ఉన్నాయా?
సమాధానం: ఏ షరత్తులైతే ఉజూ లో ఉన్నాయో అవే షరత్తులు గుస్ల్ కు కూడా ఉంటాయి. 1) నియ్యత్ 2) నీళ్లు శుభ్రంగా ఉండడం 3) నీళ్లు ముబాహ్ అయి ఉండడం 4) నీళ్లు ముత్లఖ్(ఖాలిస్) అయి ఉండడం 5) శరీరం మలినం నుండి శుభ్రమై ఉండడం 6) గుస్ల్ ను తర్తీబ్(క్రమంగా) చేయాలి. ఒకవేళ గుస్ల్ చేయువాడు తన గుస్ల్ ను స్వయంగా చేసుకొనే శక్తి ఉంటే స్వయంగా చేసుకోవాలి. నీళ్ళు ఉపయోగించడం వల్ల షరా పరంగా అతడికి హాని ఉండకూడదు ఉదా: రోగం ఉండడం, ఉజూ చర్చలో దీనిని చూడగలరు.
అయితే గుస్ల్ మరియు ఉజూలో రెండు విషయాలలో తేడా ఉంది.
ప్రశ్న: ఆ రెండు విషయాలు ఏమిటి?
సమాధానం: గుస్ల్ లో ఉజూలో చెప్పిన విధంగా పై నుండి క్రిందికి కడగడం షరత్తు కాదు.
ఉజూ మాధిరి గుస్ల్ లో మవాలాత్, షరతు కాదు; అందుకని నువ్వు తల మరియు మెడ కడుక్కున్న తరువాత మిగిలిన శరీరాన్ని కొంచెం సమయం తరువాత కడుక్కోవచ్చు, అప్పుడు నీ తల ఆరిపోయినా పరవాలేదు. ఉజూలో ఉన్నట్లు; ఊజూలో నువ్వు నీ ముఖం కడుగుతున్నప్పుడు కనుబొమ్మల పై భాగాన్ని మాత్రమే కడుగుతావు అలాగే తల మస్‌హ్ చేసినప్పుడు కేవలం వెంట్రుకల పై భాగం పై మస్‌హ్ చేస్తే చాలు చర్మం వరకు నీళ్లు చేరాల్సినవసరం లేదు కాని గుస్ల్ లో వెంట్రుక క్రింద ఉన్న చర్మం వరకు నీళ్లు చేర్చడం వాజిబ్ అవుతుంది. అలాగే రెండు కనుబొమ్మలు, మీసాలు మరియు గెడ్డం యొక్క వెంట్రుకల విషయంలో కూడా ఇలానే చేయాలి, ఇది తప్పని సరి.
ప్రశ్న: ఆ తరువాత ఏమి చేయాలి?
సమాధానం: జనాబత్ గుస్ల్ తరువాత ఉజూ చేయాల్సినవసరం లేదు.
ప్రశ్న: అంటే నమాజ్ కోసం గుస్ల్ చేసినప్పుడు ఇక ఆ గుస్ల్ తరువాత ఉజూ చేయనవసరం లేదా?
సమాధానం: ఔను, గుస్ల్ చేసిన వెంటనే ఉజూ లేకుండా నమాజ్ చదువుకో. అలాగే ఒకవేళ నీపై కొన్ని గుస్ల్ వాజిబ్ అయి ఉంటే ఉదాహారణకు గుస్లె జనాబత్ మరియు గుస్లె జుమా; ఇలాంటప్పుడు అన్నింటి కోసం ఒక గుస్ల్ చేసుకో. ఒకవేళ ప్రత్యేకంగా గుస్లె జనాబత్ నియ్యత్ చేసుకుంటే ఇక మిగత గుస్ల్ చేయాల్సినవసరం లేదు. అదే ఒకవేళ గుస్లె జుమా చేసినట్లైతే ఈ గుస్ల్ వేరే గుస్ల్ లకు సరిపోదు.
ప్రశ్న: ఒక స్ర్తీకి గుస్లె జనాబత్, గుస్లె హైజ్ మరియు గుస్లె జుమా చేయాల్సి వస్తే ఏమి చేయాలి?
సమాధానం: ఆమె అన్ని గుస్ల్ నియ్యత్ తో ఒక గుస్ల్ చేయవచ్చు, లేదా గుస్లె జనాబత్ నియ్యత్ చేస్తే వేరే గుస్ల్ లు చేయనవసరం లేదు. ఇంతకు ముందు ప్రశ్నకు సమాధానంలో చెప్పినట్లు గుస్లె జుమా తప్ప.
రిఫ్రెన్స్
ఆయతుల్లాహ్ సీస్తానీ, తౌజీహుల్ మజాయిల్, ఇంతెషారాతే రస్తగార్, ఫార్సీ అనువాదం.
వ్యాఖ్యానించండి