ఖమర్ సూరహ్

మంగళ, 02/13/2018 - 05:37

.ఖుర్ఆన్ యొక్క 54వ సూరహ్ అయిన “ఖమర్” గురించి సంక్షిప్త వివరణ.

ఖమర్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 54వ సూరహ్ ఇది. “ఖమర్” అనగ చంద్రుడు, బింబం. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “ఖమర్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 27 సార్లు వచ్చింది. ఈ సూరహ్ లో 55 ఆయత్‍లు, 342 పదాలు మరియు 1470 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి కూడా రాలేదు. ఈ సూరహ్ మక్కా లో అవతరించబడింది. దీని కన్నా ముందు “తారిఖ్” సూరహ్ మరియు దీని తరువాత “సాద్” సూరహ్ అవతరించబడ్డాయి. “ఖమర్” సూరహ్ ను “ఇఖ్తరబతిస్సాఅహ్” మరియు “ముబ్యజ్జహ్” అని కూడా అంటారు. “ఖమర్” సూరహ్ నామకరణానికి కారణం “ఖమర్” పదంతో ఈ సూరహ్ మొదలవ్వడం. ఈ సూరహ్ యొక్క ప్రాముఖ్యత ఇందులో “షఖ్ఖుల్ ఖమర్”(అనగ దైవప్రవక్త[అ.స] చంద్రుడ్ని రెండు భాగాలుగా చేసిన) సంఘటన ప్రస్తావనం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే ఖమర్ సూరహ్ ను పఠిస్తారో వారికి అల్లాహ్ సమాధి నుండే స్వర్గపు వాహనం ద్వార లేపుతాడు”[మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ307].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ307.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 5 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13