హజ్రత్ ఫాతెమా జహ్రా [స.అ] బిరుదులు

బుధ, 03/07/2018 - 17:09

దైవప్రవక్త[స.అ] యొక్క కుమార్తె ఫాతెమా జహ్రా[స.అ] యొక్క బిరుదుల నుండి రెండు బిరుదుల వివరణ.

హజ్రత్ ఫాతెమా జహ్రా [స.అ] బిరుదులు

ధర్మనిష్ఠా, భీతీకి ఆదర్శం, అహ్లెకిసా కేంద్రం, జ్ఞాన మరియు కోమలస్వభావ సముద్రం, సభ్యత పొంగే కొలను, సహనశీలి, బేసత్ యొక్క లక్ష్యం, సమానత్వం విలాయత్, నుబువ్వత్ మరియు ఇమామత్ ను కలిపే కడియము, ఉమ్మె అబీహా, సిద్దిఖయే కుబ్రా, ఫాతెమా జహ్రా[స.అ] యొక్క జన్మదినం సందర్భంగా ఆమెను ఇష్టపడే వారందరికి శుభాకాంక్షలు.
దైవప్రవక్త[స.అ] యొక్క కుమార్తె ఫాతెమా జహ్రా[స.అ] ను చాలా బిరుదులతో గుర్తుచేస్తూ ఉంటారు. వాటి నుండి ప్రతీ బిరుదు ఆమెలో ఉన్న ఒక్కోక్క ప్రత్యేకను బట్టి ఇవ్వబడినవే. ఇస్లామీయ రివాయత్ గ్రంథాలు మరియు చరిత్ర గ్రంథాల ప్రకారం ఆమెకు 104 కన్నా ఎక్కువ బిరుదులు ఉన్నాయి. వాటి నుండి కొన్ని: జహ్రా, కౌసర్, మర్జియహ్, ముబారకహ్, ముహద్దిసహ్, ఇన్సియహ్ హౌరా, మన్సూరహ్ మరియు ఆలిమహ్ మొ॥
ఆమె బిరుదులలో చాలా ప్రఖ్యాతి చెందిన బిరుదు “జహ్రా”, అనగ కాంతి మరియు ప్రకాశించడం. ఇమామ్ జాఫరె సాదిఖ్[స.అ]తో ఫాతెమా[స.అ]ను ఎందుకు “జహ్రా” అని పేరు పెట్టారు. వారి ఇలా అన్నారు: “ఎందుకంటే ఫాతెమా ప్రార్ధన కోసం మొహ్రాబ్ లో నిలబడినప్పుడు ఆమె కాంతి ఆకాశవాసుల పై ప్రకాశించేది”                  
మరో బిరుదు “కౌసర్”, ఈ బిరుదు ఆమెకు అల్లాహ్ తరపు నుండి ఇవ్వబడినది. “కౌసర్” అనగ ఆధిక్యము, విస్తరము..., షేఖ్ తబరీ తన వ్యాఖ్య గ్రంథంలో ఇలా ఉల్లేఖించారు: “కౌసర్ అనగ దైవప్రవక్త[స.అ] యొక్క కుమార్తేతో వచ్చే ఆయన వంశం మరియు సంతానం మరియు ప్రళయదినం వరకు వారి సంఖ్య లెక్కకు మించినది. ముష్రికులు దైవప్రవక్త[స.అ]కు సంతాన భాగ్యం లేదని “అబ్తర్” అని పిలవడంతో అల్లాహ్ ఈ కౌసర్ ను ఆయనకు ప్రసాదించాడు”.[మజల్లాహ్ గుల్ బర్గ్, పేజీ58].

రిఫ్రెన్స్
మీలాదె హజ్రత్ ఫాతెమా[స.అ] మజల్లాహ్ గుల్ బర్గ్, పేజీ58, షుమారహ్ 41, ముర్దాద్ 1382.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
1 + 2 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 38