అల్లాహ్ సామీప్యం

బుధ, 01/31/2018 - 06:16

.అల్లాహ్ మనకు అత్యంత సమీపంలో ఉన్నాడు. ఆయన మనల్ని నిరంతరం చూస్తూనే ఉంటాడు.

అల్లాహ్ సామీప్యం

మేము ఈ లోకంలో పుట్టినప్పటి నుండి మరణించే వరకు అల్లాహ్ మనకు అత్యంత సమీపంలోనే ఉన్నడని గ్రహించదగ్గ విషయం. ఆయన మనకున్నంత దగ్గరగా సృష్టితాలలో ఏ ఒక్కటీ లేదు. ఆయన మనల్ని నిరంతరం చూస్తూనే ఉంటాడు. అల్లాహ్ సామీప్యం గురించి ఖుర్ఆన్ ఇలా వివరస్తుంది:
1.  (ఓ ప్రవక్తా!) నా దాసులు నా గురించి నిన్ను అడిగితే, నేను (వారికి) అత్యంత సమీపంలో ఉన్నాననీ, పిలిచేవాడు నన్ను ఎప్పుడు పిలిచినా నేను అతని పిలుపును ఆలకించి ఆమోదిస్తానని(నీవు వారికి చెప్పు) [బఖరహ్:186].
2. మేము ఆ చనిపోయేవ్యక్తికి మీ కన్నా చాలా సమీపంలో ఉంటాము. కాని మీరు మాత్రం చూడలేరు.[వాఖిఅహ్:85].
3. మేము మనిషిని సృష్టించాము. వాడి మదిలో మెదిలే ఆలోచనలు సయితం మాకు తెలుసు. మేమతని ప్రాణనాళం కంటే కూడా అతనికి చేరువలో ఉన్నాం.[ఖాఫ్:16].
4. అల్లాహ్ మనిషికీ అతని హృదయానికీ మధ్య ఉన్నాడనీ, మీరంతా ఆయన వద్దకే సమీకరించబడతారన్న సంగతిని తెలుసుకోండి.[అన్ఫాల్:24].
మనం, మనల్ని ఎవరో చూస్తున్నారు అని అనుకున్నప్పుడు మన ప్రవర్తన ఒకలాగా మరియు ఎవరూ మనల్ని చడడం లేదు అన్న సమయంలో మరోలాగా ఉంటుంది. కాని అల్లాహ్ సృష్టికర్త కాబట్టి ఆయనకు మనిషి స్వభావం తెలుసు అందుకనే ఆయన నేను నిరంతరం మీ సమీపంలో ఉన్నాను, నేను మిమ్మల్ని చూస్తూనే ఉంటాను, మీరు మీ ప్రవర్తనలలో కపటానికి గురికాకుండా జాగ్రత్తగా పడండి అని ఈ ఆయత్ ల ద్వారా చెబుతున్నాడి. 

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
8 + 3 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 39