నాౙఆత్ సూరహ్

ఆది, 04/08/2018 - 09:47

అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ పవిత్ర ఖుర్ఆన్ యొక్క 79వ సూరహ్ అయిన “నాౙఆత్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

నాజిఆత్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 79వ సూరహ్ ఇది. “నాౙఆత్”, “నాౙఅహ్” యొక్క బహువచనం అనగా జీవుల ప్రాణాలు తీసుకొని పోయేవారు (దైవదూతలు). ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “నాౙఆత్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 1 సారి వచ్చింది. ఈ సూరహ్ లో 46 ఆయత్‍లు, 179 పదాలు మరియు 785 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం ఒక్కసారి వచ్చింది. ఈ సూరహ్ మక్కాలో అవతరించబడింది. దీని కన్నా ముందు “నబా” సూరహ్ మరియు దీని తరువాత “ఇన్ఫితార్” సూరహ్ అవతరించబడ్డాయి. “నాౙఆత్” సూరహ్ నామకరణానికి కారణం ఈ సూరహ్ “నాౙఆత్” అన్న పదంతో మొదలు అవ్వడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించారు “నాౙఆత్” సూరహ్ పఠించేవాడు ఈ లోకం నుండి నిండుగా వెళతాడు, సమాధి నుండి నిండుగా లెపబడతాడు మరియు నిండుగా స్వర్గంలో ప్రవేశిస్తాడు”.[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ250].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ250.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
5 + 1 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 30