తలాఖ్ సూరహ్

శని, 03/03/2018 - 10:44

పవిత్ర ఖుర్ఆన్ యొక్క 65వ సూరహ్ అయిన “తలాఖ్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

తలాఖ్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 65వ సూరహ్ ఇది. “తలాఖ్” అనగ విడాకులు. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరహ్ లోని మొదటి ఆయత్. ఈ సూరహ్ లో “తలాఖ్” అను పదం 2 సార్లు(తల్లఖ్తుం మరియు ఫ తల్లఖూహున్న) మరియు పూర్తి ఖుర్ఆన్ లో 23 సార్లు(తల్లఖ్తుం, తల్లఖ్తుమూహున్న, యన్తలిఖ్, అల్ తలాఖ్, ముతల్లఖాత్ అని పలు విధాలుగా) వచ్చింది. ఈ సూరహ్ లో 12 ఆయత్‍లు, 289 పదాలు మరియు 1203 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 25 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మదీనహ్ లో అవతరించబడింది. దీని కన్నా ముందు “ఇన్సాన్” సూరహ్ మరియు దీని తరువాత “బయ్యనహ్” సూరహ్ అవతరించబడ్డాయి. “తలాఖ్” సూరహ్ నామకరణానికి కారణం ఇందులో “తలాఖ్” అహ్కాములు మరియు “తలాఖ్ తరువాత స్త్రీ రెండవ వివాహం చేసుకోవడానికి గడువు” గురించి ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరే సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే వాజిబ్ నమాజులలో “తలాఖ్” మరియు “తహ్రీమ్” సూరహ్ లను పఠిస్తారో అతను ప్రళయం నాడు అన్ని భయాల నుండి దూరంగా ఉంటాడు. నరకాగ్ని నుండి దూరంగా ఉంటాడు. ఈ రెండు సూరహ్ ల నిరంతర పఠనం వల్ల అతను స్వర్గంలో ప్రవేశిస్తాడు. ఎందుకంటే ఈ రెండు సూరహ్ లు దైవప్రవక్త[స.అ] సంబంధించినవి”[మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ36].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం10, పేజీ36.

tolidi: 
تولیدی

వ్యాఖ్యలు

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
2 + 18 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 17