ముహమ్మద్ సూరహ్

బుధ, 01/31/2018 - 04:48

.అంతిమ దైవప్రవక్త పేరుతో ఉన్న సూరహ్ అనగా “ముహమ్మద్” సూరహ్ గురించి సంక్షిప్త వివరణ.

ముహమ్మద్ సూరహ్

ఖుర్ఆన్ యొక్క 47వ సూరహ్ ఇది. “ముహమ్మద్” అల్లాహ్ తరపు నుండి అవతరించబడ్డ 124000 ప్రవక్తలలో చివరి దైవప్రవక్త పేరు. ఈ సురహ్ కు సంబంధించిన ఆయత్ ఈ సూరాలోని 2వ ఆయత్. ఈ సూరహ్ లో “ముహమ్మద్” అను పదం 1 సారి మరియు పూర్తి ఖుర్ఆన్ లో 4 సార్లు(ఆలేఇమ్రాన్ సూరహ్ 144వ ఆయత్ లో, అహ్జాబ్ సూరహ్ 40వ ఆయత్ లో, ఫత్హ్ సూరహ్ 29వ ఆయత్ లో “ముహమ్మద్” పదం మరియు సఫ్ఫ్ సూరహ్ 6వ ఆయత్ లో “అహ్మద్” అను పదం) వచ్చింది. ఈ సూరహ్ లో 38 ఆయత్‍లు, 543 పదాలు మరియు 2424 అక్షరాలు ఉన్నాయి. ఈ సూరహ్ లో “అల్లాహ్” పదం 27 సార్లు వచ్చింది. ఈ సూరహ్ మదీనహ్ లో అవతరించబడింది. దీని కన్నా ముందు “హదీద్” సూరహ్ మరియు దీని తరువాత “రఅద్” సూరహ్ అవతరించబడ్డాయి. ఈ సూరహ్ ను “ముహమ్మద్” కాకుండా “ఖితాల్” మరియు “అల్లజీన కఫరూ” అని కూడా అంటారు. “ముహమ్మద్” సూరహ్ నామకరణానికి కారణం ఇందులో దైవప్రవక్త[స.అ] పేరు ఉండడం. ఈ సూరహ్ ప్రతిష్టత గురించి ఇమామ్ జాఫరె సాదిఖ్[అ.స] ఇలా ప్రవచించెను “ఎవరైతే “ముహమ్మద్” సూరహ్ ను పఠిస్తారో, అతను ఎప్పటికీ ఇస్లాం ధర్మంలో సంకోచించడు, సందేహించడు మరియు అవిశ్వాసం మరియు షిర్క నుండి రక్షింపబడతాడు”[మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ159].

రిఫ్రెన్స్
మజ్మవుల్ బయాన్, భాగం9, పేజీ159.

tolidi: 
تولیدی

వ్యాఖ్యానించండి

Plain text

  • No HTML tags allowed.
  • వెబ్ పేజీ మరియు ఈ-మెయిల్ చిరునామాలు వాటికవే లింకులుగా మారిపోతాయి.
  • లైన్లు మరియు పారాగ్రాఫులు వాటికవే వస్తాయి.
6 + 11 =
Solve this simple math problem and enter the result. E.g. for 1+3, enter 4.
این سایت با نظارت اداره تبلیغ اینترنتی معاونت تبلیغ حوزه های علمیه فعالیت نموده و تمامی حقوق متعلق به این اداره می باشد.
Online: 13